The Black Gold: సంయుక్త ‘ది బ్లాక్ గోల్డ్’ రిలీజ్‌ అప్డేట్ ఇదే..
The Black Gold Samyuktha (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

The Black Gold: సంయుక్త ‘ది బ్లాక్ గోల్డ్’ రిలీజ్‌పై మేకర్స్ ఇచ్చిన అప్డేట్ ఇదే..

The Black Gold: ప్రజంట్ టాలీవుడ్‌లో ట్రెండ్‌లో ఉన్న హీరోయిన్ సంయుక్త (Samyuktha) ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియన్ యాక్షన్ డ్రామా చిత్రం చిత్రం ‘ది బ్లాక్ గోల్డ్’ (The Black Gold). యోగేష్ కెఎంసి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని మాగంటి పిక్చర్స్ భాగస్వామ్యంతో ఇటీవల ‘కె-ర్యాంప్’ (K Ramp) చిత్రంతో సంచలన విజయాన్ని అందుకున్న హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా (Razesh Danda) నిర్మిస్తున్నారు. పవర్ ఫుల్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఇంటెన్స్ పోలీస్ ఆఫీసర్‌లో పాత్రలో మునుపెన్నడూ చూడని విధంగా సంయుక్త కనిపించనున్నారు. తాజాగా చిత్ర బృందం నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఒక ప్రత్యేక పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేలా ఉండటమే కాకుండా, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read- Rukmini: నటకిరీటి వదిలిన హారర్ కామెడీ మూవీ ఫస్ట్ లుక్.. ఎలా ఉందంటే?

‘పోకిరి’ తరహా లుక్‌లో

ఈ పోస్టర్‌ని గమనిస్తే.. యాక్షన్ మోడ్‌లో సంయుక్త గన్ పట్టుకుని కనిపిస్తుంది. సూపర్ మహేష్ బాబు ‘పోకిరి’ తరహా లుక్‌లో ఇందులో సంయుక్త కనిపిస్తోంది. బ్యాక్‌గ్రౌండ్‌లో రెండు రకాల సన్నివేశాలు కనిపిస్తున్నాయి. ఒకటి ఫైర్‌తో ఉంటే.. ఇంకోటి మైనింగ్ ఏరియాను తలపిస్తోంది. యాక్షన్ లుక్‌లో సంయుక్త చాలా ఇన్వాల్వ్ అయినట్లుగా ఈ లుక్‌ తెలియజేస్తుంది. వరుస విజయాలు, యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌లతో దూసుకుపోతున్న నిర్మాత రాజేష్ దండా, ఈ పాన్-ఇండియా యాక్షన్ విజువల్‌తో ఒక కొత్త జోన్‌లోకి అడుగుపెడుతున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో, సినీ ప్రేక్షకులలో బలమైన బజ్‌ను ఏర్పడింది. ఈ పోస్టర్ విడుదల సందర్భంగా చిత్ర షూటింగ్ అప్డేట్‌ను కూడా మేకర్స్ తెలియజేశారు.

Also Read- Vishwak Sen: విశ్వక్ సేన్ నెక్ట్స్ ఫిల్మ్ టైటిల్ ఇదే.. అనౌన్స్‌మెంట్ టీజర్ అదిరింది

ఊహించని ట్విస్ట్‌లతో

ఇప్పటి వరకు ఈ సినిమా 75 శాతం షూటింగ్‌ను పూర్తి చేసుకోవడమే కాకుండా, కేవలం 15 రోజుల షూటింగ్‌లో చిత్రీకరణ మొత్తం పూర్తి చేసుకోనుందని మేకర్స్ తెలిపారు. అలాగే, చిత్రీకరణతో పాటు, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయని, ఈ సినిమా సరికొత్త కథనంతో, అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలతో, ఊహించని ట్విస్ట్‌లతో ఉంటుందని, 2026 వేసవికి ఈ చిత్రాన్ని థియేటర్లలలోకి తీసుకురానున్నామని నిర్మాతలు తెలిపారు. సంయుక్తతో పాటు మురళీ శర్మ, రావు రమేష్, నాజర్, మనీష్ వాధ్వా, రామ్కీ, రవీంద్ర విజయ్, బివిఎస్ రవి, కృష్ణ చైతన్య, చంద్రిక రవి వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సామ్ సిఎస్ సంగీతం అందిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో ఏకకాలంలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఓ సాంగ్‌ని రిలీజ్ చేయబోతున్నట్లుగా కూడా చెప్పుకొచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Uttam Kumar Reddy: నదీ జలాలపై బీఆర్ఎస్‌ను ఏకిపారేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి

Kishan Reddy: బస్తీల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటన.. ఎక్కడక్కడంటే?

The Paradise: జడల్ మరో పవర్ ఫుల్ అవతార్‌లో.. న్యూ ఇయర్ ట్రీట్ వదిలారు

New District: మరో కొత్త జిల్లాకు ప్రభుత్వం శ్రీకారం!.. ఎక్కడంటే?

Rythu Bharosa Payment: సంక్రాంతికి రైతు భరోసా నగదు జమవుతుందా?.. తాజా పరిస్థితి ఏంటంటే?