Swetcha Effect ( image credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Swetcha Effect: స్వేచ్ఛ ఎఫెక్ట్.. ఎమ్మెల్యే పిఏగా చలామణి అవుతున్న ఉపాధ్యాయుడికి షోకాజ్ నోటీసులు

Swetcha Effect:  నిజామాబాద్ రూరల్ ఎమ్మెలే పి ఏ శ్రీనివాస్ రెడ్డి,DEOఅశోక్ కు నోటీసులు జారి చేసింది హ్యూమన్ రైట్స్ కోర్టు. చాలా కాలంగా ప్రభుత్వ ఉపాద్యాయునిగా ఉండి ఎమ్మెలే పి ఏ గా పనిచేయటాన్ని తప్పు పట్టిన కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. వివరణ కోసం హాజరు కావాలని ఆదేశం జారీ చేసింది కోర్టు. విద్యా హక్కు చట్టం నిబంధనలను అతిక్రమిస్తున్నారని ఇద్దరిపై ఆర్టీఐ కార్యకర్త గోపాల్ పిర్యాదు చేశారు. నోటీసులపై స్వేచ్ఛ ప్రతినిధి వివరణ కోరడంతో DEO అశోక్ సమాధానం ఇచ్చారు. శ్రీనివాస్ రెడ్డి పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామనీ స్పష్టం చేశారు.

Also Read: Nizamabad: ఆ జిల్లాలో కష్టకాలంలో.. పార్టీ జెండా మోసినవాళ్లకే జిల్లా పరిషత్

ఎవ్వరైనా నిబంధనలు పాటించాల్సిందే

ప్రభుత్వ టీచర్లుగా ఉన్నవారు ప్రజా ప్రతినిధుల పీఏలుగా పనిచేయరాదనీ అన్నారు. ఎవ్వరైనా నిబంధనలు పాటించాల్సిందే అంటూ హెచ్చరించారు. సెలవులో ఉండటం వల్ల కోర్టు నోటీసులు చూడలేకపోయామని, అలాగే 2023 నుంచి ఇంగ్లీష్ టీచర్ అంటూ లక్షల జితలు తీసుకుంటూ పిల్లలకు విద్య చెప్పకుండా ఎంఎల్ఏ కు పీ ఏ గా పనిచేయడం పై హ్యూమన్ రైట్స్ కోర్టు ఈ ఇష్యుని సిరియస్ తీసుకుంది. సదరు ఇంగ్లీష్ టీచర్ అయినా శ్రీనివాస్ రెడ్డి కి నోటీసులు జారీ చేయడంతో ఉమ్మడి జిల్లాలో ఎంఎల్ఏ లకు పీ ఏ లుగా ఉన్న వారందరి గుండెల్లో ఒక్క సారిగా గుబులు పుట్టించే ఈ నోటీసులు ఘటన చర్చా నియాంశంగా మారింది.

Also Read: Nizamabad MLA PA: ఆ జిల్లాలో నోటీసుల కలకలం. విద్యార్థులకు చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు ఎమ్మెల్యే పీఏగా చేయడం ఏంటి?

ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా 2023 నుంచి ఎంచక్కా జీతం తీసుకుంటూ, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి వద్ద పీఏగా పనిచేస్తున్న టీచర్ శ్రీనివాస్ రెడ్డిపై విద్యాశాఖ విచారణ షురూ అయింది. ఇంగ్లీష్ టీచర్గా విధులు చేపట్టాల్సిన శ్రీనివాస్ రెడ్డి ఒక ఎమ్మెల్యేకు పీఏగా వ్యవహరించడంపై ఆర్టీఐ కార్యకర్త గోపాల్ ఫిర్యాదు చేయగా, హ్యూమన్ రైట్స్ కోర్టు సీరియస్గా తీసుకొని నోటీసులు జారీ చేయడంపై ‘స్వేచ్ఛ’ పత్రిక (Swetcha Effect) ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అనంతరం విద్యాశాఖ అధికారులు వెంటనే విచారణ మొదలు పెట్టారు.

అధికారులు రంగంలోకి

దర్పల్లి మండలం మైలారం గ్రామంలో విధులకు హాజరుకాకుండా ఎంఎల్ఎకు పీఏగా వ్యవహరిస్తున్న వ్యవహారంపై విద్యాశాఖ విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్కి విజిలెన్స్ అధికారులు వెళ్లారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం, శ్రీనివాస్ రెడ్డి ఇంతకుముందు ఎక్కడెక్కడ పనిచేశారనే దానిపై ఆరా తీశారు. ఎంతమంది ప్రజాప్రతినిధుల వద్ద పీఏగా పనిచేశాడనే విషయాలను తెలుసుకుంటున్నారు. టీచర్గా విధులు నిర్వహిస్తున్నట్లు నమ్మించి, అటెండెన్స్ వేసుకుంటూ ప్రభుత్వం నుంచి జీతం తీసుకున్నాడు. దీంతో, ఎన్ని నెలల జీతం తీసుకున్నాడు?, లీఏపై పెట్టిన ప్రొసీడింగ్స్, డీఈవోకి తెలిసే ఇదంతా జరిగిందా?, ఇలా పలు కోణాల్లో అధికారులు విచారణ జరిపారు. ఆర్టీఐ కార్యకర్త గోపాల్ 8 నెలల క్రితమే ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోలేదు, ఎందుకు విచారణ చేయలేదు?, ఒక వ్యక్తి కోర్టును ఆశ్రయించేదాక ఎందుకు నిర్లక్ష్యం వహించారు?, ఇలా చాలా అంశాలపై విచారణ జరిగినట్టు సమాచారం.

వివరణ ఇచ్చేందుకు హాజరు కావాలి

ఈ వ్యవహారంపై నిందిత టీచర్ శ్రీనివాస్ రెడ్డి, డీఈవో అశోక్కు హ్యూమన్ రైట్స్ కోర్టు ఇటీవలే నోటీసులు జారీ చేసింది. చాలా కాలంపాటు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉండి, ఎమ్మెలే పీఏగా పనిచేస్తుండాన్ని కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. దీనిపై వివరణ ఇచ్చేందుకు హాజరు కావాలని ఆదేశించింది. విద్యా హక్కు చట్టం నిబంధనలను అతిక్రమిస్తున్నారంటూ ఆర్టీఐ కార్యకర్త గోపాల్ ఫిర్యాదుతో ఈ వ్యవహారంపై తెరపైకి వచ్చింది. దీనిపై డీఈవో ‘అశోక్ను ‘స్వేచ్ఛ’ ప్రతినిధి సంప్రదించగా, శ్రీనివాస్ రెడ్ పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎవరైనా సరే ప్రజాప్రతినిధులకు పీఏలుగా వ్యవహరించకూడదని స్పష్టం చేశారు.

స్వేచ్ఛ ఎఫెక్ట్.. ఎమ్మెల్యే పిఏగా చలామణి అవుతున్న ఉపాధ్యాయుడికి షోకాజ్ నోటీసులు

విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధంగా ఓ ఉపాధ్యాయుడు ప్రజాప్రతినిధి వద్ద పీఏగా పనిచేస్తున్న ఘటనపై స్వేచ్ఛ న్యూస్ ఇచ్చిన కథనాన్ని ఇప్పటికే విద్యాశాఖ విజిలెన్స్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ తో నిజామాబాద్ డీఈవో అశోక్ ఎట్టకేలకు స్పందించారు. సదరు ఉపాధ్యాయుడు శ్రీనివాస్ రెడ్డిపై చర్యలకు ఉపక్రమించారు. అనధికారికంగా సెలవులో ఉండడమే కాకుండా.. ఎమ్మెల్యే వద్ద పీఏగా పనిచేస్తున్న ఉదంతంపై కఠిన చర్యలకు ఉపక్రమించారు. సత్వరమే వివరణ ఇవ్వాలని శ్రీనివాస్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దీంతో ఎమ్మెల్యే పీఏపై అతిత్వరలోనే శాఖాపరమైన చర్యలు ఉండవచ్చని తెలుస్తోంది. విద్యాహక్కు చట్టం నిబంధనల ప్రకారం.. పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు ప్రజా ప్రతినిధులకు పీఏలుగా విధులు నిర్వహించకూడదు.

Also Read: nizamabad crime: సవతి తల్లి కసాయిలా మారింది.. పాపం బా లిక..ఏమైందంటే!

Just In

01

Delhi Explosion: దిల్లీ బ్లాస్ట్‌పై సీపీ స్పందనిదే.. దర్యాప్తుకు ఆదేశించిన హోం మినిస్టర్

Hyderabad Alert: ఢిల్లీ కారు బాంబు పేలుడు నేపథ్యంలో.. హైదరాబాద్ లో హై అలర్ట్

Ande Sri: అందెశ్రీ అంత్యక్రియలకు హాజరుకానున్న సీఎం

King Nagarjuna: అఖిల్‌, చైతూలకు ‘శివ’ సీక్వెల్ చేసేంత ఘట్స్ లేవ్..

Swetcha Effect: స్వేచ్ఛ ఎఫెక్ట్.. ఎమ్మెల్యే పిఏగా చలామణి అవుతున్న ఉపాధ్యాయుడికి షోకాజ్ నోటీసులు