నిజామాబాద్ స్వేచ్ఛ: nizamabad crime: ఐదు సంవత్సరాల క్రితం తల్లి చనిపోవడంతో తండ్రి మరో వివాహం చేసుకోవడంతో బాలికకు కష్టాలు ప్రారంభమయ్యాయి. సవతి తల్లి ఐదు సంవత్సరాలుగా బాలికను తీవ్రమైన వేధింపులకు గురిచేస్తోంది. నాగారం గోశాల వద్ద 13 ఏళ్ల బాలికను హింసించి ఆస్పత్రుల పాలు చేసిన సవతి తల్లి రిజ్వానా బేగం, తండ్రి షేక్ హుస్సేన్ పై ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత ఆధ్వర్యంలో ఐదో టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నాగారంలోని బీడీ వర్కర్స్ కాలనీకి చెందిన షేక్ హుస్సేన్ కు నేహా కౌసర్ అనే కూతురు ఉంది. హుస్సేన్ మొదటి భార్య కూతురైన నేహా కౌసర్ ను సవతి తల్లి రిజ్వానా బేగం రాచిరంపాన పెడుతూ వేధించింది. నేహా కౌసర్ ని చిత్రహింసలకు గురిచేసరి వాళ్ల నానమ్మ దగ్గర వదిలేసింది. ఈ సంగతి తెలుసుకున్న ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత నగర నాయకురాలు శ్రీదేవి షేక్ హుస్సేన్ ఇంటికి వెళ్లి పరిశీలించగా రిజ్వానా బేగం నేహా కౌసర్ కు సవతి తల్లి నేహా కౌసర్ తల్లి గత ఐదు సంవత్సరాల క్రితం చనిపోయింది.
షేక్ హుస్సేన్ మరో పెళ్లి చేసుకోవడంతో సవతి తల్లి అయినా రిజ్వాన బేగం గత ఐదు సంవత్సరాల నుండి అమ్మాయిని హింసకు గురి చేస్తూ పాడైపోయిన అన్నం పెడుతూ రోజు గొంతు పట్టి నులుముతూ చెప్పులతో కొడుతూ వేధింపులకు పాల్పడింది. ప్రతిరోజు అర్ధరాత్రి ఇంట్లో నుంచి వెళ్లగొట్టి తెల్లారే వరకు బయటనే కూర్చోబెట్టేది అని స్థానికులు చెప్పారు విషయం తెలుసుకున్న ఐద్వా నాయకులు 5 టౌన్ ఎస్సైకి ఫిర్యాదు చేశారు.
Also Read: Telangana Earthquake: తెలుగు రాష్ట్రాలకు భూకంప భయమా? ఈ కథనం చదివితే.. తర్వాత?
ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత మాట్లాడుతూ నాగారం ఏరియా 11వ డివిజన్ పూర్తిగా హింసాత్మకంగా మారిందన్నారు. ఇక్కడ గంజాయి అమ్మే వాళ్లు మర్డర్లు చేసేవాళ్ళు, ఇతర జిల్లాల నుంచి చిన్న పిల్లల్ని తీసుకొచ్చి భిక్షాటన చేయించే వాళ్ళకు అడ్డాగా మారిందని పేర్కొన్నారు. అమాయకపు ప్రజలను ఓనర్లకు సంబంధం లేకుండానే కిరాయిలు వసూలు చేస్తూ మంచినీటి పేరుమీద డబ్బులు వసూలు చేస్తూ మేము కమిటీ సభ్యులం అని చెబుతూ ఒక రకమైన హింసకు గురి గురిచేస్తూ మేమేం చేసిన మమ్మల్ని అడిగే వారే లేదు అనే విధంగా అరాచకాలకు పాల్పడుతున్నారని తెలిపారు.
వీటిని అరికట్టే విధంగా ఐదో టౌన్ ఎస్ఐ ఈ ప్రాంతంపై స్పెషల్ ఫోకస్ పెట్టి ఇలాంటివి ఏవి జరగకుండా అరాచకాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకొని వారికి సరైన గుణపాఠం చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే హింసకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
Also Read: స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/