New Year Party: ఇదేందయ్యా ఇదీ.. ఆర్టీసీ బస్ డిపోలో మేక కటింగ్
RTC-Depo (Image source X)
నిజామాబాద్, లేటెస్ట్ న్యూస్

New Year Party: న్యూఇయర్ పార్టీకి ఆర్టీసీ బస్ డిపోలో మేక కటింగ్.. ప్రోత్సహించిన డిపో మేనేజర్!

New Year Party: ఆర్టీసీ డిపోలో న్యూఇయర్ వేడుకల కోసం మేకను కోసిన ప్రబుద్ధులు

ఈ వ్యవహారంలో డిపో మేనేజర్ పాత్ర కీలకం!

ప్రభుత్వ కార్యాలయాల్లో పదవీ విరమణ, అధికారిక గౌరవ కార్యక్రమాలు, జాతీయ పండుగలు లాంటి సందర్భాల్లో వేడుకలు నిర్వహించడానికి నిబంధనల మేరకు అనుమతి ఉంటుంది. అంతేగానీ, పార్టీలు, సిట్టింగులు వేస్తామంటూ చెల్లదు. ప్రభుత్వ ఉద్యోగులు, కార్యాలయాలు ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఉంది. కానీ, సుదీర్ఘ అనుభవం ఉండి, దాదాపు రిటైర్మెంట్‌కు దగ్గరపడ్డ ఓ ఆర్టీసీ డిపో మేనేజర్ అనుచితంగా ప్రవర్తించినట్టుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

న్యూఇయర్ పార్టీ (New Year Party) జరుపుకోవడంలో ఎలాంటి ఇబ్బంది, అభ్యంతరాలు ఉండవు. కానీ, నిజమాబాద్-1 ఆర్టీసీ డిపోకు చెందిన మేనేజర్ ఏకంగా డిపోలోనే మేక పొట్టేలును కోయించారట. సిబ్బందికి అంతగా ఇష్టం లేకపోయినప్పటికీ, త్వరలోనే తన రిటైర్మెంట్ ఉండడంతో ఇటు న్యూఇయర్, అటు రిటైర్మెంట్ పార్టీ కలిసొచ్చేలా, తాను కొంత డబ్బు ఇచ్చి మరీ మేకను కోయించిన వ్యవహారంపై స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. మేక కోయాలంటూ ఆర్డర్ ఇస్తున్న రేంజ్‌లో చెప్పడంతో కిందిస్థాయి ఉద్యోగులు ఏర్పాట్లు చేశారు.

Read Also- Lover Attacks Man: రాత్రి 1.30 గంటలకు ప్రియుడిని ఇంటికి పిలిచి.. ప్రైవేటు పార్ట్స్ కోసేసిన ప్రియురాలు

డిసెంబర్ 31న రాత్రి, అనుమతి లేకపోయినా ఆర్టీసీ డిపోలోనే దావత్ కోసం ఏర్పాట్లు చేశారు. డిపోలోపలికి ప్రైవేటు వాహనాలకు అనుమతి లేకపోయినప్పటికీ ఒక ఆటలో మేకను తీసుకొచ్చి అక్కడ కోశారు. గుట్టుచప్పుకుండా మేకను కోశారు. మేకను కోశారు. మార్నింగ్ షిప్ట్ ఎంప్లాయిస్ వచ్చేలోపే అక్కడ నుంచి ఆటలో వెళ్లిపోయారు. మరుసటి రోజు మహాలక్ష్మమ్మ గుడి దగ్గర పార్టీ చేసుకున్నారనేది సమాచారం. ఈ ఘటనకు సంబంధించి వీడియో నెట్టింట్లో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో, డిపో ఎంప్లాయిస్ సొంతంగా చేసుకోవాల్సిన న్యూఇయర్ దావత్‌ను డిపో మేనేజర్ ఇచ్చిన కొంత డబ్బుకు మరికొంత జమ చేసి పార్టీ చేసుకున్నారు. ఇలా ప్రభుత్వ కార్యాలయంలో 31 నైట్ దావత్ కోసం మేక కోయడంపై సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. బాధ్యులపై చర్యలు తీసుకుంటారా? లేదా? అనేది వేచి చూడాలి.

Read Also- Mana Doctor Babe: శ్రీ స్కంద ‘మన డాక్టర్ బాబే’ సినిమా నుంచి స్పెషల్ గ్లింప్స్ వచ్చేశాయి.. ఎలా ఉందంటే?

 

Just In

01

Lady Constable: లేడీ కానిస్టేబుల్ దుస్తులు చింపేసిన నిరసనకారులు.. షాకింగ్ వీడియో వైరల్

Parrot Deaths: నర్మదా నది ఒడ్డున తీవ్ర విషాదం.. మధ్యప్రదేశ్‌లో 200 చిలుకల మృతి

Budget 2026: దేశ ఆర్థిక దిశను నిర్ణయించే కేంద్ర బడ్జెట్ ప్రకటనకు డేట్ ఫిక్స్.. ఈ ఏడాది ఎప్పుడంటే?

Amazon Good News: అమెజాన్ కీలక నిర్ణయం… ఇండియన్ టెకీలకు గుడ్‌‌న్యూస్

Pawan Kalyan: రేపు తెలంగాణకు పవన్.. కొండగట్టులో పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే!