Suicide Case: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. జిల్లాలోని సాయి అశ్విని హాస్పిటల్(Sai Ashwini Hospital)లో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న ఓంకార్ అనే యువకుడు (27) సంవత్సరాల యువకుడు బాత్రూంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తెల్లవారుజామున చోటు చేసుకుంది. గత ఆరు సంవత్సరాలుగా ఇదే ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. యువకుడు ఓంకార్ స్వస్థలం ధర్మాదుగా పోలీసులు గుర్తించారు.
Also Read: Star Heroines: ఈ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ ఆశలన్నీ ఆ తమిళ సినిమాలపైనే!
బాత్రూంలో బలవన్మరణం
రోజువారి లాగే విధులకు వచ్చిన ఓంకార్ తెల్లవారుజామున బాత్రూంలో ఆత్మహత్య చేసుకోగా ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఓంకార్(Omkar) మృతదేహాన్ని మార్చరికి తరలించారు.. కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారి ఫిర్యాదుతో విచారణ చేపడుతున్నారు. ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న ఓంకార్ ఆస్పత్రి బాత్రూంలో బలవన్మరణానికి పాల్పడడంతో కలకలం రేపింది. యువకుడి బందువులు ఆస్ఫత్రి వద్దకు చేరుకొని ఆందోళనను ఖాళీల్ వాడిలో చేపట్టారు. యువకుడి ఆత్మహత్యకు అనుమానాలు వ్యక్తంచేస్తుూ ఆందోలనను చేసారు. దీంతో వెంటనే పోలీసుల సంఘటన వద్దకు చేరుకొని కేసు నమోదు చేసుకోని విచారిస్తున్నారు.
Also Read: GHMC: ఫిబ్రవరి 10 తర్వాత.. జీహెచ్ఎంసీ మూడు ముక్కలు

