Ustaad Bhagat Singh: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ‘గబ్బర్ సింగ్’ సృష్టించిన సునామీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సరిగ్గా అదే కాంబినేషన్, అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ మళ్ళీ జతకడితే ఎలా ఉంటుందో చూపిస్తోంది ‘ఉస్తాద్ భగత్ సింగ్’. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన న్యూ ఇయర్ స్పెషల్ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. విడుదలైన పోస్టర్‌ను గమనిస్తే.. పవన్ కళ్యాణ్ తన వింటేజ్ మాస్ లుక్‌తో అదరగొట్టారు. ఎర్రటి చొక్కా, జీన్స్ ప్యాంట్, కళ్ళకు నల్లటి అద్దాలు ధరించి.. ఒక చేతిలో వింటేజ్ టేప్ రికార్డర్, భుజంపై గన్ పట్టుకుని నడిచి వస్తున్న తీరు చూస్తుంటే థియేటర్లలో పూనకాలు రావడం ఖాయమనిపిస్తోంది. హరీష్ శంకర్ తన హీరోని ఎలా చూపిస్తే ఫ్యాన్స్ ఖుషీ అవుతారో ఈ పోస్టర్‌తో మరోసారి నిరూపించారు.
Also Read- The Paradise: జడల్ మరో పవర్ ఫుల్ అవతార్‌లో.. న్యూ ఇయర్ ట్రీట్ వదిలారు
‘దేఖ్లేంగే సాలా’ ఇచ్చిన ఊపు
ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ‘దేఖ్లేంగే సాలా’ సాంగ్ చార్ట్ బస్టర్‌గా నిలిచింది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన మాస్ ట్యూన్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎనర్జీ, హరీష్ శంకర్ డైలాగ్స్ తోడైతే బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడం పక్కా అనేది తెలియంది కాదు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన క్రేజీ హీరోయిన్లు శ్రీలీల, రాశి ఖన్నా నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో పార్థిబన్, కె.ఎస్. రవికుమార్, ఎల్ బి శ్రీరామ్, రాంకీ, ప్రభాస్ శ్రీను, సత్యం రాజేష్, జయ ప్రకాష్, వర్గీస్, మీర్ సర్వర్, ప్రవీణ్, టెంపర్ వంశీ, నవాబ్ షా, శ్రీరామ్, మాగంటి శ్రీనాథ్, కిల్లి క్రాంతి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Also Read- Vishwak Sen: విశ్వక్ సేన్ నెక్ట్స్ ఫిల్మ్ టైటిల్ ఇదే.. అనౌన్స్మెంట్ టీజర్ అదిరింది
పవన్ కళ్యాణ్ పేరు ట్రెండింగ్‌లో..
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ను అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. న్యూ ఇయర్ కానుకగా విడుదలైన ఈ పోస్టర్ పవన్ కళ్యాణ్ అభిమానులకు అసలైన పండగను తెచ్చింది. పోస్టర్లోనే ఇంత పవర్ ఉంటే, రేపు వెండితెరపై ‘ఉస్తాద్’ చేసే రచ్చ ఇంకెలా ఉంటుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా తర్వాత ‘సైరా’ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్వకత్వంలో పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రకటనను న్యూ ఇయర్ స్పెషల్‌గా మేకర్స్ వదిలారు. రామ్ తాళ్లూరి నిర్మించనున్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథను అందించనున్నారు. ఈ అప్డేట్తో పాటు, తాజాగా వచ్చిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లుక్‌తో మరోసారి పవన్ కళ్యాణ్ పేరు సోషల్ మీడియాలో టాప్‌లో ట్రెండ్ అవుతోంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

