GHMC: ఫిబ్రవరి 10 తర్వాత.. జీహెచ్ఎంసీ మూడు ముక్కలు
GHMC (imagecredit:twitter)
Telangana News, హైదరాబాద్

GHMC: ఫిబ్రవరి 10 తర్వాత.. జీహెచ్ఎంసీ మూడు ముక్కలు

GHMC: తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (టీసీయూఆర్)లోని 27 పట్టణ స్థానిక సంస్థల విలీనంతో రూపాంతరం చెందిన ప్రస్తుత జీహెచ్ఎంసీ(GHMC) ఫిబ్రవరి 10వ తేదీ తర్వాత మూడు ముక్కలుగా విభజించే కసరత్తు తుది దశకు చేరినట్లు విశ్వసనీయ సమాచారం. జీహెచ్ఎంసీలోని పాలక మండలి అధికార గడువు వచ్చే ఫిబ్రవరి 10వ తేదీతో ముగిసిన వెంటనే మూడు గ్రేటర్ కార్పొరేషన్లు చేయనున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఇవాళ జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధికారికంగా ప్రకటించే అవకాశమున్నట్లు అధికార వర్గాల సమాచారం. ప్రస్తుతం 300 వార్డులతో 2 వేల పై చిలుకు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉన్న జీహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ సైబరాబాద్, గ్రేటర్ మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లుగా ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. మొత్తం 300 మున్సిపల్ వార్డుల్లో సుమారు 150 వార్డులతో జీహెచ్ఎంసీ శంషాబాద్ వరకు విస్తరించే దిశగా ఈ పునర్విభజన ప్రక్రియ కొనసాగుతున్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీని మొదటి భాగంగా 150 వార్డులతో ఖైరతాబాద్, గొల్కొండ, చార్మినార్, సికింద్రాబాద్, శంషాబాద్, రాజేంద్రనగర్ ఆరు జోన్లతో హైదరాబాద్‌గా ఏర్పాటు చేసి, మిగిలిన 150 వార్డులను గ్రేటర్ సైబరాబాద్‌గా శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి జోన్లను కలిపి సుమారు 76 మున్సిపల్ వార్డులతో ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. మూడో భాగంగా గ్రేటర్ మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్‌గా మల్కాజిగిరి, ఉప్పల్, ఎల్బీనగర్ జోన్‌లోని 74 వార్డులను కలిపి కార్పొరేషన్లుగా ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. వార్డులకు సంబంధించి ఇప్పటికే రిజర్వేషన్లను ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఫిబ్రవరి 10 తర్వాత రానున్న ఆరు నెలల్లో మూడు కార్పొరేషన్లకు ఎన్నికల నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి రానున్న వార్డులు

– శంషాబాద్ జోన్‌లోని సర్కిల్ 15 ఆదిభట్ల పరిధిలో తొర్రూర్, కొంగర కలాన్, ఆదిభట్ల, తుర్కయంజల్
– బడంగ్‌పేట్‌లో నాదర్గుల్, ప్రశాంతి హిల్స్, జిల్లెలగూడ, మీర్‌పేట్, బడంగ్‌పేట్, బాలాపూర్
– సర్కిల్ 17 జల్పల్లిలోని షహీన్ నగర్, పహాడీ షరీఫ్, జల్పల్లి
– సర్కిల్ 18 శంషాబాద్‌లోని తుక్కుగూడ, మంఖాల్, శంషాబాద్, కొత్వాల్‌గూడ
– రాజేంద్రనగర్ జోన్ పరిధిలోకి వచ్చే సర్కిల్ 19లోని రాజేంద్రనగర్, బండ్లగూడ జాగీర్, కిస్మత్‌పూర్, హైదర్‌షాకోట్
– సర్కిల్ 20 అత్తాపూర్‌లోని అత్తాపూర్, హైదర్‌గూడ, సులేమాన్ నగర్, శాస్త్రిపురం, కాటేదాన్, మైలార్‌దేవ్‌పల్లి
– సర్కిల్ 21 బహుదూర్‌పురాలోని దూద్‌బౌలి, తీగల్‌కుంట, చందులాల్ బారాదరి, రాంనాస్‌పురా, కిషన్‌బాగ్
– సర్కిల్ 22 ఫలక్‌నుమాలోని షా అలీ బండ, ఫలక్‌నుమా, జహనుమా, నవాబ్ సాహెబ్ కుంట
-సర్కిల్ 23 చాంద్రాయణగుట్టలోని బండ్లగూడ, నూరి నగర్, బార్కాస్, కంచన్‌బాగ్, చాంద్రాయణగుట్ట
– సర్కిల్ 24 జంగమ్మెట్‌లోని రియాసత్ నగర్, లలితా బాగ్, జంగమ్మెట్, ఫూల్ బాగ్, ఖాద్రీ చమన్
– చార్మినార్ జోన్ పరిధిలోని సర్కిల్ 25 సంతోష్ నగర్‌లోని భాను నగర్, సంతోష్ నగర్, ఐఎస్ సదన్, సరస్వతి నగర్
– సర్కిల్ 26 యాకుత్‌పురాలోని గౌలిపురా, తలాబ్ చంచలం, యాకుత్‌పురా, దబీర్‌పురా, రైన్ బజార్, మాదన్నపేట్
– సర్కిల్ 27 మలక్‌పేట్‌లోని సైదాబాద్, అస్మాన్‌గఢ్, అక్బర్‌బాగ్, చావని
– సర్కిల్ 28 చార్మినార్‌లోని పురానీ హవేలీ, పత్తర్‌గట్టి, హరిబౌలి, ఖాజీపురా, ఘాన్సీ బజార్, పురానాపూల్
– సర్కిల్ 29 మూసారాంబాగ్‌లోని మూసారాంబాగ్, ఓల్డ్ మలక్‌పేట్, ఎంసీహెచ్ కాలనీ, కాలా డేరా, ఆజంపురా
– గోల్కొండ జోన్ పరిధిలోని సర్కిల్ 30 గోషామహల్‌లోని దత్తాత్రేయ నగర్, మంగళ్‌హాట్, గోషామహల్, బేగం బజార్, జాంబాగ్, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్
– సర్కిల్ 31 కార్వాన్‌లోని లంగర్ హౌస్, గుడిమల్కాపూర్, కార్వాన్, టప్పాచబుత్రా, జియాగూడ
– సర్కిల్ 32 గోల్కొండలోని నిజాం కాలనీ, నానల్ నగర్, టోలిచౌకి, గోల్కొండ, ఇబ్రహీంబాగ్, షేక్‌పేట్, ఓయూ కాలనీ
– సర్కిల్ 33 మెహిదీపట్నంలోని ఆసిఫ్ నగర్, పద్మనాభ నగర్, మెహిదీపట్నం, సయ్యద్ నగర్
– సర్కిల్ 34 మాసాబ్ ట్యాంక్‌లోని విజయనగర్ కాలనీ, అహ్మద్ నగర్, శాంతి నగర్, మల్లేపల్లి
– ఖైరతాబాద్ జోన్ సర్కిల్ 35లోని రెడ్ హిల్స్, గన్‌ఫౌండ్రీ, ఎర్రమంజిల్, సోమాజిగూడ, ఖైరతాబాద్, హిమాయత్ నగర్
– సర్కిల్ 36 జూబ్లీహిల్స్‌లోని జూబ్లీహిల్స్, వెంకటేశ్వర కాలనీ, బంజారా హిల్స్, ఫిల్మ్ నగర్
– సర్కిల్ 37 బోరబండలోని కృష్ణ నగర్, రహమత్ నగర్, కార్మిక నగర్, రాజీవ్ నగర్, బోరబండ
– సర్కిల్ 38 యూసుఫ్‌గూడలోని ఎర్రగడ్డ, వెంగళరావు నగర్, శ్రీనగర్ కాలనీ, యూసుఫ్‌గూడ, ఏజీ కాలనీ
– సర్కిల్ 39 అమీర్‌పేట్‌లోని బేగంపేట్, అమీర్‌పేట్, ఎస్ఆర్ నగర్, బీకే గూడ, సనత్ నగర్

Also Read: Vishwak Sen: విశ్వక్ సేన్ నెక్ట్స్ ఫిల్మ్ టైటిల్ ఇదే.. అనౌన్స్‌మెంట్ టీజర్ అదిరింది

గ్రేటర్ సైబరాబాద్ పరిధిలోకి రానున్న వార్డులు

– శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని సర్కిల్ 45 నార్సింగిలోని నార్సింగి, కోకాపేట్, గండిపేట్, మణికొండ, నెక్నంపూర్
– సర్కిల్ 46 పటాన్‌చెరులోని తెల్లాపూర్, ముత్తంగి, పటాన్‌చెరు, జేపీ కాలనీ
– సర్కిల్ 47 అమీన్‌పూర్‌లోని రామచంద్రాపురం, భారతీ నగర్, బీరంగూడ, అమీన్‌పూర్, బొల్లారం
– సర్కిల్ 48 మియాపూర్‌లోని హఫీజ్‌పేట్, మదీనాగూడ, చందానగర్, దీప్తిశ్రీ నగర్, మియాపూర్, మక్తా మహబూబ్‌పేట్
– సర్కిల్ 49 శేరిలింగంపల్లిలోని గచ్చిబౌలి, నల్లగండ్ల, శేరిలింగంపల్లి, మసీద్ బండ, శ్రీరామ్ నగర్, కొండాపూర్
– కూకట్‌పల్లి జోన్ పరిధిలోని సర్కిల్ 50 మాదాపూర్‌లోని అంజయ్య నగర్, హైటెక్ సిటీ, మాదాపూర్, ఇజ్జత్ నగర్, మాతృశ్రీ నగర్, మయూరి నగర్‌
– ఆల్విన్ కాలనీలోని హైదర్ నగర్, భాగ్య నగర్ కాలనీ, శంషీగూడ, ఆల్విన్ కాలనీ, వివేకానంద నగర్ కాలనీ, వెంకటేశ్వర నగర్
– సర్కిల్ 52 కూకట్‌పల్లిలోని కూకట్‌పల్లి, బాలాజీ నగర్, వసంత నగర్, కెపీహెచ్‌బీ కాలనీ, కైతలాపూర్, గాయత్రి నగర్
– సర్కిల్ 53 మూసాపేట్‌లోని అల్లాపూర్, మోతీ నగర్, మూసాపేట్, ప్రశాంత్ నగర్, బాలానగర్
– కుత్బుల్లాపూర్ జోన్ పరిధిలోని సర్కిల్ 54 చింతల్‌లోని మేస్త్రి నగర్, జగద్గిరిగుట్ట, రంగారెడ్డి నగర్, చింతల్, గిరి నగర్
– సర్కిల్ 55 జీడిమెట్లలోని గణేష్ నగర్, పద్మ నగర్, కుత్బుల్లాపూర్, పేట్ బషీరాబాద్
– సర్కిల్ 56 కొంపల్లిలోని కొంపల్లి, దూలపల్లి, సుభాష్ నగర్, సాయిబాబా నగర్
– సర్కిల్ 57 గాజులరామారంలోని మహదేవపురం, గాజులరామారం, షాపూర్ నగర్, సూరారం
– సర్కిల్ 58 నిజాంపేట్‌లోని నిజాంపేట్, బాచుపల్లి, భండారి లేఅవుట్, ప్రగతి నగర్
– సర్కిల్ 59 దుండిగల్‌లోని బహుదూర్‌పల్లి, బౌరంపేట్, దుండిగల్
– సర్కిల్ 60 మేడ్చల్‌లోని మేడ్చల్, పుదూర్ కిష్టాపూర్, గుండ్లపోచంపల్లి వార్డులు

Also Read: Bandi Sanjay: మున్సిపల్ ఆశావాహులకు బండి సంజయ్ వార్నింగ్.. ఫోన్ చేస్తే సీట్లు రావంటూ..!

గ్రేటర్ మల్కాజిగిరి పరిధిలోకి రానున్న వార్డులు

– ఇటీవల కొత్తగా ఏర్పాటైన మల్కాజిగిరి జోన్ పరిధిలోని సర్కిల్ 1 కీసరలోని కీసర, చంద్రాపురి కాలనీ, జవహర్ నగర్, దమ్మాయిగూడ, శామీర్‌పేట్, యాప్రాల్
– సర్కిల్ 2 అల్వాల్‌లోని తుర్కపల్లి, మచ్చ బొల్లారం, టెంపుల్ అల్వాల్, వెంకటాపురం, భూదేవి నగర్, కానాజీగూడ
– సర్కిల్ 3 బోయిన్‌పల్లిలోని మోండా మార్కెట్, ఫతే నగర్, ప్రకాష్ నగర్, ఓల్డ్ బోయిన్‌పల్లి, హస్మత్‌పేట్
– సర్కిల్ 4 మౌలాలిలోని బలరామ్ నగర్, వినాయక్ నగర్, మౌలాలి, కాకతీయ నగర్, నేరేడ్‌మెట్
– సర్కిల్ 5 మల్కాజిగిరిలోని ఈస్ట్ ఆనంద్‌బాగ్, మిర్జాల్‌గూడ, గౌతమ్ నగర్, మల్కాజిగిరి
– ఉప్పల్ జోన్ పరిధిలోని సర్కిల్ 6 ఘటకేసర్‌లోని నాగరం, ఘటకేసర్, ఎదులాబాద్, పోచారం
– సర్కిల్ 7 కాప్రాలోని వాంపుగూడ, కాప్రా, డాక్టర్ ఏఎస్ రావు నగర్, కుషాయిగూడ, చీర్లపల్లి
– సర్కిల్ 8 నాచారంలోని శక్తి సాయి నగర్, హెచ్‌బీ కాలనీ, మల్లాపూర్, నాచారం, హెచ్ఎంటీ నగర్
– సర్కిల్ 9 ఉప్పల్‌లోని చిల్కానగర్, బీరప్పగడ్డ, హబ్సిగూడ, రామంతాపూర్, వెంకట్ రెడ్డి నగర్, ఉప్పల్
– సర్కిల్ 10 బోడుప్పల్‌లోని మేడిపల్లి, పీర్జాదిగూడ, బోడుప్పల్, చెంగిచెర్ల
– ఎల్బీ నగర్ జోన్ పరిధిలోని సర్కిల్ 11 నాగోల్‌లోని నాగోల్, మన్సూరాబాద్, జీఎస్ఐ, లెక్చరర్స్ కాలనీ, కుంట్లూరు, పెద్ద అంబర్‌పేట్
– సర్కిల్ 12 సరూర్‌నగర్‌లోని కోదండరామ్ నగర్(కొత్తపేట), చైతన్యపురి, గడ్డిఅన్నారం, సరూర్‌నగర్, డాక్టర్స్ కాలనీ, ఆర్‌కే పురం, ఎన్టీఆర్ నగర్
– సర్కిల్ 13 ఎల్బీ నగర్‌లోని లింగోజిగూడ, చంపాపేట్, కర్మన్‌ఘాట్, బైరామల్‌గూడ, హస్తినాపురం
– సర్కిల్ 14 హయత్ నగర్‌లోని బీఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, చింతలకుంట, హైకోర్టు కాలనీ, సాహెబ్ నగర్, హయత్ నగర్

ఆ రెండు కార్పొరేషన్లకు కమిషనర్లు ఆ ఇద్దరేనా?

జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్లుగా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన సృజన(Srujana), వినయ్ కృష్ణారెడ్డి(Vinay Krishna Reddy) జీహెచ్ఎంసీ మినహా కొత్తగా ఏర్పడే గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లకు కమిషనర్లుగా వ్యవహరించనున్నారా అనే ప్రశ్నకు ఉన్నతాధికార వర్గాల నుంచి అవుననే సంకేతాలు వస్తున్నాయి. ప్రస్తుతం వీరిలో సృజన కూకట్ పల్లి(Kukatpally), కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి జోన్లలో కార్యకలాపాలను అదనపు కమిషనర్ మానిటరింగ్ చేస్తూ జోనల్ కమిషనర్లకు, కమిషనర్‌కు మధ్య సమన్వయకర్తగా, అలాగే, వినయ్ కృష్ణారెడ్డి మల్కాజిగిరి, ఎల్‌బీ నగర్, ఉప్పల్ జోన్లలో కార్యకలాపాలను మానిటరింగ్ చేస్తూ అదనపు కమిషనర్‌గా వ్యవహరిసున్నారు. ఫిబ్రవరి 10 తర్వాత ఖరారు కానున్న మూడు కార్పొరేషన్లలో సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లకు వీరిద్దరు కమిషనర్లుగా, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఆర్‌వీ కర్ణన్ కమిషనర్లుగా నియమితులవుతారనే వాదనలున్నాయి.

Also Read: The Black Gold: సంయుక్త ‘ది బ్లాక్ గోల్డ్’ రిలీజ్‌పై మేకర్స్ ఇచ్చిన అప్డేట్ ఇదే..

Just In

01

Kharif Season: అన్నదాతలకు కలిసిరాని ఖరీఫ్ సీజన్.. ఆర్థికంగా నష్టపోయిన రైతులు

Gold Rates: గోల్డ్ లవర్స్ కి షాకింగ్ న్యూస్.. నేడు భారీగా పెరిగిన బంగారం ధరలు!

Megastar Movie: మెగాస్టార్ ‘మన శంకరవరప్రసాద్ గారు’ ట్రైలర్ లాంచ్ అప్పుడేనా!.. ఎక్కడంటే?

Tobacco Tax: సిగరెట్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. ఫిబ్రవరి 1 నుంచి కొత్త ధరలు

Kotha Prabhakar Reddy: దుర్గం చెరువు కబ్జా.. బీఆర్ఎస్ నేత కొత్త ప్రభాకర్ రెడ్డిపై కేసు