Warangal District (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Warangal District: జాతీయ లోక్ అదాలత్‌తో.. కేసుల పరిష్కారానికి కృషి!

Warangal District: జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాలానుసారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ జయశంకర్ భూపాలపల్లి(Jayashankar Bhupalapally) ఆధ్వర్యంలో సెప్టెంబర్, 13వ తేదీన శనివారం రోజున జాతీయ లోక్ అదాలత్ ను నిర్వహించడం జరుగుతుందని, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్ పర్సన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.హెచ్.రమేష్ బాబు(CH Ramesh Babu) తెలిపారు. జిల్లాల్లోని పోలీసు అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు.

కేసులు పరిష్కరించుటకు సిద్ధం

ఈ సందర్భంగా గౌరవనీయులు జడ్జి మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్ లో రాజీపడదగు క్రిమినల్, సివిల్, వివాహ /కుటుంబ తగాదా కేసులు, మోటార్ వెహికల్ ఆక్సిడెంట్ కేసులు(Motor vehicle accident cases), చెక్ బౌన్స్(Check bounce) కేసులను మరియు రాజీ పడదగు ఇతర కేసులు పరిష్కరించుటకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కోర్టులలో పెండింగ్ లో ఉన్న తమ తమ కేసులను అధిక సంఖ్యలో పరిష్కరించుకొని లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలని కోరారు. కోర్టులలో లేని కేసులను ప్రీ- లిటిగేషన్ ద్వారా న్యాయసేవాధికార సంస్థలో పరిష్కరించుకోవాలని తెలిపారు.

ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకుని, ఎక్కువ కేసులు పరిష్కరించుటకు పోలీసులు(Police), ఎక్సైజ్ అధికారులు కృషి చేయాలనీ వారు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి ఏ.నాగరాజ్, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్.ఆర్. దిలీప్ కుమార్ నాయక్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి జి.అఖిల, సి.ఐ లు, ఎస్సైలు, కోర్టు కాన్స్టేబుళ్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Also Read: Double Whorls: తలలో రెండు సుడులు ఉంటే నిజంగానే రెండు పెళ్లిళ్లు అవుతాయా.. దీనిలో వాస్తవమెంత?

Just In

01

Damodar Rajanarasimha: మీ సేవలు మరువలేం.. ప్రాణాలు కాపాడే పవిత్రమైన వృత్తి మీది

Wine Mart: మందుబాబులకు గుడ్ న్యూస్.. అనంతగిరిలో వైన్ మార్ట్..!

Daggubati Family Case: నాంపల్లి కోర్టుకు దగ్గుబాటి సోదరులు.. హాజరు కాకపోతే నోటీసులు జారీ!

CM Revanth Reddy: గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి.. అనుమ‌తులివ్వాలని కేంద్ర మంత్రికి వినతి

Telangana Electricity: రికార్డును బ్రేక్ చేసేలా విద్యుత్ వినియోగం.. ఎంత వాడారో తెలిస్తే షాక్ కావాల్సిందే..?