Maoist Party( Image credit: twitter)
నార్త్ తెలంగాణ

Maoist Party: మేము శాంతి చర్చలకు సిద్ధం…కేంద్ర ప్రభుత్వం సిద్ధమేనా? స్పష్టం చేయాలి!

Maoist Party: దేశవ్యాప్త మావోయిస్టు పార్టీ కేంద్ర ప్రభుత్వంతో శాంతి చర్చలు జరిపేందుకు సిద్ధమేనని కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట మావోయిస్టులు ఐదో లేదని విడుదల చేశారు. గత కొన్ని రోజులుగా కేంద్ర ప్రభుత్వం ములుగు జిల్లా వెంకటాపురం శివారు.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా లంకపల్లి సమీపంలో ఉన్న కర్రెగుట్టల ప్రాంతంలో దాదాపు 19 రోజులపాటు మావోయిస్టులను ఏరివేసేందుకు ప్రత్యేక బలగాలతో కూంబింగ్లను నిర్వహించారు.

ఈ సందర్భంలోనే వరుసగా నాలుగు లేఖలను మావోయిస్టులు కేంద్ర ప్రభుత్వానికి రాశారు. మొదటి మూడు లేకలకు స్పందించని కేంద్ర ప్రభుత్వం నాలుగో లేక కు స్పందించి కర్రెగుట్టల ప్రాంతం నుంచి కేంద్ర బలగాలను వెనక్కి రమ్మని ఆదేశాలు జారీ చేసింది. ఈ తరుణంలో కర్రెగుట్టల ప్రాంతం నుంచి వివిధ రాష్ట్రాలకు తరలి వెళ్ళిన మావోయిస్టులను భద్రతా బలగాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఆ క్రమంలోనే సోమవారం నలుగురు మావోయిస్టులు, మంగళవారం 30 మంది మావోయిస్టులు పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో మృత్యువాత చెందారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర కమిటీ ఆదేశాల మేరకు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ పేరిట మరో లేఖను బుధవారం విడుదల చేశారు.

 Also Read: Indiramma Housing scheme: గిరిజన అభివృద్ధికి ముందడుగు.. చెంచులకు ఇందిరమ్మ ఇండ్లు!

లేఖలో పేర్కొన్న వివరాలు…
శాంతి చర్చల ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించడానికి మా పార్టీ ఎప్పుడు సిద్ధమే..! గౌరవనీయులైన మోడీ గారి ప్రభుత్వం ఇందుకు సుముఖమా… కాదా స్పష్టం చేయాలి..! ఆపరేషన్ కగర్ ను ఆపేందుకు ప్రజా సమస్యల పరిష్కారానికి శాంతి చర్చలు జరపాల్సిందిగా ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు ముందుకు రండి..! భారతదేశ వాసులకు ప్రజాస్వామిక వాదులకు శాంతి కాముకులకు అంతర్జాతీయ విప్లవ ప్రజాస్వామ్య శక్తులకు మా పార్టీ విజ్ఞప్తి..! మా పార్టీ కేంద్ర కమిటీ తరఫున నేను ప్రజా సమస్యల పరిష్కారానికి సమయావదితో కూడిన కాల్పుల విరమణ ప్రకటించి శాంతి చర్చలు జరపాలిసిందిగా ఏప్రిల్ 25న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ రెండవ ప్రకటన విడుదల చేశాను.

దీనిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెంటనే అనుకూలంగా ప్రతి స్పందించడం ఆహ్వానించదగ్గ అంశం. కానీ కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి గాని, . ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి గాని వచ్చిన ప్రత్యేక ప్రతిస్పందన చింతనీయంగా ఉంది. కాల్పుల విరమణ ప్రసక్తేలేదని, మావోయిస్టులు ఆయుధాలు విడిచిపెట్టకుండా వారితో శాంతి చర్చలు జరిపే అవకాశం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గౌరవనీయులు బండి సంజయ్ గారు,ఛత్తీస్‌గఢ్  రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, రాష్ట్ర హోంశాఖ మంత్రి గౌరవనీయులు విజయ్ శర్మ గారు ప్రకటించారు.

ఎటువంటి షరతులు లేకుండా శాంతి చర్చలు జరపడానికి ప్రభుత్వం సిద్ధమని విజయ్ శర్మ గారు పదేపదే చేసిన ప్రకటనలకు భిన్నంగా కాల్పుల విరమణ ప్రకటించకుండానే మావోయిస్టులు ఆయుధాలు విడిచిపెట్టాలని షరతు పెట్టారు. నిజానికి మా పార్టీ మా పార్టీ నాయకత్వంలో విప్లవద్యము తెలంగాణ ఛత్తీస్గడ్లకు పరిమితమై లేదు దేశవ్యాప్తంగా దాదాపు 16 రాష్ట్రాల్లో మా పార్టీ పనిచేస్తుంది అందువల్ల శాంతి చర్చల విషయంలో కేంద్ర ప్రభుత్వ హోంమంత్రి గౌరవనీయులు అమిత్ షా గారు ప్రతి స్పందించాల్సి ఉంది ఆయన ప్రతిస్పందిస్తే ఉపయోగం ఉంటుంది మా పార్టీ 2002 నుంచే శాంతి చర్చల పట్ల తన వైఖరిని ప్రకటిస్తూ వచ్చింది.

 Alao Read:  Mahabubabad district: రైతులకు 21 వేల కోట్లతో రుణమాఫీ.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు!

2004లో ప్రజల ప్రజాస్వామిక వాదుల డిమాండ్ మేరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం మా పార్టీతో చర్చలు జరిపినప్పటికీ వాటిని చివరి వరకు కొనసాగించకుండా చర్చ నుంచి ఏకపక్షంగా వైదొలిగింది ఆనాడు ఈ విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిమితమైంది కానీ 2010లో దేశంలోని పౌర సమాజం ప్రజాస్వామిక వాదులు విజ్ఞప్తి మేరకు మా పార్టీ కేంద్ర కమిటీ వైపు నుంచి కేంద్ర ప్రభుత్వంతో శాంతి చర్చలు జరిపేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసింది.

ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం శాంతి ల కోసం కృషి చేస్తున్న మా పార్టీ అధికార ప్రతినిధి కామ్రేడ్ ఆజాద్ ను కుట్రపూరితంగా పట్టుకొని హత్య చేసింది ఈ చర్చల ప్రక్రియలో భాగంగానే పశ్చిమ బెంగాల్లో మా పార్టీ పోలీస్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ రాంజీ మల్లోజులకు కోటేశ్వర్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల హత్య చేశాయి ఆనాటి నుంచి ఈనాటి వరకు శాంతి చర్చల కు సిద్ధంగానే ఉంది కానీ కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఎన్నడు అలాంటి ప్రయత్నాలు చేయకపోవడం నేడు ఆపరేషన్ కగార్ లో మా పార్టీ నాయకత్వం కేడర్లతో పాటు పెద్ద సంఖ్యలో ఆదివాసుల్ని హత్య చేయడమే కాకుండా మా పార్టీకి ఆదివాసుల అస్తిత్వానికి పెను సవాలు ఎదురైన మాట వాస్తవమే కానీ ఇందువల్లనే మా పార్టీ శాంతి చర్చలపై పత్రిక ప్రకటనలు గుప్పిస్తోంది.

గోధుమ మీడియా చేస్తున్న విషప్రచారంలో ఇసుమంత కూడా వాస్తవం లేదు బాధ్యత కలిగిన ఈ దేశ వాసుల నుంచి వచ్చిన ప్రస్తావనను మేము హృదయపూర్వకంగా స్వీకరిస్తూ వారికి ధన్యవాదాలు తెలుపుతూ వారికి నేను ఒక మెసేజ్ పంపాను దానిని వారు పత్రిక ప్రకటనగా విడుదల చేశారు. అదే మార్చి 28న 2025 విడుదలైన పత్రిక ప్రకటన తెలంగాణలో ప్రత్యేకించి అనేక వామపక్ష పార్టీలు ప్రజాసంఘాలు ప్రజాస్వామికవాదులు శాంతికాముకులు సభలు సమావేశాలు సదస్సుల ద్వారా శాంతి లకు అనుకూల వాతావరణాన్ని ఏర్పరిచేందుకు పలు ప్రయత్నాలు చేస్తున్నారు.

అర్బన్ నక్సల్స్ ముద్ర వేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇది సరైన కాదు తెలంగాణ ప్రభుత్వానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఉండడం వలన శాంతి చర్చల గురించి ముందు నుంచి తెలిసి ఉండడం వలన శాంతి చర్చల ప్రస్తావనకు వెంటనే అనుకూలంగా స్పందించింది. కాల్పులు విరమించి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలిసిందిగా ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేశారు. కాకతాళీయంగా అదే సమయంలో జరుగుతున్న భారత రాష్ట్ర సమితి రాజత్తోత్సవ సభలకు హాజరైన లక్షలాదిమంది ప్రజలను ఉద్దేశించి ఆ పార్టీ అధినేత గౌరవనీయులు కేసీఆర్ అడిగిన ప్రశ్నకు జవాబుగా మావోయిస్టులతో చర్చల ను జరపాలని ప్రజలు నిలదించారు.

Alos Read: Minister Seethakka: హామీలపై కట్టుబాటు.. ములుగు ప్రజలకు.. మంత్రి భరోసా!

నేడు దేశంలో లక్షలాదిమంది ప్రజలు శాంతి చర్చలకు కోరుకుంటున్నారు అంతర్జాతీయంగా పలు దేశాల్లో వివిధ మావోయిస్టు పార్టీల ప్రజాస్వామిక సంస్థలతోపాటు కార్మికులు రైతాంగం మధ్యతరగతి ప్రజలు కూడా మనదేశంలో మావోయిస్టులతో గౌరవనీయులైన మోడీ గారి ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే నేను ఏప్రిల్ 25న రెండవ ప్రకటన విడుదల చేశాను శాంతి చర్చలకు నేను విడుదల చేసిన ప్రకటనాలను మా పార్టీ బలహీనతగా గోడి మీడియా ప్రసారం చేయడం వారి కార్పొరేట్ ప్రభావాన్ని మరోసారి బహిర్గతం చేసింది తప్ప మరొకటి కాదు ఇకపోతే నా రెండవ ప్రకటనను ప్రతిస్పందనగా గౌరవనీయులు బండి సంజయ్ విజయ్ శర్మల ప్రతిస్పందనతో మాట్లాడిన విషయాలు చింతనీయం.వాటిలో ఏమాత్రం వాస్తవాలు లేవు.

రాజహింసకు ప్రతిస్పందనగానే మా పార్టీ సాయుధ పోరాటానికి దిగింది అనేది జగన్ ఎరిగిన సత్యం ప్రభుత్వమే చట్టాన్ని ఉల్లంఘిస్తూ మావోయిస్టులను ఆదివాసి గైరాదివాసి ప్రజలను వందలాది మందిని హత్య చేసింది మే ఏడవ తేదీన కర్రెగుటల్లో ప్రభుత్వ సాహిత బలగాలు పాశవీకంగా నిర్వహించిన హత్యాకాండలో 22 మంది కామ్రేడ్స్ అమరులయ్యారు దీంతో కర్రెగుట్టల ఆపరేషన్లు అమరులైన వారి మా కామ్రేడ్స్ సంఖ్య 26 కు చేరుకుంది ఒకవైపు శాంతి చర్చల ప్రక్రియ కొనసాగుతుండగా ఈ విధంగా హత్యాకాండ కొనసాగించడానికి తీవ్రంగా ఖండించాల్సిందిగా దేశవాసులకు ప్రజాస్వామిక వాదులకు విజ్ఞప్తి చేస్తున్నాం నిజానికి తుపాకులు పట్టుకునే వారిని కాల్చి చంపే అధికారాన్ని ఏ చట్టము ప్రభుత్వానికి ఇవ్వలేదు ఈ వాస్తవాన్ని వారు కప్పి పెట్టేందుకు సత్యాన్ని తలకిందులు చేసేందుకు పడరాని పాట్లు ఎందుకు పడుతున్నారు.

వారికే తెలియాలి కానీ ఇంతలో వారు ఎప్పుడు సఫలం కాలేదు ఇక మేము ఆయుధాలను వదిలిపెట్టి జనజీవన స్ర వంతిలో కలిసే విషయానికి వస్తే ఈ విషయంపై మా పార్టీలో ఏ ఒక్కరో నిర్ణయం తీసుకోలేదు మా పార్టీ ప్రజాస్వామికంగా పనిచేసే పార్టీ ఆపరేషన్ లో లక్షలాదిమంది పోలీసులు తారా మిలిటరీ కమాండో బలగాలు మా ఉద్యమ ప్రాంతాలను చుట్టుముట్టి ఉన్న స్థితిలో మా పార్టీలో కనీసం కోర్ అయిన సమావేశమై ఈ విషయంపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం లేకుండా పోతుంది అందువల్లనే సమయావధితో కూడిన కాల్పుల విరమణను నేను ప్రతిపాదించాను ప్రజలకు గాని మా పార్టీ కేడర్లకు గాని రక్షణ లేని పరిస్థితుల్లో ఆయుధాలు విడిచిపెట్టి ప్రభుత్వంలో చర్చలకు రావడం అసాధ్యమని పేర్కొన్నాను కనుక రెండు పక్షాల నుంచి కాల్పుల విరమణ ప్రకటిస్తే మా పార్టీ కేంద్ర ప్రభుత్వం కోర్ కలుసుకుని చర్చించుకుని అన్ని విషయాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం లభిస్తుంది.

 Also Read: Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ కు పూర్తి మద్దతు.. దేశ భద్రతపై అందరిని కేంద్రం కలుపుకుపోవాలి!

ఈ విషయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అర్థం చేసుకొని ఇప్పటికైనా సమయావతీతో కూడిన కాల్పుల విరమణ ప్రకటించి మా పార్టీతో శాంతి చర్చలకు అంగీకరించాల్సిందిగా కోరుతున్నాను ఈ సమయాన్ని మా పార్టీ దండకారణ్య ఉత్తర్ పశ్చిమ జోనల్ బ్యూరో ఇన్చార్జి కామ్రేడ్ రూపేష్ పత్రిక ప్రకటనల ద్వారా లెటర్స్ ద్వారా ఛత్తీస్‌గఢ్ ఉపముఖ్యమంత్రి విజయ్ శర్మ గారికి తెలియజేశాడు వీటిపై ఎప్పటికప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు బ్రీతింగ్ చేస్తూనే ఉన్నాడు అయినప్పటికీ ఏ విధంగానైనా మా పార్టీని మార్చి 31 2026 నాటికి నిర్మూలించే లక్ష్యంతో ఆపరేషన్ ను గౌరవనీయులైన మోడీ గారి ప్రభుత్వం కొనసాగిస్తున్నది అయితే ఈ లక్ష్యాన్ని అది సాధించడం అసాధ్యమని ఈ సందర్భంగా మరోసారి స్పష్టం చేస్తున్నాను.

కాల్పుల విరమణ చేస్తే మావోయిస్టులు బలపడతారని గౌరవనీయులైన మోడీ గారి ప్రభుత్వం గృహదీ మీడియా ప్రచారం చేస్తున్నాయి ఇది వాస్తవం కాదు ఏ దేశంలోనైనా ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలనే విప్లవకారులు బలపడేందుకు పునాది కల్పిస్తాయి సమాజంలో భూమి సమస్య ఆకలి పేదరికం సామాజిక ఆర్థిక అసమానతలు నిరుద్యోగం మహిళా సమస్య దళిత సమస్య కుల సమస్య జాతుల సమస్య తదితర మౌలిక సమస్యలు ఉన్నంతవరకు ఈ పునాది ఉంటుంది.

 Also Read: Minister Seethaka: పంచాయతీ ఎన్నికలు జరగకపోవడంతో ఇబ్బందులు.. మంత్రి సీతక్క!

ప్రభుత్వ విధానాలు ప్రజలకు అనుకూలంగా ఉంటే విప్లవకారులు బలపడే అవకాశం ఉండదు మా పార్టీ ముందుకు తెచ్చిన ప్రజా సమస్యలను పరిష్కరించే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే శాంతి చర్చలు జరిపి సమస్యలకు సరైన పరిష్కారాలను కనుగొని ఒక ఒప్పందానికి వస్తే విప్లవోద్యమ ప్రాంతాల్లో రాజ్య హింసకు మా సాయిధ పోరాటానికి పునాది లేకుండా పోతుంది శాంతి చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి గౌరవనీయులైన మోడీ గారి ప్రభుత్వం సుముఖమా కాదా స్పష్టం చేయాలి.

ఈ సందర్భంగా ఆపరేషన్ కగార్ ను ఆపేందుకు ప్రజా సమస్యల పరిష్కారానికి శాంతి చర్చలు జరగాల్సిందిగా గౌరవనీయులైన మోడీ గారి ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు ముందుకు రావాల్సిందిగా భారత దేశ వాసులకు విప్లవాప్ ప్రగతిశీల ప్రజాస్వామిక వాదులకు శాంతికాములకు కాముకులకు జర్నలిస్టులకు సామాజిక సంస్థలకు కార్యకర్తలకు ఆదివాసి శ్రేయోభిలాషులకు అంతర్జాతీయ విప్లవ ప్రజాస్వామిక శక్తులకు మా పార్టీ విజ్ఞప్తి చేస్తుంది.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈhttps://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Lunar Eclipse: నేడే చంద్రగ్రహణం.. ఆ రాశుల వారికీ పెద్ద ముప్పు.. మీ రాశి ఉందా?

Junior Mining Engineers: విధుల్లోకి రీ ఎంట్రీ అయిన టర్మినేట్ జేఎంఈటీ ట్రైనీలు!

GHMC: నిమజ్జనం విధుల్లో జీహెచ్ఎంసీ.. వ్యర్థాల తొలగింపు ముమ్మరం

MLC Kavitha: త్వరలో ప్రభుత్వానికి బుద్ధి చెబుతాం: ఎమ్మెల్సీ కవిత

Sahu Garapati: ‘కిష్కింధపురి’ గురించి ఈ నిర్మాత చెబుతుంది వింటే.. టికెట్ బుక్ చేయకుండా ఉండరు!