Maoists Surrendered: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఎదుట ఆదివాసి ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం నిర్వహిస్తున్న ఆపరేషన్ చేయుట కార్యక్రమానికి ఆకర్షితులై జనజీవన స్రవంతిలో జీవించేందుకు మావోయిస్టు పార్టీకి చెందిన వివిధ కేడర్లలో ఉన్న 38 మంది లొంగిపోయారని కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజు వెల్లడించారు. ఇందులో 8 మంది మహిళా సభ్యులతో పాటు పార్టీ మెంబర్స్ ఇద్దరు, మిలిషియా మెంబర్స్ 16, వి సి ఎం లు ఏడుగురు, కే ఏ ఎం ఎస్ సభ్యులు ఆరుగురు, సిఎన్ఎం సభ్యులు ముగ్గురు, జి ఆర్ డి లు నలుగురు మొత్తం 38 మంది సభ్యులు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోయేందుకు ముందుకు వచ్చారని విలేకరుల సమావేశం నిర్వహించిన ఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ గత కొంతకాలంగా నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ, ఆదివాసి ప్రజల్లో ఆదరణ, నమ్మకం కోల్పోయి కాలం చెల్లిన సిద్ధాంతాలతో విసిగి వేసారిన ఏజెన్సీ ప్రాంతానికి చెందిన ఆదివాసీలు తమ ప్రాంత అభివృద్ధిని కాంక్షిస్తూ మావోల చర్యను అడ్డుకునేందుకు వివిధ కార్యక్రమాలను చేపడుతున్నారన్నారు. తమ కుటుంబాలకు చెందిన మావోలు జనజీవన స్రవంతిలో కలవాలని విజ్ఞప్తి చేస్తున్నారని వివరించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మావోయిస్టులకు అనుకూలించినంత మనుగడ లభించేదాన్ని నేపథ్యంలోనే వివిధ కేడర్లలో పనిచేస్తున్న మావోలు లొంగిపోతున్నారని వెల్లడించారు.
Also Read: Operation Sindoor: భారత్ దెబ్బకు పాక్ విలవిల.. ప్రధాన నగరాలన్నీ ఖతం!
మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న సభ్యులు స్వచ్ఛందంగా పోలీసుల ఎదుట లొంగిపోవడం మంచి పరిణామం అన్నారు. దీంతో మావోయిస్టులుగా పనిచేసిన వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఆపరేషన్ కం సరెండర్ రిహాబిలిటేషన్ ప్రవేశపెడుతుందని పేర్కొన్నారు. జనజీవన స్రవంతిలో లొంగిపోయిన మావోయిస్టులకు అన్ని రకాల లబ్ధి చేకూర్చడంతో పాటు వారిపై ఉన్న రివార్డులను సైతం వారికే అందించడం జరుగుతుందన్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన మావోయిస్టు అగ్ర నాయకులు జనజీవన స్రవంతిలో కలిస్తే వారికి ప్రత్యేకమైన నగదు అందించడంతోపాటు ఇతర పునరావాస సదుపాయాలు తక్షణమే అందించడానికి పోలీస్ శాఖ కృషి చేస్తుందని తెలిపారు.
లొంగిపోయిన మావోలు
సూడి జోగా, నువ్వు పొజ్జా, మడకం హడుమ, మడకం హిడమ, సోయం వాగ, సున్నం అశోక్, సున్నం గణేష్, మడవి ముకరం, మడవి గంగ, మడకం మంగుడు, కాల్మో డున్నేష్, మడవి ముయ, కోవసి అయిత, మూసకి లక్మ, సోడి మూడ, కట్టం రమేష్, కాల్మో దేవేంద్ర, పాయం సతీష్, మడవి దేవే, సోడి మాసే, సోయం సోనీ, సోయం హడం, సోడి పండు, పోడియం లఖ, కాల్మో దేవ, పోడియం మడ, కాల్మో గంగి, గొన్చే రానో, కట్టం రాము, పోడియం భరత్, పోడియం సాల్ము, మడకం హుగి, కాల్మో దుల, మడకం మల్ల, హేమ్ల రమేష్, మడివి ముఖ లు చతిస్గడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాకు చెందినవారు. వీరందరూ మావోయిస్టు పార్టీలో వివిధ క్యాడర్లలో పనిచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆపరేషన్ చేయుత, సరెండర్ కం రిహాబిలిటేషన్ కార్యక్రమాలకు ఆకర్షితులై లొంగిపోయినట్లుగా కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజ్ వెల్లడించారు.
Also Read: Nuclear Bomb: పాక్ నుంచి అణు ముప్పు.. ఏం చేయాలి? ఏం చేయకూడదు?