Operation Sindoor: పాక్ (Pakistan) తోక వంకర అని ఊరికే అనలేదు. మనమేమో ఉగ్రవాదులను టార్గెట్ చేసుకుని దాడులకు పాల్పడుతున్నాం. కానీ, ‘పాపి’స్థాన్ మాత్రం ముష్కర మూకకు ఆశ్రయం కల్పించడమే కాకుండా, భారత్‌లోని సామాన్యులను టార్గెట్ చేసుకుని దాడులకు తెగబడుతున్నది. ఆపరేషన్ సింధూర్‌తో రగిలిపోతున్న ఆ దేశం, తన కపట బుద్ధిని మరోసారి ప్రపంచానికి చూపిస్తున్నది. ఓవైపు, సరిహద్దుల్లో కాల్పులు జరిపి సామాన్యులను పొట్టనపెట్టుకుంటుండగా, ఇంకోవైపు భారత వైమానిక, ఆర్మీ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడింది. మన భద్రతా బలగాలు సమర్ధవంతంగా తిప్పటికొట్టాయి.
బుధవారం అర్ధరాత్రి తర్వాత పాక్ దాడులు
ఆపరేషన్ సింధూర్‌కు ప్రతీకారంగా పాకిస్థాన్ బుధవారం అర్ధరాత్రి తర్వాత దాడులకు తెగబడింది. శ్రీనగర్ (Srinagar), అవంతిపుర, అమృత్ సర్, కపుర్తల, జలంధర్, లూధియానా, భటిండా సహా 17 ప్రాంతాలను టార్గెట్ చేసుకుని డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడింది. అయితే, పాక్ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. భారత బలగాలు సమర్ధవంతంగా తిప్పికొట్టాయి. గురువారం ఉదయం పాక్ ఎంత తీవ్రతతో దాడులు చేసిందో భారత్ కూడా అదే స్థాయిలో ప్రతిస్పందించింది.
Read Also- CM Revanth Reddy: దేశమంతా ఒక్కటిగా నిలిచి ఉగ్రవాదాన్ని కూల్చేద్దాం.. సీఎం పిలుపు!
ఉన్నతాధికారుల బ్రీఫింగ్
పాక్‌పై జరిపిన దాడులకు సంబంధించిన వివరాలను గురువారం మధ్యాహ్నం విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మీడియాకు వివరించారు. లాహోర్ (Lahor) ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నిర్వీర్యం చేశామని తెలిపారు. సరిహద్దుల్లో దాడులను పెంచిన పాక్, మోర్టార్లు, బాంబులు ఉపయోగిస్తున్నదని వివరించారు. ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక దాడుల్లో పాక్ ప్రమేయం ఉన్నదని రుజువైందని తెలిపారు. ఇదంతా మొదలు పెట్టింది పాకిస్థానే అని, మేం స్పందిస్తున్నాం అంతేనని అన్నారు
పాక్ దాడులు
ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా లాహోర్‌పై జరిగిన దాడికి ప్రతి స్పందనగా పాక్ విరుచుకుపడింది. భారత సరిహద్దు రాష్ట్రాలను టార్గెట్ చేసుకుని దాడులకు తెగబడింది. ముందుగా జమ్మును లక్ష్యంగా చేసుకుని డ్రోన్స్, క్షిపణులతో దాడికి ప్రయత్నించింది. జమ్ములో ఏడు చోట్ల పేలుళ్ల శబ్దాలు వినిపంచాయి. పఠాన్ కోట్ ఎయిర్ స్పేస్‌ను టార్గెట్ చేసిన పాక్, సరిహద్దు ప్రాంతాలలోనూ కాల్పులు జరుపుతున్నది. యాంటీ మెసేజ్ సిస్టంకు దొరకకుండా డ్రోన్లను ఉపయోగించేందుకు చూసింది. దీంతో భారత్ కౌంటర్ ఎటాక్ మొదలు పెట్టింది. పాక్‌కు చెందిన 4 ఎఫ్ 16 యుద్ధ విమానాలను కూల్చివేసింది. అలాగే, డ్రోన్స్, 8 క్షిపణులను నేలమట్టం చేసింది.
‘పాపి’స్థాన్‌కు చుక్కలు
పాకిస్థాన్ దాడుల నేపథ్యంలో భారత్ కౌంటర్ ఎటాక్ కొనసాగించింది. మెరుపు దాడులు చేసింది. పాక్ రాజధని ఇస్లామాబాద్ సహా లాహోర్, సియోల్ కోట్, మహల్‌వాల్‌పూర్‌పై విరుచుకుపడింది. మొత్తం 12 నగరాల మీద దాడులు జరిగాయి. పాకిస్థాన్ ప్రధాని ఇంటికి 20 కిలోమీటర్ల దూరంలో భారీ పేలుళ్లు సంభవించాయి. అక్కడి ఆర్మీ చీఫ్ మునిర్ రహస్య బంకర్‌లో తలదాచుకున్నట్టు సమాచారం. గురువారం రాత్రి భారత్ మెరుపు దాడులతో పాకిస్థాన్‌కు కోలుకోలేని నష్టం జరిగింది.
రాజ్ నాథ్ అత్యవసర భేటీ
భారత్, పాక్ యుద్ధ వాతావరణం నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ త్రివిధ దళాధిపతులు, సీడీఎస్‌తో అత్యవసరంగా సమావేశమయ్యారు. సరిహద్దు జిల్లాల్లో పూర్తిగా బ్లాక్ ఔట్ ప్రకటించడం, పాక్ దాడులపై ఆరా తీశారు. మరోవైపు, సైనిక చర్యలను ప్రధాని మోదీ నిశితంగా పరిశీలిచారు.
Read Also- Naa Anveshana: ఉగ్రవాదానికి లింక్ చేస్తూ.. మరో ఇద్దరు బెట్టింగ్ రాయుళ్లను అన్వేష్ ఉతికారేశాడు!
పాక్ పైలట్ గుర్తింపు
రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో పాకిస్థాన్ పైలట్‌ను భారతదేశం సజీవంగా పట్టుకున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. భారత్ ప్రతి దాడులతో పాక్ యుద్ధ విమానాలు కూలిపోయాయి. ఈ క్రమంలోనే పాక్ సైనికుడిని గుర్తించారు.
కరాచీ పోర్ట్ ఖతం!
భారత నౌకాదళ దాడిలో కరాచీ పోర్ట్ ధ్వంసమైంది. దీతో పాక్ సముద్ర ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టం వాటిల్లింది. ఐఎన్ఎస్ విక్రాంత్, కోల్‌కతా క్లాస్ డిస్ట్రాయర్ కలిసి కరాచీ పోర్టు మీద క్షిపణుల వర్షం కురిపించడంతో అగ్ని కీలల్లో కరాచీ పోర్ట్ చిక్కుకున్నది.
ఐపీఎల్ మ్యాచ్ నిలిపివేత
పాక్ దాడుల నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచ్‌ను నిలిపివేశారు. ధర్మశాలలో పంజాబ్, ఢిల్లీ మధ్య గురువారం మ్యాచ్ జరగాల్సి ఉన్నది. బ్లాక్ ఔట్ కారణంగా ఫ్లడ్ లైట్స్ ఆఫ్ చేశారు. తక్షణం ప్రేక్షకులను స్టేడియం వీడి వెళ్లిపోవాలని సూచించారు. 11న ధర్మశాలలో జరగాల్సిన మ్యాచ్‌ను ఇప్పటికే అహ్మదాబాద్‌లో జరపాలని బీసీసీఐ నిర్ణయించింది. హై సెక్యూరిటీ మధ్య ఇరు జట్లను సురక్షిత ప్రాంతానికి తరలించారు. రైలు మార్గంలో ఢిల్లీ టీమ్‌ను ఢిల్లీకి తరలించే ఏర్పాట్లు చేశారు. పంజాబ్ టీమ్‌ను కూడా రైలు మార్గంలో అహ్మదాబాద్ తరలించారు. స్టేడియంలో ప్రేక్షకులు పూర్తిగా బయటకు వెళ్ళే వరకు ఒక స్టాండ్ వైపు మాత్రమే లైట్స్ ఆన్ చేసి పంపించారు. తొక్కిసలాట జరగకుండా ప్రేక్షకులు సురక్షితంగా బయటకు వెళ్లేలా పోలీసులు, ఆర్మీ చర్యలు తీసుకున్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు