Naa Anveshana
ఎంటర్‌టైన్మెంట్

Naa Anveshana: ఉగ్రవాదానికి లింక్ చేస్తూ.. మరో ఇద్దరు బెట్టింగ్ రాయుళ్లను అన్వేష్ ఉతికారేశాడు!

Naa Anveshana: నా అన్వేషణ, ప్రపంచ యాత్రికుడు అయిన నా అన్వేష్.. మరో ఇద్దరు బెట్టింగ్ యాప్స్ (betting apps) ప్రమోట్ చేస్తున్న వారిని వెలికితీశాడు. వారిద్దరిపై వీడియో చేసి, ప్రశ్నల వర్షంతో ఉతికారేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. ఆ ఇద్దరు ఎవరు? వారేం చేస్తున్నారు. ఉగ్రవాదానికి వారికి లింక్ ఏంటి? అనేది ఆయన మాటల్లోనే..

‘‘పెద్ద రాయుడు మన ట్రక్ వ్లాగ్స్ (Mana Truck Vlogs).. చినరాయుడు బ్రో లక్ష్మణ్ (Bro Lakshman). వీళ్లిద్దరూ పేద కుటుంబం నుంచే వచ్చారు. ముందు పెదరాయుడు మన ట్రక్ వ్లాగ్స్ విషయానికి వస్తే.. ఈ అబ్బాయిది పేద కుటుంబం. డ్రైవర్‌గా చేస్తుంటాడు. ఒక జిల్లా నుంచి, ఇంకో జిల్లాకు.. ఇక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి సరుకు రవాణా చేస్తుంటాడు. అది మనకు వీడియో తీస్తుంటాడు. అంతా బాగానే ఉంది. ఫస్ట్‌లో ధీరా అనే కోతిని, తర్వాత కుక్కల్ని, ఇతర జంతువుల్ని పట్టుకుని వెళుతూ మనల్ని ఎంటర్‌టైన్ చేస్తూ ఉండేవారు. అంత వరకు బాగానే ఉంది. యూట్యూబ్‌లో 15 నుంచి 20 లక్షల మంది సబ్‌స్ర్కైబర్స్ ఉన్నారు. ఆ మనీతో మహా అయితే ఒక కారు కొనగలడు. కానీ, మూడు లారీలు, ఒక బస్సు, రెండు పెద్ద పెద్ద కార్లు కొన్నాడు. వాళ్ల సబ్‌స్ర్కైబర్స్‌తో మాట్లాడుతుంటే, విపరీతంగా వాళ్లు మెసేజ్‌లు చేస్తున్నారు.

Also Read- Chiranjeevi: ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సీక్వెల్ ఎవరితో చేయాలో చెప్పేసిన చిరంజీవి..

భయ్యా.. మేము పలానా యాప్ ఆడి నష్టపోయాం. నష్టపరిహారం చెల్లించండి భయ్యా అని అడుగుతున్నారు. ఆయన కొన్న వాహనాల వీడియోల కింద అందరూ బెట్టింగ్ డబ్బులతో కొన్నాడు అంటూ తిట్టిపోస్తున్నారు. ఆ అబ్బాయిని అడిగితే మానేశాను అని చెబుతున్నాడు కానీ, ఆయన సబ్‌స్ర్కైబర్స్ మాత్రం ఆ అబ్బాయి చేస్తాడు, ఆపేస్తాడు అంటూ చెప్పుకొచ్చారు. ఆ అబ్బాయిని ఒకటే అడుగుతున్నాను. బ్రో.. నువ్వు వచ్చింది ఒక పేద కుటుంబం నుంచే కదా. ప్రపంచంలో ఏ లారీ డ్రైవర్‌కి లేనంత అదృష్టం నీకు వచ్చింది కదా. నిన్ను ఫాలో అయ్యేది ఎవరు? డ్రైవింగ్ ఫీల్డ్‌లో ఉన్నవారు. నువ్వు చెప్పిన యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకుని, ఆడి ఎన్ని ఫ్యామిలీలు రోడ్డున పడ్డాయో తెలుసా? నువ్వు ప్రమోట్ చేసిన యాప్స్ అన్నీ ఇల్లీగలే. కొంచమైనా జ్ఞానం ఉందా? నువ్వు కొన్న వాహనాల బ్రాండ్స్‌కి ఓనర్ ఎవరో తెలుసు. కానీ, నువ్వు ప్రమోట్ చేసిన యాప్స్‌కి ఓనర్ ఎవరనేది ఎప్పుడైనా కనుక్కున్నావా? నువ్వు మాత్రం అన్నీ బ్రాండెడ్‌వి కొనుక్కున్నావ్. ఎందుకంటే, యాక్సిడెంట్స్ అవకూడదు, చచ్చిపోకూడదని.

కానీ, నువ్వు ప్రమోట్ చేసిన యాప్స్ వల్ల ఎంత మంది చనిపోయారో తెలుసా? ఒక్క వాహనం అమ్మి.. వారిని ఆదుకుంటావా? ప్రతి ఒక్కరూ కష్టపడుతున్నారు. నువ్వు డ్రైవింగ్ ఫీల్డ్‌లో కష్టపడుతున్నానని అంటావ్. నిజంగా నీకు కష్టం విలువ తెలుసా? నువ్వు యూట్యూబ్‌లో ఒకటి కాకపోతే మూడు వీడియోలు పెట్టు. డ్రైవింగ్ ఫీల్డ్‌లో ఎవరూ మద్యం సేవించవద్దని చెప్పు. డ్రైవింగ్‌కి సంబంధించి ఎన్ని జాగ్రత్తలైనా చెప్పవచ్చు. అవన్నీ వదిలేసి, బెట్టింగ్ బాట పట్టావ్. చనిపోయిన వారిని నువ్వు ఏమైనా ఆదుకుంటావా? ఆ ఫ్యామిలీల కుటుంబాలని నువ్వు ఏమైనా దత్తత తీసుకుంటావా? దయచేసి ఇంకెప్పుడూ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయకు. ఇంకా నీకు చేతనైతే వారికి సాయం చెయ్. కాస్త పుణ్యం వస్తది.

Also Read- Raghava Lawrence: ఏడాది కష్టం చెదలు పాలు.. లారెన్స్ మనసు కరిగిపోయింది

ఇక లక్ష్మణ్ అలియాస్ ‘బ్రో’ విషయానికి వస్తే.. ఈ అబ్బాయి ఆటో డ్రైవర్. సినిమా రిలీజ్ అయిన రోజు రివ్యూలు చెప్పమని మైకులు పెట్టగానే పిచ్చి పిచ్చిగా యాక్ట్ చేసే వాడే లక్ష్మణ్. అవి, ఇవి మీద పోసేసుకుని, క్రేజీగా సమాజంలో ఫేమస్ అయిపోయాడు. రివ్యూ ఛానల్స్ అన్నీ ఆయనని ఫేమస్ చేశాయ్. ఎన్నో కష్టాలు పడి, దేవుడి దయ వల్ల చివరికి ఫేమస్ అయ్యాడు. యూట్యూబ్‌లో 10 లక్షల సబ్‌స్క్రైబర్స్‌ని తెచ్చుకున్నాడు. చిన్న చిన్న అవకాశాలు వస్తున్నాయి. నువ్వు ఏం చేసినా డబ్బులొస్తున్నాయి. నిన్ను ఫేమస్ చేయకపోయి ఉంటే, ఇంకా నువ్వు ఆటోనే నడుపుకుంటూ ఉండేవాడివి. ఫేమస్ చేసిన పాపానికి పిచ్చి పిచ్చి బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేస్తున్నావు. ఏరోజైనా నేను తప్పు చేశానని ఫీలయ్యావా? నా వల్ల ఒక ఫ్యామిలీలో ఎవరైనా చనిపోయి ఉంటే, వారి ఫ్యామిలీల పరిస్థితి ఏంటి? అని ఏరోజైనా ఫీలయ్యావా? పాపం, పుణ్యం అనేవి కొన్ని ఉంటాయి.

మీరు ప్రమోట్ చేసే ప్రతి యాప్‌ని నేను డౌన్‌లోడ్ చేసి చెక్ చేస్తున్నాను. గంటగంటకి అకౌంట్‌లు మారిపోతున్నాయి. ఆ డబ్బులు ఉగ్రవాదులకు వెళ్లడం లేదని నమ్మకమేంటి? ఎవడో ఇస్తాడు మీకు? వాడెవడో కూడా మీకు తెలియదు. మీకు డబ్బులు వస్తాయి. నాకు తెలియక అడుగుతున్నాను. ఇప్పుడు ఉగ్రవాద సంస్థలకు బిర్యానీలు, రొట్టెలు వంటివి ఎవడిస్తాడు? మీరు ప్రమోట్ చేసే బెట్టింగ్ యాప్‌ల ద్వారానే వెలుతుంది. మీరు తెలుసుకోవాలి. మిమ్మల్ని ఫేమస్ చేసిన పాపానికి వాడి కొరివి వాడే పెట్టుకుంటున్నాడు. మొన్న ఉగ్రదాడిలో 30 మందే చనిపోయారు. కానీ ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎందరో చనిపోయారు. మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. బెట్టింగ్ బాధితులకు సహాయం చేస్తారని అనుకుంటున్నాను. అందరూ బాగానే సంపాదించుకున్నారు. ఆస్తులు కొనుక్కున్నారు. పాపం, పుణ్యం పైవాడు చూసుకుంటాడు’’ అని నా అన్వేష్ ఇందులో చెప్పుకొచ్చాడు. దీనికి నెటిజన్లు.. ఈ ఇద్దరూ మిస్ అయ్యారనుకున్నాం.. భలే పట్టేశావే. జాగ్రత్త అన్నా.. అందరి కళ్లు నీ మీదే ఉన్నాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం