Mahabubabad district: cని ఆరోపించారు. అప్పుల్లో ఉన్న తెలంగాణ రాష్ట్రానికి సీఎం అయిన రేవంత్ రెడ్డి ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా పాలన ప్రభుత్వాన్ని నడిపిస్తూ ప్రజల కోసం పరితపిస్తున్నాడని పేర్కొన్నారు.
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం లక్ష్మీనరసింహాపురం గ్రామంలో రూ.2.98 కోట్లతో 33/11 కెవి సబ్ స్టేషన్ కు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు మురళి నాయక్, కనకయ్య, రామచంద్రనాయక్, రాందాస్ నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు.
అనంతరం నిర్వహించిన సభలో డిప్యూటీ సీఎం బట్టి మాట్లాడుతూ… బయ్యారం మండలంలో రైతులకు ఇబ్బందులకు కలగకూడదని ఉద్దేశంతో స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య పట్టుపట్టి మరి సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరిన నేపథ్యంలో లక్ష్మీనరసింహపురంలో సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తున్నామన్నారు. ఇక్కడ విద్యుత్తు ఉంటే సరిపోదని, రైతులు రెండు పంటలు పండించుకోవాలంటే నీరు అత్యవసరమని గుర్తించమన్నారు. ఇందుకోసం సమీపంలోని తులారం ప్రాజెక్టు, బయ్యారం చెరువు పనులను యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు.
Also Read: Crime News: పట్టపగలే హత్య.. ప్లాన్ చేసి హతమార్చిన నిందితులు!
అధికారంలోకి వచ్చాక 57 వేల ప్రభుత్వ ఉద్యోగాలు, 35 వేల నోటిఫికేషన్లు
రాష్ట్రాన్ని అప్పులు చేసి దివాళ చేయించిన బిఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్కు పట్టం కట్టిన యువతకు అధికారంలోకి రాగానే 57 వేల ఉద్యోగాలను ఇచ్చామన్నారు. అదేవిధంగా ఉద్యోగ కల్పన కోసం 35 వేల నోటిఫికేషన్లు జారీ చేశామన్నారు. యువతకు ఉపాధి కల్పించేందుకు తొమ్మిది వేల కోట్లతో రాజీవ్ యువ వికాసం పథకాన్ని తీసుకొచ్చామన్నారు. ఒక్క ఇల్లందు నియోజకవర్గంలోనే 5000 మందికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కల్పించేందుకు శాంక్షన్ లెటర్ ఇచ్చి వారికి ప్రత్యేక ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు.
ఆదిలాబాద్ నుండి భద్రాచలం వరకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు
రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా నుండి భద్రాచలం వరకు గోదావరి పరివాహక ఏజెన్సీ ప్రాంతాల రైతులకు ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాలను జారీ చేస్తామన్నారు. ఇందిరా సౌర గిరిజన వికాసం పథకంతో రూ.12 వేల కోట్లతో బోర్ వెల్స్, సోలార్, డ్రిప్ ఇరిగేషన్, స్ప్లింకర్లను పంపిణీ చేస్తామన్నారు. ఇలాంటి సౌకర్యంతో ప్రతి ఆరు నెలలకు క్రాఫ్ డెవలప్మెంట్ వచ్చేలా కృషి చేస్తామన్నారు. భారతదేశ చరిత్రలోనే ఇలాంటి పథకం ఎక్కడా లేదని, ఒక తెలంగాణలో మాత్రమే అమలు చేయడం సీఎం రేవంత్ రెడ్డి ఘణతేనన్నారు.
కస్తూర్బా నగర్ పోడు భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చేస్తామన్నారు. 200 యూనిట్ల ఉచిత కరెంటు ను 85 నుంచి 90 శాతం ప్రజలకు ఉచితంగా అందిస్తున్నామన్నారు. రైతులకు బోర్ వెల్స్ ఉచిత కరెంటు రూ.12,500 కోట్లతో అమలు చేస్తున్నామన్నారు. రూ.21 వేల కోట్లతో రైతులకు రుణమాఫీ, రూ.18,000 కోట్లతో రైతు భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రైతులకు ఏడాదికి ఒక్కో ఎకరానికి రూ.12000, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద కూలీలకు రూ.12000 లను సైతం అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.5లక్షల నుంచి రూ.10 లక్షలకు ప్రభుత్వం పెంచి ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందిస్తుందన్నారు. ఈ పథకం 90 లక్షల మంది కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తుందన్నారు. అదేవిధంగా 90 లక్షల మంది లబ్ధిదారులకు రూ. 13 వేల కోట్లతో సన్న బియ్యం పథకాన్ని అందిస్తుంది అన్నారు. కాంగ్రెస్ అమలు చేసే ప్రతి పథకం నిరుపేద ప్రజల కోసమేనని స్పష్టం చేశారు.
Also Read: Bhatti Vikramarka: అర్హులందరికీ ఇండ్లు.. డిప్యూటీ సీఎం హామీ..
నిరుపేదల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బిఆర్ఎస్ కూల్చాలని కుట్ర చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో వచ్చిన ఆదాయంతోనే సంక్షేమ పథకాలను నడిపిస్తున్నామన్నారు. నాటి కెసిఆర్ ప్రభుత్వంలో పైసా ఖర్చు చేయకుండా దోచుకునేందుకే పనిచేశారని వెల్లడించారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు