Bhatti Vikramarka: సంక్షేమం అంటేనే ఇందిరమ్మ.. ఆమె రాజ్యంలోనే 20 సూత్రాల పథకం ద్వారా అనేక సంక్షేమ పథకాలు అమల్లోకి వచ్చాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. మంగళవారం మహబూబాద్ జిల్లా బయ్యారం మండలం గంధంపల్లి లో ఇందిరమ్మ ఆవిష్కరణ సభలో ఆయన మాట్లాడారు.
ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు భూముల పంపిణీ, బ్యాంకుల జాతీయకరణ జరిగాయని వివరించారు. ఇందిరమ్మ అంటేనే పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం అన్నారు. ఇందిరమ్మ పేరిట ప్రభుత్వం తీసుకొస్తామని ఎన్నికల ముందు మేము చెప్పిన మాటను విశ్వసించి మమ్ములను ఆశీర్వదించి అధికారంలోకి తీసుకువచ్చారని గుర్తు చేశారు.
Also read: Konda Surekha: జూపార్కుల సంరక్షణకు కృషిచేయాలి.. అధికారులకు మంత్రి ఆదేశం!
ఇందిరమ్మ ప్రభుత్వంలో ప్రతి పేదవానికి 5 లక్షలతో ఇండ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం గురించి మేము ప్రకటించిన మొదట్లో ఇది సాధ్యమా అని హేళనగా మాట్లాడారు. ఇవాళ మేము ఇందిరమ్మ ఇల్లు కట్టి చూపిస్తున్నాం అన్నారు.
ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్ల చొప్పున నిర్మించేందుకు 22,500 కోట్ల వ్యయం చేస్తున్నామన్నారు. పేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యను అందించేందుకు 25 ఎకరాల్లో 200 కోట్లతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ఒక్కొక్క పాఠశాల నిర్మిస్తున్నట్టు తెలిపారు.
దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి హయాంలో రాష్ట్రంలో మూడున్నర లక్షలకు పైగా గిరిజనులకు అటవీ భూములపై హక్కులు కల్పించగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజన రైతులను ఇబ్బందుల పాలు చేసిందని అన్నారు.
Also read: HPCL Recruitment 2025: హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసుకోండి
గిరిజన రైతులకు భరోసా ఇచ్చేందుకు ఈనెల 18న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో ఇందిరా గిరిజనుల వికాసం పథకాన్ని ప్రారంభిస్తున్నాం అన్నారు.