Konda Surekha(image credit:X)
తెలంగాణ

Konda Surekha: జూపార్కుల సంరక్షణకు కృషిచేయాలి.. అధికారులకు మంత్రి ఆదేశం!

Konda Surekha: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జోన్ల సీసీఎఫ్ లు, అన్ని జిల్లాల‌ డీఎఫ్ఓల‌తో మంత్రి కొండా సురేఖ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్టవ్యాప్తంగా ఉన్న అడ‌వుల్లో అగ్ని ప్రమాదాల నివార‌ణ‌కు ఏం పరికరాలు వాడుతున్నారని అధికారుల‌ను అడిగి ఆరా తీశారు.

ఒకేసారి పెద్ద అగ్ని ప్రమాదాలు జ‌రిగితే వాటిని నివారించేందుకు అన్ని పరికరాలు అందుబాటులో ఉన్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఏ జిల్లాలో ఎక్కువ అగ్నిప్రమాదాలున్నాయి వాటి వల్ల వ‌న్యప్రాణులు ఇబ్బందులు ప‌డ‌కుండా ఏం చ‌ర్యలు తీసుకుంటున్నారని అడిగి తెలుసుకున్నారు.

కాగా మంత్రి వైల్డ్ లైఫ్ బోర్డు ఉన్నతాధికారులతో మాట్లాడారు. వేస‌వి దృష్ట్యా అడ‌వుల్లో జూల‌లో వ‌న్యప్రాణుల‌ మరియు ఇత‌ర జంత‌ువులకు త‌గిన తాగునీటి స‌దుపాయాల క‌ల్పన సరిగ్గా ఉందా, లేదా అని అడిగి తెలుసుకున్నారు. అయితే, ఈ వేస‌విలో జంతువుల కోసం 2,168 నీటి గుంత‌లు ఏర్పాటు చేసిన‌ట్టు మంత్రికి అధికారులు వివ‌రించారు.

Also read: Ashok Bendalam: ‘ఎందుకంత కొవ్వు’ అని రెచ్చిపోయిన టీడీపీ ఎమ్మెల్యే.. వీడియో వైరల్

నీటి గుంత‌ల్లోకి నీటిని ప్రతిరోజూ ట్రాక్టర్ ట్యాంక‌ర్ల ద్వారా ఎప్పటిక‌ప్పుడు తీసుకువ‌స్తున్నట్టు వివ‌రించారు. నెహ్రూ జూ పార్కు, వ‌రంగ‌ల్ జూ పార్కుల‌లో ప్రత్యేక శ్రద్ధ వ‌హించాల‌ని మంత్రి కొండా సురేఖ‌ అన్నారు. వ‌న్యప్రాణుల‌కు నీటి విష‌యంలో, ఆహారం విష‌యంలో ఎటువంటి అశ్రద్ధ వ‌హించ‌వద్దని అధికారుల‌కు మంత్రి సురేఖ ఆదేశించారు.

ప్రత్యేకంగా నీటి ల‌భ్యత ఉన్న ఆహార ప‌దార్థాలు, పండ్లను(దోస‌కాయ‌, పుచ్చకాయ వంటి) వాటికి ఆహారం అంద‌జేయాల‌ని సూచించారు. కాగా వీడియోలో కాన్ఫరెన్స్ సమావేశంలో పీసీసీఎఫ్(హెఓఎఫ్ఎఫ్ డాక్టర్.సువర్ణ, పీసీసీఎఫ్ (వైల్డ్ లైఫ్) ఈలు సింగ్ మేరు, పీసీసీఎఫ్( స్కీమ్స్) జవహర్, వైల్డ్ లైఫ్ ఓఎస్డీ శంకరన్, నెహ్రూ జూ పార్క్ డైరెక్టర్ సునీల్ హీరామత్ తదితరులు పాల్గొన్నారు.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు