Minister Seethaka: గ్రామ అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శులదే కీలక పాత్ర అని, మీ పనులు నిర్వహించేందుకు ప్రభుత్వంలో వేరే యంత్రాంగం లేదని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. సరిహద్దుల్లో సైనికులు ఎలాగో గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు అలాగే ఉంటారన్నారు. తెలంగాణ పంచాయతీ సెక్రటరీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శుల ఆత్మీయ సమ్మేళంను పెద్ద అంబారిపేటలో నిర్వహించారు. ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్సీ కోదండరాం, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆదివాసి బిడ్డకు పంచాయతీరాజ్ శాఖ ను కాంగ్రెస్ అధిష్టానం, ముఖ్యమంత్రి అప్పగించారన్నారు. వారి నమ్మకాన్ని మమ్ము చేయకుండా నేను గ్రామాల అభివృద్ధి కోసం పనిచేస్తున్నానన్నారు.
ఎన్నికలు జరగకపోవడం
గ్రామపంచాయతీ ఎన్నికలు జరగకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తున్నాయన్నారు. రాహుల్ గాంధీ ఆదేశానుసారం కుల గణన చేపట్టామన్నారు. అందుకే పంచాయతీ ఎన్నికలు ఆలస్యమయ్యాయన్నారు. మీకుపని భారం పెరగడానికి గత ప్రభుత్వమే కారణం అన్నారు. గత ప్రభుత్వం వీఆర్వో, వీవోల వ్యవస్థను ఏకపక్షంగా రద్దు చేసిందని మండిపడ్డారు. దీంతో మీపై పని ఒత్తిడి పెరిగిందని, పని భారాన్ని తగ్గించేందుకు గ్రామాల్లో పాలన అధికారులను నియమిస్తున్నామని స్పష్టం చేశారు. అప్పాయింట్మెంట్ డే తో పాటు, మీ నాలుగేళ్ల సర్వీసును పరిగణలోకి తీసుకునే అంశం, ఔట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులను జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా పదోన్నతులు కల్పించడంతో పాటు ఇతర అంశాలపై త్వరలో పంచాయతీ కార్యదర్శుల సంఘాలతో సమావేశం అవుతామని స్పష్టం చేశారు.
Also Read: Manoj Patil: పెళ్లయిన మూడు రోజులకే.. దేశవాసుల రోమాలు నిక్కబొడిచేలా చేసే సంఘటన
పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి, డైరెక్టర్ తో ఈనెల 25లోపు సమావేశాన్ని ఏర్పాటు చేసి న్యాపరమైన చిక్కుముడులేని సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు మా ప్రభుత్వం ముందుంటుందని స్పష్టం చేశారు. పంచాయతీ కార్యదర్శులను శిక్షించే విధానాన్ని సమీక్షించి పంచాయతీ కార్యదర్శులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామ స్వరాజ్యానికి అసలైన అర్థం మీరేనన్నారు. గ్రామాలను పచ్చగా పరిశుభ్రంగా ఉంచే శాస్త్రవేత్తలు మీరేఅని వెల్లడించారు. ఏదైనా సమస్యలు తలెత్తితే మా దృష్టికి తీసుకురండి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మీరు ఒత్తిడికి లోనై ఆరోగ్యాలు పాడు చేసుకోవద్దు అని సూచించారు. నేను మీ అందరికీ అందుబాటులో ఉంటాను..మీ సమస్యలు నా సమస్యలు అన్నట్లుగా పనిచేస్తున్నానన్నారు.
హామీలు నెరవేర్చే బాధ్యత మాది
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శుల సమస్యల పరిష్కారానికి మా ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. అనవసరమైన ఆందోళనలు అవసరం లేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో మీ అందరి పాత్రను మర్చిపోలేను అన్నారు. మీ అందరి ఆశీర్వాదం మేరకు ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.. హామీలు నెరవేర్చే బాధ్యత మాది అని ప్రకటించారు. గత 10 ఏళ్లలో ఆర్థిక విధ్వంసం జరిదని, అందుకే మీ సమస్యల పరిష్కారంలో కొంత ఆలస్యం జరుగుతోందన్నారు. గతంలో ప్రభుత్వం, ప్రభుత్వ సిబ్బంది మధ్య కంచెలు ఉండేవి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి పంచాయతీ కార్యదర్శులు దిక్సూచి అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేటంలో పంచాయతీ కార్యదర్శి కీలకపాత్ర అన్నారు. పంచాయతీ కార్యదర్శులు సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసే వారధులు అన్నారు. మీ బాధ్యతను మీరు నెరవేరిస్తే మీ హక్కులను మేము నెరవేరుస్తాం అని స్పష్టం చేశారు.
Also Read: Ponguleti On KCR: కేసీఆర్ పై మంత్రి పొంగులేటి సంచలన కామెంట్స్!