Manoj Patil Jalgaon Army
Viral

Manoj Patil: పెళ్లయిన మూడు రోజులకే.. దేశవాసుల రోమాలు నిక్కబొడిచేలా చేసే సంఘటన

Manoj Patil: ఇండియా-పాకిస్థాన్ (India-Pakisthan) ఉద్రిక్తతల నేపథ్యంలో మహారాష్ట్రలోని జల్‌గావ్‌లో హృదయాన్ని హత్తుకునే సంఘటన చోటు చేసుకుంది. ఓ జవాన్ తన పెళ్లయిన మూడు రోజులకే దేశ సేవ కోసం సరిహద్దుకు తిరిగెళ్లాడు. అయితే కర్తవ్యమే పరమావధిగా భావించిన ఆ వీరుడికి భార్య కూడా ఒక్క మాట కూడా అడ్డు చెప్పలేదు. కళ్లలో నీళ్లు నిండినా, నుదుటిన సింధూరం చెదిరిపోకుండా చూసుకుంటూ ‘నా సింధూరం దేశం కోసమే’ అంటూ సగర్వంగా భర్తకు వీడ్కోలు పలికింది. నిజంగా ఆ సైనికుడి నిబద్ధతకు, అతని భార్య గొప్ప మనసుకు యావత్ దేశమే సెల్యూట్ చేస్తున్నది.

Manoj Patil Marriage

దేశం కన్నా కావాల్సిందేముంది?
మహారాష్ట్ర జలగావ్ జిల్లాలోని పచోరా తాలూకాలోని పుంగావ్ గ్రామానికి చెందిన మనోజ్ పాటిల్ ఇండియన్ ఆర్మీలో విధులు నిర్వహిస్తున్నాడు. మే-05, 2025న మనోజ్‌-యామిని జంటకు పెళ్లయ్యింది. పాపం.. పెళ్లి కోసం సెలవు పెట్టి వచ్చాడు కదా కుటుంబం ఎంతో హ్యాపీగా ఫీలయ్యింది. ఇక మనోజ్ కూడా ఉన్నన్ని రోజులు కుటుంబంతో సంతోషంగా గడపాలని భావించాడు. అయితే అతడి ఆశలకు విధి బ్రేక్ వేసింది. ‘ఆపరేషన్ సింధూర్’ నేపథ్యంలో కేంద్రం జవాన్ల సెలవులు రద్దు చేస్తూ, తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే పెళ్లి కోసం సెలవులు పెట్టుకుని వచ్చిన జవాన్‌ మనోజ్ పాటిల్‌కు బోర్డర్‌కు తిరిగి రావాలని మే 8న ఉన్నతాధికారుల నుంచి పిలుపు వచ్చింది. పెళ్లైన మూడు రోజులకే విధి నిర్వహణ కోసం బార్డర్‌కు వెళ్తానంటే.. ఆ నవ వధువు ఎంతలా బాధపడి ఉంటుందో మాటల్లో వర్ణించలేం. భర్తతో కనీసం మనస్ఫూర్తిగా మాట్లాడింది కూడా లేదు, సరిగ్గా ఒకరినొకరు అర్థం చేసుకున్నదీ లేదు. అయితే తమ సంతోషం కన్నా దేశమే ప్రధానం అనుకున్నది యామిని.. బాధను గుండెల్లో దాచుకుని, చిరునవ్వుతో భర్తను విధి నిర్వహణకు సాగనంపింది. మరోవైపు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

Manoj Patil Wife

విజయం మాదే అంటూ..
‘నీ అవసరం మాకంటే దేశానికే ఎక్కువ. నీ కోసం మేం ఎదురు చూస్తూనే ఉంటాం. నువ్వు డ్యూటీకి వెళ్లు’ అని చెబుతూ రైల్వే స్టేషన్‌కు వచ్చిన భార్య యామిని, కుటుంబ సభ్యలు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా యామిని మాట్లాడుతూ ‘నా సింధూరాన్ని దేశ రక్షణ కోసం బోర్డర్‌కు పంపుతున్నా’ అంటూ కన్నీటితో పంపించింది. మరోవైపు మనోజ్ మాట్లాడుతూ ‘మా జవాన్లు ఒక్క ఉగ్రవాదిని కాదు, పది మందిని కూడా చంపగలరు. విజయం మాదే అవుతుంది’ అని ధీమా వ్యక్తం చేస్తూ ముందుకు కదిలారు. ఈ మాటలు యావత్ భారతదేశాన్ని కలిచివేస్తున్నాయి. నిజంగా ఈ తరుణం దేశవాసుల రోమాలు నిక్కబొడిచేలా చేసేదే. అందరు ఇలాంటి త్యాగం చేయలేరంటూ యామినిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. సైనిక కుటుంబం అంటే సాహసానికి ఒక పదం, కష్టాల మధ్య ఆశ, దేశం కోసం నిబద్ధత అంటూ ఆ జవాన్, కుటుంబానికి సెల్యూట్ చేస్తున్నారు.

Manoj Patil Family

Read Also-Indian Soldier Plea: పవన్ కళ్యాణ్.. ఈ జవాన్‌ బాధ కాస్త పట్టించుకోండి సార్!

 

Just In

01

Ganja Racket: గంజాయి బ్యాచ్ అరెస్ట్! .. ఎలా దొరికారో తెలుసా?

Huzurabad Gurukulam: గురుకులంలో విద్యార్థులకు టార్చర్?.. ప్రిన్సిపాల్, ఓ పోలీస్ ఏం చేశారంటే?

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!