Mahabubabad Collector: రైతులకు వ్యవసాయ సేద్యం నిమిత్తం ప్రభుత్వం ద్వారా అందిస్తున్న యూరియా సరఫరా ను పారదర్శకంగా చేపట్టాలని అధికారులను జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ (Collector Advaith Kumar Singh) ఆదేశించారు. మరిపెడ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, ఇదే మండలంలోని గిరిపురం లో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నరసింహుల పేట ప్రాథమిక సహకార వ్యవసాయ సొసైటీ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లను అదనపు కలెక్టర్ లెనిన్ వత్సవ్ టోప్పో ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Also Read: Crime News: విద్యార్థిని తలపై కొట్టిన టీచర్.. చిట్లిపోయిన పుర్రె ఎముక.. ఎక్కడంటే..?
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ
యూరియా పంపిణీ విషయంలో తలెత్తుతున్న సమస్యలను జిల్లా అధికారులు అధిగమించారని ప్రశంసించారు. జిల్లాలోని అన్ని శాఖల సమన్వయంతోనే ప్రస్తుతం నిర్వహిస్తున్న యూరియా పంపిణీ ప్రక్రియ వేగవంతంగా పారదర్శకంగా కొనసాగుతుందని వెల్లడించారు. ముఖ్యంగా జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఆదేశాలతో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో స్థానిక ఎస్సైలు, సిబ్బంది ప్రత్యేకమైన చర్యలు నేపథ్యంలోనే యూరియా పంపిణీ ప్రక్రియ సజావుగా సాగుతుందని అభినందించారు. యూరియా పంపిణీ కార్యక్రమంలో ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.
అధికారులంతా సమాయత్తం కావాలి
అధికారుల సమన్వయం, రైతుల సహనం వెరసి యూరియా పంపిణీ ప్రక్రియ మహబూబాబాద్ (Mahabubabad) జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. పంపిణీ కార్యక్రమంలో ప్రతి రైతుకు యూరియా బస్తా అందే విధంగా ప్రణాళిక చర్యలు తీసుకోవాలని, ఇకపైన రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూరియాను పంపిణీ చేసేందుకు అధికారులంతా సమాయత్తం కావాలని సూచించారు. యూరియా కోసం వచ్చిన రైతులకు నీడతోపాటు మంచినీటి వసతులు కల్పించాలని వివరించారు. యూరియా కోసం గ్రామాల నుండి మండల కేంద్రాలకు వచ్చే రైతులకు ఎక్కడ కూడా సౌకర్యం కలగకుండా అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
షెడ్యూల్ ప్రకారం విద్యార్థులకు మెనూ అందించాలి
మహబూబాబాద్ జిల్లాలోని అన్ని ఆశ్రమ పాఠశాలలు, కళాశాలల వసతి గృహాల్లోని విద్యార్థిని విద్యార్థులకు ప్రభుత్వం సూచించిన షెడ్యూల్ ప్రకారం మెనూ అందించాలని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ హాస్టల్ వార్డెన్ లను ఆదేశించారు. మరిపెడ మండలంలోని గిరిపురం లో కేజీబీవీ హాస్టల్ లోని డైనింగ్ హాల్ స్టోర్ గది కిచెన్ షెడ్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వివరించారు విద్యార్థులకు షెడ్యూల్ ప్రకారం సూచించిన విధంగా బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్, వైద్య పరీక్షలు, ప్రతి సబ్జెక్టు పై అవగాహన కోసం నిర్వహిస్తున్న డిజిటల్ తరగతులు, క్రీడా సాంస్కృతిక విభాగాలలో శిక్షణ అందించాలని వివరించారు. కలెక్టర్ వెంట మండల ప్రత్యేక అధికారి డాక్టర్ కిరణ్ కుమార్ వ్యవసాయ శాఖ ఏడిఏ విజయ్ చంద్ర స్థానిక తహసిల్దార్ కృష్ణవేణి పాల్గొన్నారు.
Also Read: Jatadhara Movie: సుధీర్ బాబు ‘జటాధర’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్సయింది.. ఎప్పుడంటే?