Black Jaggery( Image credit: twitter)
నార్త్ తెలంగాణ

Black Jaggery: యథేచ్ఛగా నల్ల బెల్లం దందా.. సహకరిస్తున్నఎక్సైజ్ అధికారులు?

Black Jaggery: మహబూబాబాద్ జిల్లాలో నల్ల బెల్లం దందా విపరీతంగా సాగుతోంది. ఏజెన్సీ, గిరిజన జిల్లాగా పేరుపొందిన మహబూబాబాద్ లో అత్యధికంగా నిరుపేద వర్గాలకు చెందిన వారే కావడంతో నల్ల బెల్లం అక్రమార్కులకు వరంగా మారింది. ఈ కారణాన్ని ఆసరా చేసుకున్న అక్రమార్కులు అవినీతి ఆలోచనలు ఉన్న ఎక్సైజ్, పోలీస్ శాఖలోని డ్రైవర్లు, కానిస్టేబుల్ ల అండదండలతో నల్ల బెల్లం అక్రమ రవాణాను కొనసాగిస్తున్నారు.

నల్ల బెల్లానికి సంబంధించిన అక్రమార్కులపై దాదాపు 8 పిడి యాక్ట్ కేసులు పెట్టినప్పటికీ వారి ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాకపోవడం గమనార్హం. కొన్ని పోలీస్ స్టేషన్లో పరిధిలో కానిస్టేబుళ్ళు, ఎక్సైజ్ శాఖలో ప్రైవేటుగా పనిచేసే డ్రైవర్లు ఈ అక్రమార్కులకు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నట్లుగా సమాచారం ద్వారా తెలుస్తోంది. డోర్నకల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెన్నారం, రాములు తండా, తోడేళ్ల గూడెం, ములకలపల్లి, అమ్మపాలెం, మోదుగడ్డ, సీరోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిలుక్కోయాలపాడు గ్రామాలు ఖమ్మం జిల్లాకు ఆనుకొని ఉంటాయి.

  Also Read: Harish Rao on CM Revanth: శ్వేతపత్రం విడుదల చేయాలి.. సీఎం వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్!

ఈ ప్రాంతాల నుంచే డోర్నకల్, సిరోల్ పోలీస్ స్టేషన్లో పరిధి లో గుడుంబా తయారు చేసే వారికి నల్ల బెల్లాన్ని అక్రమార్కులు సరఫరా చేస్తున్నారనేది విశ్వసనీయ సమాచారం. గతంలో మోదుగడ్డ ప్రాంతంలోనే అక్రమ వ్యాపారం నిర్వహించే వ్యాపారులు ఎస్సై దాడి చేశారు. ఇకపోతే మూడు జిల్లాలకు సరిహద్దు ప్రాంతమైన మరిపెడ మండల కేంద్రం నుండి ఇస్లావత్ తండా ఖమ్మం జిల్లాకు ఆనుకొని ఉండే గ్రామం. ఇక్కడి నుంచే మరిపెడ మండలానికి అక్రమార్కులు నల్లబెల్లాన్ని సరఫరా చేస్తుంటారని సమాచారం.

డోర్నకల్, సిరోల్, కురవి, మరిపెడ, చిన్నగూడూరు, దంతాలపల్లి, నరసింహుల పేట పోలీస్ స్టేషన్ల పరిధిలో విస్తృతం
మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా నల్లబెల్లం అక్రమ రవాణా రోజురోజుకు అడ్డు అదుపు లేకుండా ముఖ్యంగా డోర్నకల్, సిరోల్, కురవి, మరిపెడ, చిన్నగూడూరు, దంతాలపల్లి, నరసింహుల పేట పోలీస్ స్టేషన్ల పరిధిలో విస్తృతం నల్లబెల్లం అక్రమ రవాణా విస్తృతంగా సాగుతున్నట్లు తెలుస్తోంది.డోర్నకల్ నియోజకవర్గంలో ని ఓ పోలీస్ స్టేషన్లో అధికారి పనిచేసిన సమయంలోనే గూడూరు మండలానికి చెందిన ఓ అక్రమ నల్లబెల్లం ముఠా సదరు అధికారిని సంప్రదించి నల్ల బెల్లం వ్యాపారం కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.

 Also Read: CM Revanth Reddy: ఆ నిధులు ఎవరి జేబులోకి వెళ్లాయి? జల సౌధలో సీఎం సంచలన కామెంట్స్!

చిన్న గూడూరు, దంతాలపల్లి, నరసింహుల పేట, తొర్రూరు మొదలుకొని వరంగల్ వరకు దాదాపు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో అధికారులను సదరు అక్రమార్కులు “మామూళ్ళు” గానే మేనేజ్ చేస్తుంటారని సమాచారం. ఈ నల్ల బెల్లం అక్రమ రవాణా దందా ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు ఆనుకొని ఉన్న మూడు పోలీస్స్టేషన్లలో కురవి మండలానికి చెందిన “అశోక్” లేలాండ్ వాహనాన్ని యజమాని ఈ దందాలో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.

డోర్నకల్, కురవి, సిరోల్ పోలీస్ స్టేషన్లో పరిధిలో పనిచేసే సిబ్బంది ఈ అక్రమార్కునికి పూర్తిస్థాయిలో అండదండలు అందిస్తున్నట్లు సమాచారం. ట్రిప్పుకు రూ.20,000 నుంచి రూ.30 వేల వరకు ముడుపులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా సహా పలు జిల్లాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఖమ్మం జిల్లా మీదుగా మహబూబాబాద్ జిల్లాకు అక్రమార్కులు నల్ల బెల్లం రవాణాను సాగిస్తున్నారు. అశోక్ లేలాండ్, బొలెరో వాహనంలో తీసుకొచ్చే అక్రమార్కులు ఒక్కో ట్రిప్పుకు రూ.20,000 నుంచి రూ.30 వేల వరకు ముడుపులు ముట్ట చెబుతున్నట్లు సమాచారం.

 Also Read: Maoist Party: మేము శాంతి చర్చలకు సిద్ధం…కేంద్ర ప్రభుత్వం సిద్ధమేనా? స్పష్టం చేయాలి!

ఇది కూడా ఏ రోజు వస్తారో, ఏ కస్టమర్ కు ఇస్తారో.. సంబంధిత పోలీస్ స్టేషన్లో వివరాలు ఇచ్చిన తర్వాతనే సరఫరా చేయాలనేది డిమాండ్. ఇటువంటి అగ్రిమెంటు మూడు రోజుల వరకు సంబంధిత అధికారి, సంబంధిత అక్రమార్కుడి మధ్యలో ఉంటుందట. ఎన్ని ట్రిప్పులు తెస్తే… ట్రిప్పుకు రూ.20,000 నుంచి రూ.30 వేల వరకు ముడుపులు ముట్ట చెప్పాలనే స్టాండ్ మీద ఉంటారట. అదేవిధంగా డీసీఎం లో అక్రమార్కులు నల్లబెల్లాన్ని రవాణా చేస్తే అధికారులకు రూ.70 వేల నుంచి రూ.75 వేల వరకు సమర్పించుకోవాల్సి ఉంటుందట. ఈ అక్రమ రవాణాకు గతంలో టూవీలర్ పై ఎస్కార్ట్లు నిర్వహించేవారు.

ఆ తర్వాత ఫోర్ వీలర్లలో నిర్వహించేవారు. తాజాగా ప్యాసింజర్ ఆటోను నడుపుకుంటూ అక్రమ రవాణా చేసే వాహనాలకు ఎస్కార్ట్ ఇస్తున్నట్లుగా సమాచారం. ఇక గూడూరు మండలానికి చెందిన వారైతే తమ ద్విచక్ర వాహనాలపై వెళుతూ చిన్నచిన్న ఫోన్ లలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మాట్లాడుకుంటూ ఎస్కార్ట్ గా వ్యవహరిస్తున్నారనేది సమాచారం. ఈ చిన్న చిన్న ఫోన్లో వాడడం వల్ల కాల్ డీటెయిల్స్ రికార్డ్ అంత క్లియర్ గా రాదు అనేది అక్రమార్కుల నమ్మకం.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం