Doctors Prescription: మనకీ ఆరోగ్యం బాగ లేకపోతే వెంటనే హాస్పిటల్ కి వెళ్తాము. ఇక డాక్టర్లు వెంటనే.. పేషెంట్ ను చెక్ చేసి, ప్రిస్క్రిప్షన్ రాస్తుంటారు. అయితే, అది మెడికల్ షాప్ వాళ్ళకి తప్ప ఎవరికీ అర్ధం కాదు. ఇక మనం చూస్తే ఒక్క ముక్క కూడా అర్దం కాదు. నిజం చెప్పాలంటే ఆ ప్రిస్క్రిప్షన్ గొలుసు కట్టు రాత లాగా ఉంటుంది.
డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ చూస్తే చాలామందికి గుండెల్లో గుబులు వస్తుంది. ఆ రాతలు సగం రాసినట్టు కనిపిస్తాయి. అసలు ఏమీ అర్థం కాదు. అసలు ఆ రాతలు అలా ఎందుకు ఉంటాయి? దీని వెనక ఉన్న కారణాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..
Also Read: Dialysis Patients: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. డయాలసిస్ రోగులకు చేయూత.. మంత్రి సీతక్క
వైద్య విద్యలో భాగంగా డాక్టర్లు తక్కువ సమయంలో ఎక్కువ సమాచారాన్ని రాయడానికి అలవాటు పడతారు. ఈ క్రమంలో పదాలను కుదించి, సంక్షిప్తంగా రాసే అలవాటు వస్తుంది. ఇది ఒక రకంగా వారి సొంత “కోడ్ లాంగ్వేజ్”లా మారిపోతుంది, ఇది చూసే వారికి అనుమానాస్పదంగా కనిపిస్తుంది. డాక్టర్ అయిన తర్వాత కూడా ఈ రాయడం తగ్గదు, బదులుగా మరింత వేగవంతం అవుతుంది.
Also Read: Honeymoon Murder case: నెల రోజులుగా జైల్లోనే.. అయినా బుద్ధిరాలేదు.. తోటి ఖైదీలతో సోనమ్ ఏం చేసిందంటే?
మన దేశంలో ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ప్రతి రోజూ 30-35 మంది రోగులను చూస్తారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఈ సంఖ్య ఇంకా ఎక్కువ. ఈ ఒత్తిడిలో రాసే అక్షరాలపై నియంత్రణ కోల్పోతారు. అక్షరాలు వేగంగా, జారుడుగా మారి, గొలుసు కట్టులా కనిపిస్తాయి. ఇంకో ముఖ్యమైన కారణం కూడా ఉంది. మన దేశంలో వైద్యులు తక్కువగా ఉన్నారు. రోగుల ఎక్కువగా ఉన్నారు. ఈ నిష్పత్తి చాలా తక్కువ ఉంటుంది. అంటే 1,000 మంది రోగులకు కేవలం ఒక డాక్టర్ మాత్రమే ఉంటాడు. దీంతో, ప్రతి రోగికి ఎక్కువ సమయం కేటాయించడం అసాధ్యం. రోగుల సమస్యలను శ్రద్ధగా విని, వేగంగా నోట్స్ తీసుకుంటూ చికిత్స అందించాల్సి ఉంటుంది. ఈ ఒత్తిడి వల్ల డాక్టర్ల చేతిరాత స్పష్టత కోల్పోయి, గొలుసు కట్టులా కనిపిస్తుంది.
Also Read: Director Krish: ఆ శక్తిని ఏ కెమెరా కూడా బంధించలేదు.. పవన్ మండే నిప్పు కణం.. క్రిష్ జాగర్లమూడి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.