Dialysis Patients: గుడ్ న్యూస్.. డయాలసిస్ రోగులకు చేయూత..
Dialysis Patients ( Image Source: Twitter)
Telangana News

Dialysis Patients: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. డయాలసిస్ రోగులకు చేయూత.. మంత్రి సీతక్క

Dialysis Patients: డయాలసిస్ చికిత్స పొందుతున్న పేద రోగులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా 681 మంది డయాలసిస్ పేషెంట్లకు “చేయూత” పెన్షన్‌ను మంజూరు చేసింది. ఈ మేరకు మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క సోమవారం సంబంధిత ఫైల్‌పై సంతకం చేశారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రాష్ట్రవ్యాప్తంగా కేవలం 4,011 మంది డయాలసిస్ పేషెంట్లు మాత్రమే పెన్షన్ అందుకున్నారు. అయితే, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా 4,029 మంది డయాలసిస్ పేషెంట్లకు చేయూత పెన్షన్లు మంజూరు చేసింది.

Also Reda: Director Krish: ఆ శక్తిని ఏ కెమెరా కూడా బంధించలేదు.. పవన్ మండే నిప్పు కణం.. క్రిష్ జాగర్లమూడి

తాజాగా మరో 681 మందికి మంజూరు కావడంతో, రాష్ట్రంలో మొత్తం లబ్ధిదారుల సంఖ్య 8,721కి చేరింది. ఈ పింఛన్లను ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా గుర్తింపు పొందిన వివిధ ఆస్పత్రుల్లో చికిత్స అందుకుంటున్న పేషెంట్ల వివరాల ఆధారంగా మంజూరు చేశారు. ట్రస్ట్ గుర్తించిన 681 మంది డయాలసిస్ పేషెంట్ల వివరాలను సెర్ప్ సాంకేతికంగా పరిశీలించి, ధృవీకరణ అనంతరం పెన్షన్ మంజూరైంది. కొత్తగా ఎంపికైన లబ్ధిదారులకు ఆగస్టు నెల నుంచి నెలనెలా చేయూత పెన్షన్ అందనుంది. 681 మంది కొత్త లబ్ధిదారులలో హైదరాబాద్‌లోని వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారు 629 మంది కాగా, మిగిలిన 52 మంది ఇతర జిల్లాలకు చెందినవారు ఉన్నారు. ఈ నిర్ణయం ఒకవైపు ఆరోగ్య భద్రతను, మరోవైపు ఆర్థిక భరోసాను కల్పించే ప్రజా ప్రభుత్వానికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచిందని మంత్రి సీతక్క పేర్కొన్నారు.

Also Reda: Samantha: మరో కొత్త ప్రయత్నానికి సిద్ధమవుతున్న సమంత.. ఈ సారి గెలుస్తుందా లేక గెలిపిస్తుందా?

 

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..