Samantha: తెలుగు సినీ ఇండస్ట్రీలో సమంత తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు పొందింది. సినీ కెరీర్ పరంగా మంచిగా ఉన్నా వ్యక్తిగత జీవితం ఆమెను చాలా బాధ పెట్టింది. నాగ చైతన్య ను ప్రేమించి పెళ్లి చేసుకుంది కానీ కలిసి కాపురం చేయలేకపోయింది. సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకోవడం విడాకులు తీసుకుని విడిపోవడం చాలా కామన్ అయిపోయింది. ఇంకా చెప్పాలంటే, కొందరు ఏకంగా రెండు మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. సామ్, చైతూ విడాకులు తీసుకుని విడిపోయిన దగ్గర నుంచి చాలా మంది విడిపోయారు. అయితే, ఇప్పటికీ కూడా సామ్, చైతూ విడిపోవడానికి గల సరైన కారణం బయటకు రాలేదు. ప్రస్తుతం, సమంత సినీ కెరీర్ విజయవంతంగా కొనసాగుతుంది.
Also Read: PSPK: సినిమాలు చేసుకుంటున్నాడని ప్రత్యర్థులు విమర్శిస్తున్నా.. నేను నిలబడ్డాను! ఎందుకంటే?
ముచ్చటగా మూడో సారి..?
ఇటీవలే హర్రర్ కామెడీ ” శుభం ” చిత్రంతో నిర్మాతగా మారి ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పైన ఈ ప్రాజెక్టును తెరకెక్కించింది. అంతే కాదు, ఈ చిత్రంలో అతిధి పాత్రలో కూడా నటించింది. ఇప్పుడు, ఆమె తన సొంత బ్యానర్ లో సామ్ కూడా నటిస్తున్నట్లు తెలిసిన సమాచారం. గతంలో సమంత నటించిన జబర్దస్త్, ఓ బేబీ చిత్రాలకు వర్క్ చేసిన నందిని రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారని తెలుస్తుంది. మరి ఎక్కువ కాకుండా తక్కువ బడ్జెట్‌తో నిర్మించబోతున్నారని సమాచారం. తెలిసిన సమాచారం ప్రకారం, ఈ చిత్రం ప్రీ-ప్రొడక్షన్ వేగంగా జరుగుతోందని అంటున్నారు. త్వరలోనే అధికారికంగా వివరాలను వెల్లడించనున్నారు. కొన్ని నెలల క్రితం, ఈ ప్రాజెక్ట్ గురించి వార్తలు వచ్చాయి. కానీ ఆ సమయంలో నందిని రెడ్డి వాటిని ఫేక్ అని తోసిపుచ్చారు. ఇప్పుడు, అవే వార్తలు తిరిగి వైరల్ అవుతున్నాయి.
Also Read: PSPK: సినిమాలు చేసుకుంటున్నాడని ప్రత్యర్థులు విమర్శిస్తున్నా.. నేను నిలబడ్డాను! ఎందుకంటే?
సమంత రూత్ ప్రభు చివరి సినిమా 2023లో విజయ్ దేవరకొండతో కలిసి ‘ఖుషి’ సినిమాలో కనిపించింది. 2021లో ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 2తో హిందీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత ఆమె వరుణ్ ధావన్ సరసన ‘సిటాడెల్: హనీ బన్నీ’లో ప్రధాన పాత్ర పోషించింది. నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ ‘రక్త్ బ్రహ్మండ్’ ఆర్థిక సమస్యల కారణంగా ఇంకా ఆలస్యం కానుందని సమాచారం.
Also Read: AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్‌లో పెను సంచలనం.. ‘ఈనాడు’కు కోట్లల్లో ముడుపులు!