AP Liquor Scam: ఆంధ్రప్రదేశ్‌లో పెను సంచలనం రేపుతున్న లిక్కర్ స్కామ్‌లో పెను సంచలనం సృష్టించే వ్యవహారం వెలుగుచూసింది. ఈ కుంభకోణంలో ఈనాడు మాతృ సంస్థగా ఉన్న ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్ (Ushodaya Enterprises) ప్రమేయం ఉన్నట్లుగా తేలింది. లిక్కర్ స్కామ్ ఛార్జ్‌షీట్‌లో (Liquor Scam Charge Sheet) లావాదేవీలను దర్యాప్తు అధికారులు ప్రస్తావించగా అందులో.. అత్యధికంగా రూ.19.15 కోట్లు శర్వాణి ఆల్కో బ్రూవరీస్ లిమిటెడ్ చెల్లించింది. వాహినీ డిస్టలరీస్ నుంచి ఉషోదయకు రూ.3.7 కోట్లు చెల్లింపులు జరిగాయి. మరోవైపు.. ఆదానీ డిస్టిలరీస్ నుంచి కూడా ఉషోదయకు రూ.3.22 కోట్లు అందినట్లుగా ఛార్జ్‌షీట్‌లో క్లియర్ కట్‌గా ఉన్నది. అటు వర్చుసో బేవరేజెస్ నుంచి కూడా రూ.1.69 కోట్లు, పీవీ స్పిరిట్స్ నుంచి రూ.34 లక్షలు, స్పో ఆగ్రో నుంచి రూ.30 లక్షలు ఉషోదయ సంస్థకు చెల్లించాయి. ఇలా మొత్తమ్మీద రూ.28 కోట్ల 40 లక్షలు డిస్టలరీలు ఉషోదయకు ట్రాన్స్‌ఫర్ చేశాయి. అయితే ఇంత భారీ మొత్తంలో డిస్టలరీస్ కంపెనీలు ఎందుకు ట్రాన్స్‌ఫర్ చేశాయి? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఇది నిజంగా లిక్కర్ స్కామ్‌లో ఎవరూ ఊహించని కొత్త ట్విస్టే అని చెప్పుకోవచ్చు. వాస్తవానికి వైసీపీ హయాంలో జరిగిన ఈ కుంభకోణం గురించి మాస్టర్ మైండ్ అని, పెద్ద తలకాయ బయటికొస్తోందని ఆది నుంచి ఓ రేంజిలో అటు టీవీ, ఇటు వార్త పత్రికలో ఈనాడు రప్పా రప్పా అని ఆడుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్‌కు అందిన ముడుపులపై ఎలా స్పందిస్తుంది? ఏమని రియాక్ట్ అవుతారు? అనేది తెలియాల్సి ఉంది.
Read Also- Mohan Babu: కోట చనిపోయిన రోజు హైదరాబాద్‌లో లేను.. అందుకే?
జగన్ పేరు కూడా..!
మద్యం కుంభకోణం వెనుక వైసీపీ ప్రభుత్వం (YSRCP Govt) ఉందని, వేల కోట్ల రూపాయల ముడుపులు జరిగాయన్నది ప్రధాన ఆరోపణ. ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని సిట్ తన దర్యాప్తులో గుర్తించింది. ముఖ్యంగా, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) పేరు ఛార్జ్‌షీట్‌లో ప్రస్తావనకు వచ్చింది. డిస్టిలరీల నుంచి ముడుపులు తీసుకుని కొన్ని మద్యం బ్రాండ్లను ప్రోత్సహించడం, వాటికి అధిక ఆర్డర్లు ఇవ్వడం ద్వారా అక్రమ సంపాదనకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. దాదాపు 40 కంపెనీల నుండి 90% ముడుపులు అందినట్లు సిట్ నివేదించింది. ఈ కేసులో ఈనాడు వంటి మీడియా సంస్థలకు ముడుపులు అందాయని, అవి ఈ కుంభకోణంలో భాగమయ్యాయని కొన్ని రాజకీయ వర్గాలు ఆరోపిస్తున్నాయి. అయితే, ఈ ఆరోపణలను ధృవీకరించే బలమైన ఆధారాలు లేదా సిట్ ఛార్జిషీట్‌లో నిర్దిష్టంగా ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్/ఈనాడు సంస్థను నిందితురాలిగా పేర్కొనడంతో సిట్ ఇప్పుడు ఎలా ముందుకెళ్తుందనేది పెద్ద సస్పెన్స్‌గానే మారింది. కాగా, లిక్కర్ కేసులో 305 పేజీలతో ప్రాథమిక ఛార్జ్‌షీట్‌ను సిట్ అధికారులు తయారచేశారు. ఈ కేసులో ఇప్పటి వరకూ 12 మందిని అరెస్ట్ చేయగా.. మరో 8 మందిని నిందితులుగా సిట్ చేర్చింది. దీంతో నిందితుల సంఖ్య 48కి చేరింది. 100కు పైగా ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలు సమర్పించడం జరిగింది. 268 మంది సాక్ష్యులను విచారించిన సిట్ రూ.62 కోట్లు సీజ్ చేసింది. మరోవైపు.. 20 రోజుల్లో 2వ ఛార్జ్‌షీట్ దాఖలు చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
Read Also- Gold Robbery: గ్యాస్ కట్టర్‌తో షట్టర్ కట్ చేసి.. 18 కేజీల బంగారు నగలు అపహరణ
ఎలా సాధ్యం.. కేసు పూర్వపరాలేంటి..?
ఈ కుంభకోణంపై వైసీపీ నాయకులు (YSRCP Leaders) స్పందిస్తూ తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడిపినప్పుడు కుంభకోణం జరగడం అసాధ్యమని, ఇవి కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలు, తమ పార్టీ నాయకులను అక్రమంగా అరెస్టు చేయడానికి జరుగుతున్న కుట్ర అని వాదిస్తున్నారు. కాగా, 2024 సెప్టెంబర్ 25న కేసు నమోదు చేయబడింది. 2024 అక్టోబర్ 22, 23 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా మద్యం డిస్టిలరీ కంపెనీల్లో తనిఖీలు జరిగాయి. 2025 ఫిబ్రవరి 5న ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేసింది. సిట్ 268 మంది సాక్షులను విచారించి, 11 మంది వాంగ్మూలాలు, రిమాండ్ రిపోర్టులు, ఇతర పత్రాలను జతచేసి ఛార్జ్‌షీట్‌లో రూపొందించింది. మొత్తం రూ. 62 కోట్లు సీజ్ చేసినట్లు ఛార్జ్‌షీట్‌లో అధికారులు వివరించారు. సిట్ అధికారులు ఇటీవల విజయవాడ ఏసీబీ కోర్టుకు 300 పేజీలకు పైగా ఉన్న ప్రిలిమినరీ ఛార్జిషీట్‌ను సమర్పించారు. ప్రధానంగా మనీ ట్రయల్‌కు సంబంధించిన వివరాలను సమగ్రంగా పొందుపరిచారని సమాచారం. డిస్టిలరీస్ నుంచి తీసుకున్న కమీషన్లు, ఏ రూపంలో ఎంత, ఏ కంపెనీ ఎవరెవరికి ఎంత చేర్చింది వంటి వివరాలు దర్యాప్తులో వెలుగులోకి వచ్చాయి. ఈ కుంభకోణంలో ఆర్థిక లావాదేవీలు, అక్రమాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కూడా దర్యాప్తు చేసే అవకాశం ఉంది. సిట్ బృందంతో ఈడీ అధికారులు భేటీ అయ్యి, ముడుపులు సేకరించిన తీరు, వాటిని మళ్లించిన దారులపై చర్చించారు. ఈ కుంభకోణంపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది, భవిష్యత్తులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ కేసులో ఎవరెవరి ప్రమేయం ఉందనేది అధికారిక దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టమవుతుంది.
Read Also- KTR on Hindi Language: హిందీని బలవంతంగా రుద్దుతామంటే ఊరుకోం.. కేటీఆర్ హెచ్చరిక!