Gold Robbery: సూర్యాపేట జిల్లా కేంద్రం ఎంజి రోడ్డులో ఉన్న సాయి సంతోషి జువెల్లరీ షాపు(Sai Santoshi Jewellery Shop)లో ఇతర రాష్ట్ర దొంగల ముఠా చోరీకి పాల్పడి 18 కేజీల బంగారు ఆభరణాలను అపహరించుకుపోయారు. జిల్లా ఎస్పీ నర్సింహ(SP Narasimha) తెలిపిన వివరాల ప్రకారం ఎంజీ రోడ్డులో ఉన్న సాయి సంతోషి జువెల్లరీ షాపు వెనుక భాగంలో బాత్రూం గోడకు కన్నం వేసి దొంగలు షాపు వెనుక భాగంలోకి ప్రవేశించారు. గ్యాస్ కట్టర్ సహాయంతో షట్టర్‌ను కట్ చేసి జువెలరీ షాపు లోపలికి ప్రవేశించారు. అల్మరాను సైతం గ్యాస్ కట్టర్‌తో కట్ చేసి అందులో ఉన్న రూ.18 కోట్ల విలువైన 18 కేజీల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లిపోయారు. కాగా, ఉదయాన్నే షాపు తెరిచేందుకు వచ్చిన యజమాని ముందు వైపు ఉన్న షట్టర్‌ను ఓపెన్ చేసి చూసేసరికి షాపు మొత్తం అల్లకల్లోలంగా ఉంది. దీంతో భారీ చోరీ జరిగిందని నిర్ధారణకు వచ్చిన యజమాని వెంటనే 100 డయల్ ద్వారా సమాచారం అందించారు.
రంగంలోకి ఎస్పీ నరసింహ
సూర్యాపేట(Suryapet) ఎంజీ రోడ్డులో ఉన్న సాయి సంతోషి జువెల్లరీ షాపులో చోరీ ఘటనకు సంబంధించి జిల్లా ఎస్పీ నరసింహ రంగంలోకి దిగారు. వెంటనే పోలీసులను అప్రమత్తం చేసి షాపులో చోరీ జరిగిన వివరాలను డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంలతో తనిఖీలు చేయించారు. అనుమానం వచ్చిన వారందరి వేలిముద్రలను సేకరించారు. అనుమానం ఉన్న పరిసర ప్రాంతాల్లో షాపులు, ఇతర ప్రాంతాలను డాగ్స్ పర్స్ ద్వారా పరిశీలించారు. పట్టణంలోని ప్రధాన కూడలలో ఉన్న సీసీ కెమెరా(CC Camaera)లను పరిశీలించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏ ప్రాంతాన్ని వదలకుండా ప్రతి గల్లీని పర్యవేక్షించారు. సీసీ కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ రూమ్‌లో షాపుకు సంబంధిత కెమెరాలు పూర్తిస్థాయిలో పరిశీలించారు. అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఘరానా దొంగలుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇతర రాష్ట్రాల చోరీల ముఠాకు అంతర్ రాష్ట్ర, అంతర్ జిల్లా ముఠాలకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దొరికిన ప్రతి ఆచూకీ ద్వారా నేరానికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు.
Also Read: Maoists Killed: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. ఏడాది కాలంలో 357 మంది మృతి
నిందితులకోరకు పట్టేందుకు ఐదు బృందాలు
సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎన్జీ రోడ్డు లోని సాయి సంతోషి జువెల్లరీ బంగారు ఆభరణాల షాపులో చోరీ ఘటనకు సంబంధించి సూర్యాపేట డిఎస్పి ప్రసన్నకుమార్(DSP Prsana Kumar) నేతృత్వంలో ప్రత్యేకంగా ఐదు బృందాలను రంగంలోకి దించారు. ఇతర రాష్ట్రాలకు సంబంధించిన అనుమానం ఉన్న వారందరినీ అదుపులోకి తీసుకోవాలని ఎస్పీ నరసింహ సూచనల మేరకు అధికారులు అలర్ట్ అయ్యారు. చోరీలు చేసే ప్రతి ఒక్కరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అనుమానం ఉన్న ప్రాంతాల్లో గస్తీ నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రతి రహదారిలో వాహన తనిఖీలను చేపట్టి నిందితులను పట్టుకునేందుకు ఆరా తీస్తున్నారు.
త్వరలోనే నిందితులను వెతికి పట్టుకుంటాం
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సాయి సంతోషి జువెలరీ షాపులో భారీ చోరీ జరిగిన ఘటనలోని నిందితులను త్వరలోనే వెతికి పట్టుకుంటామని సూర్యాపేట డిఎస్పి ప్రసన్నకుమార్ వెల్లడించారు. ఈ మేరకు ప్రత్యేకంగా ఐదు బృందాలు నిందితుల కోసం గాలిస్తున్నాయని తెలిపారు. గతంలో చోరీలకు పాల్పడ్డ వారిని సైతం అదుపులోకి తీసుకొని విచారించే పనిలో ఉన్నామని చెప్పారు. ఐదు బృందాల ద్వారా బంగారు ఆభరణాల షాపులు దాదాపు 18 కోట్ల విలువైన 18 కేజీల బంగారు ఆభరణాలను అపహరించుకుపోయిన వారందరినీ త్వరలోనే వ్యక్తికి పట్టుకుంటామని స్పష్టం చేశారు. నిందితులను పట్టుకొని అపహరించుకుపోయిన 18 కేజీల నగలను స్వాధీనం చేసుకొని బంగారు షాపు యజమానికి అప్పగించేందుకు కృషి చేస్తామని వివరించారు.
Also Read: Mega157: చేస్తే చిరు లీక్ చేయాలిగానీ.. మీరెవరురా?
