Mega 157 Update
ఎంటర్‌టైన్మెంట్

Mega157: చేస్తే చిరు లీక్ చేయాలిగానీ.. మీరెవరురా?

Mega157: మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్ బస్టర్ హిట్ మెషీన్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో మోస్ట్ అవైటెడ్ హోల్సమ్ ఎంటర్‌టైనర్ చిత్రంగా రూపుదిద్దుకుంటోన్న సినిమా Mega157. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కేరళలోని కొన్ని అద్భుతమైన ప్రదేశాలలో జరుగుతున్నట్లుగా మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. అంతేకాదు, కేరళలో జరుగుతున్న షూట్‌కి సంబంధించి సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు లీక్ కావడంపై టీమ్ ఫైర్ అయ్యింది. ఇలాంటి పనులు చేస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటామంటూ వార్నింగ్ ఇస్తూ ఓ లేఖను టీమ్ విడుదల చేసింది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీమతి అర్చన గర్వంగా సమర్పిస్తున్నారు. టీం ప్రస్తుతం కేరళలో ఒక పాటను చిత్రీకరిస్తోంది.

Also Read- Star Hero: మాజీ లవర్ పై మోజు పడుతున్న హీరో .. పెళ్ళైనా పర్లేదు నీ భార్య నాకు కావాలంటూ..?

చిరంజీవి, నయనతారలపై ఓ కలర్‌ఫుల్‌, మెలోడియస్ మాంటేజ్ సాంగ్‌ని చిత్రీకరిస్తున్నట్లుగా టీమ్ తెలిపింది. భీమ్స్ సెసిరోలియో అద్భుతమైన సాంగ్‌ని కంపోజ్ చేశారని, పెళ్లి సందడి నేపథ్యంలో జరగుతున్న ఈ పాట పూర్తిగా జాయ్‌ఫుల్‌, సెలబ్రేటరీ మూడ్‌లో సాగుతుందని, అలాగే కొన్ని కీలకమైన సీన్లను కూడా ఈ షెడ్యూల్‌లో షూట్ చేస్తున్నారని, ఈ షెడ్యూల్ షూటింగ్ జూలై 23తో పూర్తవుతుందని మేకర్స్ ఈ ప్రకటనలో తెలియజేశారు. ఇటీవల రిలీజ్ చేసిన ప్రోమోలో చిరంజీవి వింటేజ్, స్టైలిష్ లుక్‌లో అలరించిన విషయం తెలిసిందే. దర్శకుడు అనిల్ రావిపూడి స్టైల్‌కి తగ్గట్టుగా.. షూటింగ్ స్పీడుగా, పక్కా ప్లాన్డ్‌గా జరుగుతోంది. సినిమా మంచి నోస్టాల్జిక్ ఫీల్‌తో ఉండబోతోందని తెలుస్తోంది.

Also Read- Fish Venkat: ఫిష్ వెంకట్ మృతికి వాళ్లే కారణమా.. ఫ్యాన్స్ సాయం తప్ప సినీ ఇండస్ట్రీలో ఒక్కరూ కూడా చేయలేదా?

ఇక లీకైన వీడియోపై విడుదల చేసిన మెసేజ్‌లో.. ‘‘ఈ సినిమాకు సంబంధించిన కొన్ని వీడియోలు, ఫొటోలు సోషల్‌ మీడియాలో సంచరించడం మా దృష్టికి వచ్చింది. మా అనుమతి లేకుండా ఆ కంటెంట్ లీకయింది. ఇకపై సెట్స్‌ నుంచి కంటెంట్‌ రికార్డు చేయవద్దని ఈ సందర్భంగా కోరుతున్నాం. అలా చేస్తే ఇకపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఇలాంటి పనుల వల్ల షూటింగ్‌కు అంతరాయం కలగడమే కాకుండా, దీనికోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్న టీమ్‌ అందరినీ బాధ పెట్టినట్లు అవుతుంది. దీనికి సంబంధించిన ఫొటోలను ఎవరూ షేర్‌ చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎంతో ప్రేమతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. మేము విడుదల చేసే అధికారిక సమాచారాన్ని మాత్రమే షేర్‌ చేయాలని అభిమానులను ఈ సందర్భంగా కోరుతున్నాం’’ అని తెలిపారు. Mega157 మూవీని 2026 సంక్రాంతికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు