Star Hero: కోలీవుడ్ సినీ పరిశ్రమలో సంచలనం సృష్టిస్తున్న ఓ వివాదాస్పద వార్త గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ స్టోరీలో హీరో, హీరోయిన్‌లు తెలుగు సినీ ప్రేక్షకులకు కూడా బాగా తెలిసిన వాళ్లే. ఒకప్పుడు ఈ జోడీ సినీ రంగంలో అగ్ర స్థానంలో ఉన్నారు. ఓ సినిమా షూటింగ్‌లో పరిచయం నుంచి స్నేహంగా వీరి సంబంధం చాలా కాలం డేటింగ్‌గా కొనసాగింది. అయితే, వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారనే అనుకున్నారు. కానీ, ఎవరూ ఊహించని విధంగా వీరి మధ్య బ్రేకప్ జరిగింది. ఆ తర్వాత, ఆ హీరోయిన్ సినీ రంగానికి చెందిన వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని, తన జీవితంలో సంతోషంగా ఉంది.
మాజీ లవర్ లైఫ్ లోకి మళ్లీ ఎంట్రీ ఇచ్చిన హీరో?
అయితే, ఈ కథ ఇక్కడితో ఆగలేదు. ఆ హీరో అనూహ్యంగా తన మాజీ లవర్ జీవితంలోకి మళ్లీ ఎంట్రీ ఇచ్చాడు. ” నేను నిన్ను మర్చిపోలేకపోతున్నాను.. నువ్వు నాకు మళ్లీ కావాలి, నీ భర్తకు విడాకులు ఇచ్చి నన్ను పెళ్లి చేసుకో” అని ఆమెను చాలా సార్లు అడిగాడట. దీనికి ఆ హీరోయిన్ అస్సలు ఒప్పుకోలేదట. ఆమెకి ఏమాత్రం నచ్చలేదట. “బ్రేకప్ తర్వాత కూడా నీతో స్నేహంగా ఉన్నాను, కానీ నా భర్తను వదిలి నీ దగ్గరికి రాను” అని స్పష్టంగా చెప్పేసింది.
Also Read: Congress Government: రేవంత్ సర్కార్ లో మహిళలకు అధిక ప్రాధాన్యత.. జహీరాబాద్ లో మహిళా శక్తి సంబరాలు
నీ భార్యను నాకు ఇచ్చేయ్.. హీరో డిమాండ్
అయినా, ఆ హీరో తగ్గకుండా ఏకంగా ఆ హీరోయిన్ భర్త దగ్గరికి వెళ్లాడు. “నీ భార్యను నాకు ఇచ్చేయ్, నేను పెళ్లి చేసుకుంటా. నీవు వేరే పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండు. నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను, ఆమెను మరచిపోలేకపోతున్నాను” అని షాకింగ్ మాటలు మాట్లాడాట.
Also Read: Kota And Babu Mohan: నాకు కూడా కోటన్న లాంటి చావే రావాలని దేవుడ్ని కోరుకుంటా.. బాబు మోహన్
నా భార్య వైపు చూస్తే.. ఇండస్ట్రీలోనే లేకుండా చేస్తాను.. హీరోయిన్ భర్త వార్నింగ్
ఈ మాటలు విన్న హీరోయిన్ భర్త ఘాటుగానే స్పందించాడు. “ఇంకోసారి నా భార్య వైపు కన్నెత్తి చూసిన బాగోదు. ఆమె గురించి ఇలా మాట్లాడితే, నీ గుట్టు మొత్తం బయట పెడతా.. నిన్ను ఇండస్ట్రీలోనే లేకుండా చేస్తాను. నీళ్లు తాగి నీ దారి చూసుకో” అని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడట.