KTR on Hindi Language: : మంద బలం, అధికారం ఉందన్న అహంకారంతో కేంద్రం జాతీయ భాషగా హిందీని బలవంతంగా రుద్దుతామంటే చూస్తూ ఊరుకునేది లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) హెచ్చరించారు. ఈ విషయంలో తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఏకాభిప్రాయంతోనే ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. జైపూర్‌లో జరుగుతున్న టాక్ జర్నలిజం 9వ ఎడిషన్ చర్చలో కేటీఆర్ (KTR) పాల్గొని మాట్లాడారు. ఉత్తర భారతదేశ ఎంపీల సంఖ్య ఆధారంగా నిర్ణయించబడే కేంద్ర ప్రభుత్వం దక్షిణ భారతదేశ ప్రయోజనాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే అవకాశం ఉండదన్నారు.
Also Read: Urfi Javed: అందం కోసం వెళ్తే.. నటికి వాచిపోయింది.. ప్రయోగాలు అవసరమా?
దేశంలో ప్రజాస్వామ్యం ఉంది
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లాంటి ఒక్క రాష్ట్రం కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారడం సమాఖ్య వ్యవస్థకు మంచిది కాదని అభిప్రాయపడ్డారు. జనాభా నియంత్రణను అద్భుతంగా పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు నియోజకవర్గ పునర్విభజనలో తీవ్ర నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం ఉందని, మూకస్వామ్యం లేదన్నారు. “తమకు ఇష్టం వచ్చినట్లు బీజేపీ చేస్తామంటే కుదరదు, ఆ తర్వాత జరిగే పరిణామాలకు ఆ పార్టీనే బాధ్యత వహించాల్సి ఉంటుంది” అని ఆయన హెచ్చరించారు.
ఓటర్ల సవరణ ఇది
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన (India) ఇండియాలో అర్హత కలిగిన ఏ ఒక్క వ్యక్తి కూడా తన ఓటు హక్కును కోల్పోకూడదన్నారు. (Bihar) బీహార్‌లో జరుగుతున్న ఎన్నికల ఓటర్ల సవరణ ఇది మొదటిసారి కాదని, భారత ఎన్నికల కమిషన్ (ఈసీ) ఏం చేస్తుందని కేటీఆర్ (KTR) ప్రశ్నించారు. బీహార్ పరిణామాలపై చాలా అభ్యంతరాలు ఉన్నాయని, దేశంలోని మిగతా రాష్ట్రాలపై దీని ప్రభావం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో రాజకీయ లబ్ధి కోసం, ఎన్నికల్లో గెలవడం కోసం ప్రజల మధ్య విభేదాలు, విద్వేషాలు సృష్టించడం చాలా సులభమని, ఆ రాజకీయ కుట్రలకు అనుగుణంగా బీహార్ (Bihar) పరిణామాలు ఉన్నాయనే అనుమానం వ్యక్తం చేశారు.
“ముందు దేశం, ఆ తర్వాతే ప్రాంతం, మతం, కులం” అని ఆయన పేర్కొన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రజల తరఫున వారి సమస్యలను పార్లమెంట్‌లో మరింత సమర్థవంతంగా వినిపించడానికే రాజ్యాంగంలో నియోజకవర్గాల పునర్విభజన ఉందన్నారు. గతంలో ప్రతి 10 ఏళ్లకు ఒకసారి జనగణన, ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరిగేదని స్పష్టం చేశారు. నియోజకవర్గాల పునర్విభజన విషయంలో భారత ప్రభుత్వం ఇప్పటివరకు ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయలేదన్నారు.
Also Read: Manchu Vishnu: ‘కన్నప్ప’ షాకిచ్చినా మంచు విష్ణులో మార్పులేదు.. నెక్ట్స్ సినిమా ఏంటో తెలుసా?