Urfi Javed: సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్, బిగ్ బాస్ (Bigg Boss) బ్యూటీ ఉర్ఫీ జావేద్ కు షేర్ చేసిన వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తన ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన వీడియో (Instagram Video)లో ఆమె గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. పెదాలు, బుగ్గలు, ముఖం వాచిపోయి ఆమె అందవిహీనంగా తయారయ్యారు. నటికి ఏమైందంటూ ఆమె ఫ్యాన్స్ షాక్ కు గురవుతున్నారు. అయితే తనకు అలా ఎందుకు జరిగిందోనని స్వయంగా ఉర్ఫీనే సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు. అందుకు గల కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.
వీడియో ఏముందంటే
లిప్ ఫిల్లర్లు (Lip fillers) వాడటంతో తన పెదవులు ఉబ్బిపోయినట్లు నటి ఉర్ఫీ జావేద్ స్వయంగా తెలియజేశారు. నటి షేర్ చేసిన వీడియోలో తొలుత ఓ డాక్టర్ ఉర్ఫీ పెదవులకు ఇంజెక్ట్ చేయడాన్ని గమనించవచ్చు. ఉర్ఫీ ఆ నొప్పిని భరిస్తూనే ఇంజెక్ట్ తీసుకుంది. ఆ తర్వాత క్రమంగా ఆమె పెదవులు ఉబ్బడం ప్రారంభమైంది. చివరకు పెదవులు, బుగ్గలు వాచిపోయి.. ముఖం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. దీంతో ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు నెటిజన్లు ఆమెకు చివాట్లు పెడుతున్నారు. బాగున్న ముఖాన్ని పాడు చేసుకోవడం ఇప్పుడు అవసరమా? అంటూ ప్రశ్నిస్తున్నారు.
నటి రియాక్షన్ ఇదే!
అయితే తాను 18 ఏళ్ల వయసులోనే లిప్ ఫిల్లర్లను తీసుకున్నట్లు ఉర్ఫీ జావేద్ సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. ఇప్పుడు వాటిని తొలగించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది. ‘ఇది ఫిల్టర్ కాదు.. నా లిప్ ఫిల్లర్లు తప్పుగా ఉన్నాయి. వాటిని కరిగించాలని నిర్ణయించుకున్నా. మరో మాడు వారాల్లో లిప్ ఫిల్లర్లు మళ్లీ తీసుకుంటాను. అయితే ఈ సారి మరింత నేచురల్ గా ఉండేలా తీసుకుంటా. అయితే ఫిల్లర్ల కోసం మంచి డాక్టర్ వద్దకు వెళ్లడం చాలా ముఖ్యం. ఫ్యాన్సీ క్లినిక్ లలో కూర్చున్న వైద్యులకు ఏమీ తెలియదు’ అంటూ షేర్ చేసిన వీడియో ఉర్ఫీ చెప్పుకొచ్చింది.
View this post on Instagram
Also Read: Parliament Monsoon Sessions: నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు..
వాపు తగ్గిపోతుంది: డాక్టర్
ఉర్ఫీ జావేద్ లిప్ ఫిల్లర్లను కరిగించిన డెర్మటాలజిస్ట్ (Dermatologist) నిపుణుడు డాక్టర్ రిక్సన్ (Dr Rickson).. చికిత్స తర్వాత స్పందించారు. ‘ఫిల్లర్లను కరిగించిన తర్వాత వాపు రావడం సర్వ సాధారణం. అదే సమయంలో ఇది తాత్కాలికం. కొన్ని రోజుల్లో వాపు తగ్గిపోతుంది. ఆమె తిరిగి పూర్వపు స్థితికి చేరుకుంటుంది’ అంటూ భరోసా కల్పించారు. అయితే ఉర్ఫీ జావేద్ ధైర్యంగా తన సౌందర్య దిద్దుబాటు గురించి ప్రపంచానికి తెలియజేయడంపై నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఇందుకు చాలా ధైర్యం కావాలని అభిప్రాయపడుతున్నారు. ఆమె తన అనుభవాన్ని నిజాయతీగా పంచుకున్నారని ఆకాశానికి ఎత్తుతున్నారు.