Director Krish: పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) ఒక భారీ పాన్ ఇండియా పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ సినిమా, దీనికి క్రిష్ జాగర్లమూడి(Director Krish), ఎ.ఎం. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రూపొందించారు. ఈ చిత్రం 17వ శతాబ్దపు మొగల్ సామ్రాజ్య నేపథ్యంలో సాగుతుంది, ఇందులో పవన్ కళ్యాణ్ ఒక ధీరోదాత్తమైన బందిపోటు (వీరమల్లు) పాత్రలో కనిపిస్తారు. నిధి అగర్వాల్ కథానాయికగా, బాబీ డియోల్, నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహీ, సత్యరాజ్ వంటి ప్రముఖ నటీనటులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎ.ఎం. రత్నం సమర్పణలో, ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు ముందు దర్శకుడిగా చేసిన క్రిష్ ఎట్టకేలకు మౌనం వీడారు. ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ఇప్పడు అది వైరల్ అవుతుంది.
Read also- Tollywood: పెళ్లి కాకుండానే తల్లైన రామ్ చరణ్ బ్యూటీ.. బేబీ బాయ్ కి వెల్కమ్ అంటూ పోస్ట్?
‘హరిహర వీరమల్లు’ ఈ ప్రపంచంలోకి అడుగుపెడుతోంది. గొప్ప ఆశయంకోసం ఉరమనుంది. చరిత్రను ప్రజల ముందుకు తీసుకురానుంది. ఈ సినిమా ఇద్దరు లెజెండ్స్ వల్లే సాధ్యపడింది. వారు సినిమాల్లోనే కాకుండా నిజజీవితంలో కూడా ఎందరికో స్పూర్తి. ఒకరు పవన్ కళ్యాణ్ అయితే మరొకరు ఏఎం రత్నం వీరిద్దరివల్లే ఈ సినిమా పూర్తయింది. వీరు లేకుంటే ఈ సినిమా లేనట్టే అని రాసుకొచ్చారు. ఆయన పవన్ కళ్యాణ్‌ను అసాధారణ శక్తిగా అభివర్ణించారు. ఆ శక్తిని ఏ కెమెరా కూడా బంధించలేదని పవన్ ఎప్పుడూ మండే నిప్పు కణం అని, ఈ సినిమాకు ఆయనే వెన్నుముక, ఆత్మ తుఫాన్ అంటూ అభివర్ణించారు.
Read also- Samantha: మరో కొత్త ప్రయత్నానికి సిద్ధమవుతున్న సమంత.. ఈ సారి గెలుస్తుందా లేక గెలిపిస్తుందా?
‘‘ మరోకరు నిర్మాత ఏఎం రత్నం.. భారతీయ సినీ రంగంలో తనకంటూ గొప్ప అనుభవాలను పోగేసుకున్న శిల్పి. ఎంతో విశ్వాసంతో ఈ సినిమాను నిర్మించారు. ఇలాంటి సామర్థ్యం, పట్టుదల ఉన్న చాలా అరుదైన వ్యక్తుల్లో ఆయనొకరు. ఆయన నమ్మకం వల్లే ఈ సినిమా ఇలా సాధ్యపడటానికి కారణం. నాకెంతో నచ్చిన ప్రాజెక్ట్‌లలో ఈ సినిమా ఒకటి. ఎన్నో జ్ఞాపకాలను ఇచ్చింది. దర్శకుడిగా మాత్రమే కాకుండా.. ఈ సినిమా కథను రాయడంలోనూ ఎన్నో విషయాలు తెలుసుకున్నాను’’ అని క్రిష్ రాసుకొచ్చారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కు, ఏఎం రత్నంకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా వేచి చూసిన సమయం వచ్చిందన్నారు. సినీ ఇండస్ట్రీలో ఈ సినిమా అందరికీ గుర్తుండిపోతుందని క్రిష్ అన్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.