Tollywood: తెలుగు హీరోయిన్ అంజలి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న హీరోయిన్స్ లో ఈ ముద్దుగుమ్మ కొంచం డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే, ఆమె చేసే సినిమాలు కూడా అలాగే ఉంటాయి. సౌత్ లో ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్ గా ఎదిగి మంచి పేరు సంపాదించుకుంది. కేవలం ఒక్క తెలుగులోనే కాకుండా కాకుండా తమిళ ఇండస్ట్రీలో కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. అంజలి షాపింగ్ మాల్ అనే మూవీ ద్వారా తెలుగు ఆడియెన్స్ కు దగ్గరైంది.
Also Read: Samantha: మరో కొత్త ప్రయత్నానికి సిద్ధమవుతున్న సమంత.. ఈ సారి గెలుస్తుందా లేక గెలిపిస్తుందా?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన ‘గేమ్ చేంజర్’ సినిమాలో నటించిన అంజలి, ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది. అయితే, ఇప్పటివరకు పెళ్లి చేసుకోని ఈ హీరోయిన్ తాజాగా తన ‘బేబీ’ని పరిచయం చేసి అందరినీ షాక్ కు గురి చేసింది. ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Also Read: PSPK: సినిమాలు చేసుకుంటున్నాడని ప్రత్యర్థులు విమర్శిస్తున్నా.. నేను నిలబడ్డాను! ఎందుకంటే?
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ, తన మూవీ అప్డేట్స్, ఫోటోలు, వీడియోలు షేర్ చేసే అంజలి, ఇటీవల ఒక పోస్ట్‌లో ఒక షాకింగ్ పోస్ట్ పెట్టింది. తన కొత్త కుటుంబ సభ్యుడిని పరిచయం చేసింది. “మా ఫ్యామిలీలో ఒక కొత్త మెంబర్‌ని మీకు పరిచయం చేస్తున్నా… ఇతని పేరు నీకో, నా బేబీ బాయ్!” అంటూ హార్ట్ ఎమోజీతో ఒక ఫోటోను షేర్ చేసింది.
Also Read: Nitish Reddy: సిరీస్ మధ్యలోనే నితీష్ కుమార్ రెడ్డి తిరుగుపయనం.. బీసీసీఐ కీలక ప్రకటన
ఈ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. కొందరు, “పెళ్లి కాకుండానే తల్లయ్యావా? నీకో నీ కొడుకా?” అని ఆశ్చర్యపోగా, మరికొందరు, “అరె! ఇది కుక్క పిల్లా?” అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు. అంజలి ‘బేబీ’ నీకో ఒక అందమైన కుక్క పిల్ల అని తెలిసి ఫ్యాన్స్ కూడా ఊపిరి పీల్చుకున్నారు.