Viral Video: రెజ్లింగ్ మ్యాచ్‌లో కల్లోలం.. వణుకుపుట్టిస్తున్న వీడియో!
Viral Video (Image Source: Twitter)
Viral News

Viral Video: రెజ్లింగ్ మ్యాచ్‌లో ఊహించని ఘటన.. వణుకుపుట్టిస్తున్న వీడియో!

Viral Video: మాజీ యూఎఫ్‌సీ UFC లైట్ హెవీవెయిట్ ఛాంపియన్ క్వింటన్ రాంపేజ్ జాక్సన్ (Quinton Rampage Jackson) కుమారుడు రాజా జాక్సన్ (Raja Jackson) వివాదంలో చిక్కుకున్నాడు. రెజ్లింగ్ మ్యాచ్‌లో ఒక ప్రొఫెషనల్ రెజ్లర్‌ పై తీవ్రంగా దాడి చేయడం వివాదస్పదమవుతోంది. లైవ్ లో ప్రసారమైన ఈ మ్యాచ్ కు సంబంధించిన దృశ్యాలు.. భయంకరంగా ఉన్నాయి. తన కుమారుడి ప్రవర్తనపై సర్వత్రా విమర్శలు రావడంతో ర్యాంపేజ్ జాక్సన్ బహిరంగంగా క్షమాపణలు తెలియజేశారు.

వివరాల్లోకి వెళ్తే..
కలవరపరిచే వీడియోకు సంబంధించిన ఘటన లాస్ ఏంజెల్స్  (Los Angeles)లో జరిగిన నాక్స్ ప్రో రెజ్లింగ్ (KnokX Pro Wrestling) ఈవెంట్‌లో జరిగింది. రాజా జాక్సన్, స్టువర్ట్ స్మిత్ (Stuart Smith) అనే రెజ్లర్ ను నాకౌట్ చేశాడు. పడిపోయిన తర్వాత కూడా అతని ముఖంపై అనేకసార్లు పిడిగుద్దులు కురిపించాడు. జాక్సన్ తన దాడిని ఆపకపోవడంతో ఇతర రెజ్లర్లు రింగ్ లోకి వచ్చి అతడ్ని నియంత్రించారు. కార్నర్ కు నెట్టుకెళ్లి.. అడ్డుకున్నారు.

పళ్లు ఊడి.. ముఖ ఎముకలు విరిగి
తీవ్ర గాయాలైన స్టువర్ట్ స్మిత్ ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అతడి పళ్లు, ముఖ ఎముకలు విరిగినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం స్టువర్ట్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు పేర్కొన్నారు. విశ్రాంత ఆర్మీ ఉద్యోగి అయిన స్టువర్ట్.. వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడేందుకు రెజ్లింగ్ ను ఒక మార్గంగా ఎంచుకున్నాడు. కాగా, దాడి ఘటనపై నాక్స్ ప్రో రెజ్లింగ్ నిర్వాహకులు స్పందించారు. ‘రాజా స్వార్థపూరితంగా, బాధ్యతారహితంగా వ్యవహరించాడు. హింసాత్మకంగా ప్రవర్తించాడు’ అని తన ఫేస్ బుక్ ఖాతాలో ఆగ్రహం వ్యక్తం చేసింది.

Also Read: Nagarkurnool: విహరిద్దామని భార్యను తీసుకెళ్లి.. నల్లమలలో సైలెంట్‌గా తగలబెట్టేశాడు!

రాజా జాక్సన్ ఎవరు?
రాజా జాక్సన్ 25 ఏళ్ల ప్రొఫెషనల్ ఎంఎంఏ (MMA) ఫైటర్. లాస్ ఏంజెల్స్ కు చెందిన ఆయన ఎంఎంఏ లెజెండ్ రాంపేజ్ జాక్సన్ కుమారుడు. రెజ్లింగ్ లో రాజా జాక్సన్ ప్రతిభ కనబరిచినప్పటికీ తన తండ్రికి వచ్చినంత పేరును మాత్రం అతడు సాధించలేకపోయాడు. పైగా తాజా ఘటన తర్వాత మరింత వివాదంలో చిక్కుకొని ఉన్న పేరును చెడగొట్టుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Also Read: Nara Lokesh: స్త్రీ శక్తికి కొత్త శక్తి.. ర్యాపిడోతో రాణిస్తున్న మహిళ.. నారా లోకేషే ఫిదా అయ్యారు!

రాంపేజ్ జాక్సన్ ప్రకటన
దాడి ఘటన వైరల్ కావడంతో రాజా తండ్రి క్వింటన్ రాంపేజ్ జాక్సన్ ఒక ప్రకటన విడుదల చేశారు. తన కుమారుడి దాడికి ఆయన క్షమాపణలు చెప్పారు. ‘మ్యాచ్‌కు కాసేపటి ముందు స్మిత్ కారణంగా రాజా తలపై అనుకోకుండా ఒక దెబ్బ తగిలింది. రింగ్‌లో ప్రతీకారం తీర్చుకోవచ్చని రాజాకు నిర్వాహకులు చెప్పారు. నేను కూడా అది షోలో భాగమేనని అనుకున్నాను’ అని ఆయన రాశారు. ‘నేను నా కుమారుడి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించడం లేదు’ అని స్పష్టతనిచ్చారు.

Also Read: Khammam District: నోట్లో గుడ్డలు కుక్కి.. భర్తను చితక్కొట్టిన భార్య.. దెయ్యమే కారణమా?

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..