Khammam District: భార్య భర్తల బంధం రోజు రోజుకు బలహీనపడుతోంది. భర్తపై భార్య.. భార్యపై భర్త ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్న ఘటనలు దేశవ్యాప్తంగా పెరిగిపోయాయి. కొన్ని కేసుల్లో వివాహేతర సంబంధం కారణంగా జీవిత భాగస్వామిని అతి కూర్రంగా చంపడాన్ని కూడా చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే తెలంగాణలోనూ ఓ భార్య.. భర్తపై దాడి చేసింది. నోట్లో గుడ్డలు కుక్కి మరి విరగ్గొట్టింది. ప్రస్తుతం ఈ వార్త రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
వివరాల్లోకి వెళ్తే..
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీఎం బంజర్ పంచాయితీలో ఈ ఘటన చోటుచేసుకుంది. జంగాల కాలానికి చెందిన 51 ఏళ్ల గంగారాం.. భార్య లక్ష్మీతో కలిసి 35 ఏళ్లుగా అక్కడే నివాసముంటున్నాడు. అయితే గంగారాం మద్యానికి బానిస కావటం తో గత కొంతకాలంగా భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం లక్ష్మి తనకు దెయ్యం పట్టిందని పెద్ద పెద్దగా కేకలు వేస్తూ భర్త పడుకున్న సమయంలో చితక బాదింది.
Also Read: Cyberabad Women Security: 143 డెకాయ్ ఆపరేషన్లు.. పట్టుబడ్డ 70 మంది పోకిరీలు!
శబ్దం రాకుండా గుడ్డలు కుక్కి..
గంగారాం చేతులపై ఇనుప వస్తువుతో దాడి చేసింది. దీంతో నొప్పికి తాళలేక భర్త కేకలు వేయడం మెుదలుపెట్టాడు. అయితే శబ్దం బయటకు రాకుండా దగ్గరలోని గుడ్డముక్కను తీసుకొని గంగారం నోట్లో కుక్కింది. ఆపై మరింతగా దాడి చేసింది. అయితే ఇంట్లో మూలుగుడు శబ్దాలు రావడాన్ని గమనించిన చుట్టుపక్కల వారు వెంటనే లోపలికి వెళ్లారు. తీవ్రంగా గాయపడి ఉన్న భర్తను లక్ష్మి బారి నుంచి విడిపించి ఆస్పత్రికి తరలించారు.
Also Read: KTR on CM Revanth Reddy: పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు?
భర్త ఏమన్నారంటే?
తన భార్య తీవ్రంగా కొట్టిందని, చిత్ర హింసలకు గురి చేసిందని భర్త గంగారాం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నోట్లో గుడ్డలు కుక్కి, చేతులు విరిచి, రాడ్డుతో దాడి చేసిందని ఆరోపించారు. ఘటనపై కేసు నమోదు చేసిన వీ.ఎం. బంజర్ పోలీసులు.. భార్య లక్ష్మీపై సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ రాశారు. భార్య దాడిలో గంగారాం పక్కటెముకలు విరిగి తీవ్ర గాయాలు కావడంతో అతడ్ని మెరుగైన చికిత్స కోసం ఖమ్మం ఆస్పత్రికి తరలించారు.