Cyberabad Women Security (imagecredit:twitter)
హైదరాబాద్

Cyberabad Women Security: 143 డెకాయ్ ఆపరేషన్లు.. పట్టుబడ్డ 70 మంది పోకిరీలు!

Cyberabad Women Security: మహిళలు…చిన్నపిల్లల క్షేమం కోసం సైబరాబాద్ ఉమెన్(Women)​, చైల్డ్​ సెక్యూరిటీ వింగ్ కట్టుదిట్టమైన చర్యలను అమలు చేస్తోంది. మహిళలు, యువతులను వేధించటమే పనిగా పెట్టుకున్న పోకిరీలను డెకాయ్ ఆపరేషన్లు(Decoy operations) జరిపి పట్టుకుంటోంది. దాంతోపాటు వెట్టిలో మగ్గిపోతున్న చిన్నారులను కాపాడుతోంది. వేర్వేరు కారణాలతో వ్యభిచార కూపంలో చిక్కుకుని బయట పడలేకపోతున్న మహిళలకు రక్షణ కల్పిస్తోంది. వారి పునరావాసానికి చర్యలు తీసుకుంటోంది. ఇంట్లో నుంచి కాలు బయట పెడితే చాలు మహిళలు, యువతులు జులాయిల నుంచి ఎదుర్కొంటున్న సమస్యలు చెప్పనలవిగా ఉంటున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో సైబరాబాద్ కమిషనరేట్ షీ టీమ్స్​(She Teams) బృందాలు రద్ధీ ప్రాంతాల్లో డెకాయ్ ఆపరేషన్లు నిర్వహిస్తూ వీరి భరతం పడుతున్నారు.

గడిచిన వారం రోజుల్లోనే కమిషనరేట్ పరిధిలోని వేర్వేరు చోట్ల 143 డెకాయ్​ ఆపరేషన్లు జరిపి ఆధారాలతో సహా 70 పోకిరీలను పట్టుకున్నట్టు ఉమెన్​, చైల్డ్ సెక్యూరిటీ వింగ్ డీసీపీ సృజన(DCP Srujana) తెలిపారు. వీరిపై 47 కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. అందరికీ కౌన్సెలింగ్ జరిపినట్టు పేర్కొన్నారు. ఇక, మహిళలు, యువతులకు ఎదురయ్యే సమస్యలు, భద్రత కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై 75 అవగాహనా కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలిపారు. ఇక, చిన్న చిన్న కారణాలతో గొడవలు పడుతున్న భార్యాభర్తలకు కూడా కౌన్సెలింగ్ ఇస్తూ వారి వైవాహిక జీవితం సాఫీగా గడిచిపోయేలా చూస్తున్నామన్నారు. ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్ లో 34 జంటలకు ఈ విధంగా కౌన్సెలింగ్ ఇచ్చినట్టు చెప్పారు.

సోషల్ మీడియా వేధింపులు

ఇక, యాంటీ హ్యూమన్​ ట్రాఫికింగ్ యూనిట్(Anti-Human Trafficking Unit) సిబ్బంది కమిషనరేట్ పరిధిలోని వేర్వేరు ప్రాంతాల్లో చైల్డ్ ట్రాఫికింగ్(Child trafficking), ఈవ్ టీజింగ్(Eve teasing), సోషల్ మీడియా వేధింపులు, బాల్య వివాహాలు, బాల కార్మికులు, బెగ్గింగ్ మాఫియా, సైబర్ నేరాలతోపాటు బాలురకు ఉండే చట్టాలపై అవగాహనా కార్యక్రమాలు జరిపినట్టు తెలిపారు. ఈ క్రమంలో ఉమెన్​ హెల్ప్​ లైన్​ 181, చైల్డ్ హెల్ప్ లైన్ 1098 నెంబర్లను అందుబాటులోకి తీసుకు వచ్చినట్టు చెప్పారు. ఎలాంటి ఫిర్యాదు చేయాలన్నా 100 నెంబర్ కు కూడా డయల్ చేయవచ్చన్నారు.

Also Read: Janaki V v/s State of Kerala OTT: పవర్ ఫుల్ కోర్ట్ డ్రామా స్ట్రీమింగ్ తెలుగులో.. ఎక్కడంటే?

సైబర్ నేరాల బారిన పడితే 1930 నెంబర్ కు సమాచారం అందించాలని సూచించారు. గచ్చిబౌలి, మాదాపూర్(Madhapur), నార్సింగి, కేపీహెచ్(KBHP)​బీ, కూకట్ పల్లి(Kukat Pally), సనత్ నగర్ తదితర పోలీస్ స్టేషన్ల పరిధుల్లో తనిఖీలు జరిపి వ్యభిచార కార్యకలాపాలు సాగిస్తున్న 15మంది ట్రాన్స్​ జెండర్లు, 16మంది మహిళలను కాపాడి రెస్క్యూ హోంకు తరలించినట్టు పేర్కొన్నారు. కొందుర్గు స్టేషన్​ పరిధిలోని మహర పుష్య అగ్రి ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్​(Mahara Pushya Agri Products Private Limited) లో తనిఖీలు జరిపి బాల కార్మికులుగా పని చేస్తున్న 6గురు బాలికలు, ఒక బాలున్ని రక్షించినట్టు చెప్పారు. వీరిని పునరావాసం కోసం ఢిల్లీలోని జాతీయ మానవ హక్కుల సంఘానికి అప్పగించినట్టు తెలిపారు.

సురక్షా కవచ్…

ఇక, విద్యార్థుల రక్షణ కోసం ఆయా స్కూళ్లలో సురక్షా కవచ్(Safety shield) కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్టు డీసీపీ సృజన చెప్పారు. ఫిజికల్, సైబర్, సైకలాజికల్ వేధింపులపై పిల్లలకు అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు. రోడ్డు భద్రత గురించి వివరిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆయా విద్యా సంస్థల లోపల. .బయట పిల్లలకు సురక్షిత వాతావరణాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. దీని కోసం ఓరియంటేషన్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామన్నారు. మహిళల భద్రత కోసం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా 150మంది క్యాబ్ డ్రైవర్లకు కూడా అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించినట్టు చెప్పారు. మహిళా ప్రయాణీకుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడితే ఎదురయ్యే పరిణామాల గురించి వారికి వివరించినట్టు తెలిపారు. మహిళా ఉద్యోగినులకు కూడా దీనికి సంబంధించి అవేర్ నెస్​ కల్పించినట్టు చెప్పారు. లైంగిక వేధింపులు ఎదురైతే ఎలా పోలీసుల సాయాన్ని తీసుకోవచ్చో చెప్పామన్నారు.

Also Read: Post Office Scheme: ఈ స్కీమ్ గురించి తెలుసా? రూ.10వేలు పెట్టుబడి పెడితే.. రూ.7 లక్షలు మీవే!

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ