anupama-parameswaran( image:X)
ఎంటర్‌టైన్మెంట్

Janaki V v/s State of Kerala OTT: పవర్ ఫుల్ కోర్ట్ డ్రామా స్ట్రీమింగ్ తెలుగులో.. ఎక్కడంటే?

Janaki V v/s State of Kerala OTT: భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ అయిన జీ 5 లో మరో సూపర్‌హిట్ ప్రీమియర్‌తో ఆడియెన్స్ ముందుకు వచ్చింది. విమర్శకుల ప్రశంసలు పొందిన మాలీవుడ్ లీగల్ డ్రామా ‘J.S.K – జానకి V v/s స్టేట్ ఆఫ్ కేరళ’ ఆగస్టు 22న తెలుగు ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ఇప్పటికే తమిళం, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో సక్సెస్ ఫుల్ గా స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తెలుగు ఆడియన్స్ ను అలరించడానికి జీ 5 ఓటీటీ ప్లాట్‌ఫారమ్ లో స్ట్రీమింగ్ అవుతొంది. ఇప్పటికే ఈ సినిమా గురించి దేశ వ్యాప్తంగా పెద్ద పెద్ద చర్చలే జరిగాయి. ఎట్టకేలను ఈ సినిమా విడుదలై ప్రేక్షకుల మన్ననలు పొందుతోంది.

Read also- Rajiv Gandhi Civils Abhaya Hastham: యువతకు గుడ్ న్యూస్.. ఒక్కొక్కరు రూ.లక్ష పొందే.. అద్భుతమైన స్కీమ్!

సురేష్ గోపి, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన జానకి V v/s స్టేట్ ఆఫ్ కేరళ మూవీకి (Janaki V v/s State of Kerala OTT) ప్రవీణ్ నారాయణన్ దర్శకత్వం వహించగా.. కాస్మోస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఫణీంద్ర కుమార్ నిర్మించారు. ప్రఖ్యాత న్యాయవాది డేవిడ్ అబెల్ డోనోవన్ (సురేష్ గోపి) సహాయంతో లైంగిక వేధింపుల నుండి బయటపడిన జానకి విద్యాధరన్ (అనుపమ పరమేశ్వరన్) చుట్టూ ఈ కథ తిరుగుతుంది. న్యాయం కోసం పోరాడుతున్న ఓ యువతి, న్యాయవాది చివరకు గెలిచారా? లేదా? అసలు జానకి జీవితంలో ఏం జరిగింది? న్యాయం కోసం చేయాల్సి వచ్చిన పోరాటం ఏంటి? అనే ప్రశ్నల్ని లేవనెత్తేలా ట్రైలర్‌ను కట్ చేశారు. ఈ చిత్రంలో గిరీష్ నారాయణన్ స్వరపరిచిన పాటలు, గిబ్రాన్ అద్భుతమైన నేపథ్య సంగీతం స్పెషల్ అట్రాక్షన్ కానున్నాయి. ఈ చిత్రానికి రెనదివే సినిమాటోగ్రఫీ అందించారు. ఈ ఆగస్టు 22న ‘ జానకి V v/s స్టేట్ ఆఫ్ కేరళ’ తెలుగు లో ప్రత్యేక డిజిటల్ ప్రీమియర్‌ను ZEE5లో స్ట్రీమింగ్ అవుతోంది.

Read also-HBD Chiranjeevi: మెగాస్టార్‌కి శుభాకాంక్షల వెల్లువ.. సంబరాలు చేసుకుంటున్న ఫ్యాన్స్

ఈ సినిమా కథ బెంగళూరులో ఐటీ ఉద్యోగిగా పనిచేసే జానకి, కేరళలోని తన సొంత గ్రామానికి వచ్చినప్పుడు జరిగిన సంఘటనతో ఆమె జీవితం తలకిందులవడంతో మొదలవుతుంది. న్యాయం కోసం ఆమె చేసే పోరాటంలో అడ్వకేట్ డేవిడ్ ఎలాంటి పాత్ర పోషిస్తాడు? జానకి న్యాయం పొందగలదా? అనే ప్రశ్నలను ట్రైలర్ లేవనెత్తుతుంది. ఈ ట్రైలర్ ఒక శక్తివంతమైన కోర్ట్‌రూమ్ డ్రామాగా, సామాజిక సమస్యలను చర్చించే చిత్రంగా ప్రేక్షకులను ఆలోచింపజేసేలా రూపొందించబడింది. ఈ ట్రైలర్ చూసినంత సేపు చాలా ఆసక్తి కరంగా సాగింది. అనుపమ యాక్టింగ్ టాప్ నాచ్ లో ఉంది. ఈ ట్రైలర్ చూస్తుంటే ఇప్పటివరకూ ఉన్న ప్రేక్షకుల అంచనాలు మరింత పెరిగాయ.

Just In

01

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు