HBD Chiranjeevi: తెలుగు సినిమా పరిశ్రమలో ఒక లెజెండ్, అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన నటుడు, మెగాస్టార్ చిరంజీవి. ఆయన పుట్టిన రోజు ఈసందర్భంగా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ‘మెగాస్టార్ చిరంజీవికి 70వ జన్మదిన శుభాకాంక్షలు. సినిమా, ప్రజా జీవితం సామాజిక సేవలో మీ అసాధారణ ప్రస్థానం లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చింది. మీ ఔదార్యం అంకితభావంతో మరిన్ని జీవితాలను ప్రభావితం చేయాలని కోరుకుంటున్నాము. మీకు ఆరోగ్యం, సంతోషం మరెన్నో గుర్తుండిపోయే సంవత్సరాలు ఉండాలని ఆశిస్తున్నాము’. అని రాసుకొచ్చారు. మంత్రి నారా లోకేశ్.. ‘ప్రజలకు, సినిమాకు మీరు చేసిన సేవ మరువలేనిది’ అని అన్నారు. ‘తెలుగు సినీ పరిశ్రమలో తనదైన నటనతో ప్రజల హృదయాల్లో చెరగని ముద్రవేసిన మహానటుడు, సేవామూర్తి, బ్లడ్ బ్యాంక్ – ఐ బ్యాంక్ ల ద్వారా వేలాది ప్రాణాలకు నూతన జీవం ప్రసాదించిన మానవతా మూర్తి, గౌరవనీయులైన పద్మవిభూషణ్ డా. మెగాస్టార్ చిరంజీవి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు’. అంటూ ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.
Happy Birthday to our one and only Mega Star Chiranjeevi garu. ⭐️ @KChiruTweets pic.twitter.com/0n9veF0l9X
— Allu Arjun (@alluarjun) August 22, 2025
Read also- SC on Stray Dogs: వీధి కుక్కలపై సుప్రీంకోర్టు మరో సంచలన తీర్పు.. ఈసారి ఏం చెప్పిందంటే?
అల్లు అర్జున్.. ‘తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఒకే ఒక్క మెగాస్టార్ (HBD Chiranjeevi)కి జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ రాసుకొచ్చారు. ‘చరిత్రలో చిరస్థాయిగా.. మా గుండెల్లో చిరుస్థాయిగా లవ్ యూ బాస్ అంటూ హరీష్ శంకర్ తెలిపారు. ‘ఇండియన్ సినిమా గాడ్ ఫాదర్ కి జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ మంచు మనోజ్ రాసుకొచ్చారు. ‘భారతీయ సినిమా గర్వించదగ్గ వ్యక్తి మీరు. లక్షలాది మంది హృదయాల్లో నిలిచిన మా ప్రియమైన అన్నయ్య, మైటీ మెగాస్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ బాబి కొల్లి తెలిపారు. అంతే కాకుండా చిరు, బాబి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా గురించి ఈ రోజు సాయంత్రం పోస్టర్ విడుదల చేయనున్నారు.‘నేను చూసిన మొదటి హీరో మా మామయ్య.. ఆయన జీవితం నాకు ఆదర్శం. మామ చేతి నడకే ఈ రోజు నా పయనం. ఆయన నేర్పిన నడవడికే ఓ జీవిత పాఠం. మామయ్యే నా సర్వస్వం. కష్టమైనా, సుఖమైనా ఆయన తోడుంటే అదే కొండంత ధైర్యం. మామయ్య మాటే నాకు శాసనం. ఎప్పటికీ ఆయనే నా బలం. మీ మెగాస్టార్.. మన మెగాస్టార్.. నా ముద్దుల మామయ్య చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు.’ అంటూ సాయి ధరమ్ తేజ్ ట్విటర్ లో రాసుకొచ్చారు.
Happy Birthday to our Megastar, Padma Vibhushan Shri @KChiruTweets Anna garu ❤️
Your journey continues to inspire with your dedication, humility, and larger-than-life presence. Wishing you good health, happiness, and many more years of lighting up both cinema and our lives. pic.twitter.com/c2TACd6zLX— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) August 22, 2025
Read also- HBD Chiranjeevi: నాడు దేశంలో ఎక్కువ రెమ్యూనరేషన్ హీరో.. అమితాబ్ కూడా అందుకోలేని పారితోషికం
‘తెర మీద మిమల్ని చుస్తే ఆనందం, నిజజీవితంలో మిమల్ని గమినిస్తే స్ఫూర్తిదాయకం .. మీరిచ్చే ప్రేరణ, మీరు పంచే వినోదం ఎల్లప్పుడూ కొనసాగాలి .. హ్యాపీ బర్త్‌డే మెగాస్టార్’ అంటూ త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్నారు. మెగాస్టార్ చిరంజీవికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు! మీకు ఆరోగ్యం, సంతోషం మరెన్నో అద్భుతమైన సంవత్సరాలు కలగాలని కోరుకుంటున్నాము.అంటూ తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాసుకోచ్చారు. అంతేకాకుంగా రఘునందన్ రావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గుబాటి వెంకటేష్, అల్లు శిరీష్, కన్నా లక్ష్మీనారాయణ తదితరులు మెగాస్టార్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.