UP Crime: వివాహేతర సంబంధాలు మనుషులను దారుణంగా మార్చేస్తున్నాయి. వారిని మృగాలుగా తయారు చేస్తూ.. తోటి మనిషి అతి దారుణంగా హత్య చేసేలా ప్రోత్సహిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఉత్తర్ ప్రదేశ్ (Uttar Pradesh)లో దారుణం చోటుచేసుకుంది. ప్రియుడ్ని ఇంటికి పిలిచిన స్త్రీ.. భర్తతో కలిసి అతడ్ని చిత్ర హింసలకు గురిచేసింది. రూ.7 లక్షల అప్పు కారణంగా అతడ్ని పైలోకాలకు పంపించేసింది. ప్రస్తుతం ఈ ఘటన యూపీ వ్యాప్తంగా కలకలం రేపుతోంది.
వివరాల్లోకి వెళ్తే..
యూపీలోని సంభల్ (Sambhal) ప్రాంతంలో 45 ఏళ్ల అనీష్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పొరుగున ఉండే రయీస్ అహ్మద్ (Raees Ahmed), సితార (Sitara) అనే దంపతులు అతడ్ని ఇంటికి పిలిపించి స్క్రూడ్రైవర్, ప్లైయర్స్ (Screwdriver and pliers) వంటి పనిముట్లతో చిత్రహింసలకు గురిచేసి చంపేశారు. ఘటనకు పాల్పడిన దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితుడి కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం.. అనీష్ వద్ద ఆ దంపతులు రూ.7 లక్షలు అప్పు తీసుకున్నారు. అప్పు తీర్చమన్నందుకే అతడ్ని హత్య చేశారని ఆరోపిస్తున్నారు. అయితే పోలీసుల వెర్షన్ మాత్రం మరోలా ఉంది. వివాహేతర సంబంధం కారణంగానే అనీష్ హత్య జరిగందని పేర్కొన్నారు.
మృతుడి తండ్రి ఏమన్నారంటే?
అనీష్ తండ్రి ముస్తకీం (Mustakim) మాట్లాడుతూ ‘నా కుమారుడి (Anish)ని దారుణంగా హత్య చేశారు. చేతులు, కాళ్లు విరిచేశారు. బట్టలు విప్పేశారు. ఇంటికి పిలిపించుకుని చంపేశారు’ అని అన్నారు. హత్యకు కారణం ఏమై ఉంటుందనే ప్రశ్నకు స్పందిస్తూ ‘అనీష్ కు వివాహం నిశ్చయమైంది. అతను తన పొరుగువారి ఇంటికి వెళ్లి ఏళ్ల క్రితం అప్పుగా ఇచ్చిన రూ.7 లక్షలు అడిగాడు. అలా అడిగినందుకే నా కొడుకును అంత దారుణంగా చంపేశారు. నేను చెప్పలేనంత భయంకరంగా ఉంది శవం’ అని ముస్తకీం కన్నీరుమున్నీరు అయ్యారు. కుటుంబ సభ్యుల ప్రకారం.. తీవ్రంగా గాయపడిన అనీష్ దంపతుల బారి నుంచి తప్పించుకొని ఇంటికి పరిగెత్తుకొచ్చాడు. చివరకూ ఇంట్లోనే తుదిశ్వాస విడిచాడు.
Also Read: Pak Army Chief: వాళ్ల జోలికెళ్తే.. సగం ప్రపంచాన్ని లేపేస్తారట.. పాక్‌కు అంత సీన్ ఉందా?
వివాహేతర బంధం వల్లే..
మరోవైపు కేసుకు సంబంధించిన వివరాలను ఏఎస్పీ రాజేశ్ కుమార్ శ్రీవాస్తవ (Additional Superintendent of Police Rajesh Kumar Srivastava) పంచుకున్నారు. ‘మాకు అనీష్ మరణం గురించి సమాచారం ఆలస్యంగా వచ్చింది. అనీష్ ను పొరుగున ఉండే రయీస్ అహ్మద్ అతడి భార్య సితారా దారుణంగా హత్య చేసినట్లు బయటపడింది. వారిని ప్రశ్నించగా బాధితుడు సితారాతో సంబంధం పెట్టుకున్నాడని తెలిసింది. దాంతో రయీస్, సితారా హత్యకు పన్నాగం పన్ని అతడిని ఇంటికి పిలిపించుకుని చంపేశారు’ ఏఎస్పీ స్పష్టం చేశారు. అయితే సితారా ఈ హత్యలో ఎందుకు పాలుపంచుకుందో మాత్రం తెలియాల్సి ఉంది.