Rahul Gandhi (IMAGE credit: swetcha reporter)
జాతీయం

Rahul Gandhi: డిజిటల్ ఓటర్ లిస్ట్ బయటపెట్టాలి.. ఈసీని డిమాండ్ చేసిన రాహుల్ గాంధీ

 Rahul Gandhi: త్వరలో బిహార్ ఎన్నికలు జరగనున్నాయి. అయితే, ఎన్నికల సంఘం భారీగా ఓట్లను తొలగించడం వివాదాస్పదమైంది. ఇదే సమయంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈసీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో కలిసి గత ఎన్నికల్లో పొందిన లబ్ధిని ఆధారాలతో సహా బయటపెట్టారు. రోజూ ఏదో ఒక వీడియోను రిలీజ్ చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. కూడా డిజిటల్ ఓటర్ లిస్ట్ బయట పెట్టాలని డిమాండ్ చేశారు.

 Also Read: Guvvala Balraju: గువ్వల బాలరాజు చేరికకు పాలమూరు నేతల గైర్హాజరు.. కారణం అదేనా!

వీడియో షేర్ చేసిన రాహుల్+

ఓటు దొంగతనం అనేది ప్రజాస్వామ్యం ఖూనీ కావడమేనని రాహుల్ గాంధీ అన్నారు. స్వేచ్ఛాయుతమైన ఎన్నికలకు స్వచ్ఛమైన ఓటర్ జాబితా అవసరమని చెప్పారు. ఎన్నికల కమిషన్ ఈ దిశగా ఆలోచించాలన్నారు. డిజిటల్ ఓటర్ లిస్ట్‌ను బయటపెట్టాలని, దానిద్వారా రాజకీయ పార్టీలు, ప్రజలు దాన్ని స్వయంగా ఆడిట్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ డిమాండ్‌పై తమకు మద్దతు తెలపాలని 9650003420 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలని ప్రజలను కోరారు. అలాగే, votechori.in/ecdemand వెబ్‌సైట్‌ను చూడాలని పిలుపునిచ్చారు.

సుప్రీంకోర్టులో ఈసీ అఫడివిట్

మరోవైపు, బిహార్‌లో తొలగించిన ఓట్లపై వివాదం చెలరేగడంతో ఎన్నికల సంఘం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిది. అర్హత ఉన్న ఏ ఓటర్ పేరును తొలగిచలేదని స్పష్టం చేసింది. పలు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా నుంచి భారీగా పేర్లు తొలగించినట్టు ఆరోపణలు రావడంతో ఎన్నికల సంఘాన్ని సమాధానం చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో అఫడివిట్ దాఖలు చేసిన ఈసీ, జాబితా నుంచి ఓటర్ పేరును తొలగించే ప్రక్రియ అనేది నిబంధనల మేరకే జరుగుతోందని తెలిపారు.

Also Read: Raksha Bandhan: గద్వాల జిల్లాలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్