MP Kishan Reddy: ప్రజల జీవన విధానంలో వచ్చిన మార్పుల కారణంగా మనకు తెలియకుండానే అనారోగ్యం పాలవుతున్నామని, ప్రతి వంద మందిలో 95 మంది డాక్టర్ల దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన తెలంగాణ మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్ వేర్ హౌజ్‌ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Governor Jishnu Dev Verma)తో కలిసి కిషన్ రెడ్డి(Kishan Reddy0 ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ రిటైర్ అయిన వారు పెన్షన్ మొత్తం వైద్య ఖర్చుల కోసమే వెచ్చించాల్సి వస్తోందన్నారు.
Also Read: Manda krishna: పెన్షన్లపై కేసీఆర్ నోరు తెరిచి అడగట్లేదు.. మందకృష్ణ సంచలన కామెంట్స్!
ఉచితంగా ఆయుష్మాన్ భారత్ పథకం
పేద, మధ్య తరగతి ప్రజలు కూడా అనారోగ్యం పాలైతే జీవితం మొత్తం సంపాదించిన సంపాదన వైద్యం కోసమే ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు. ప్రతి వ్యక్తికి ఏటా రూ.5 లక్షల ఉచిత బీమా అందించే ఆయుష్మాన్ భారత్ ఫథకాన్ని తీసుకొచ్చారన్నారు. అలాగే, 70 ఏళ్లు దాటిన సీనియర్ సిటీజన్లకు ఉచితంగా ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా ఉచిత చికిత్స అందిస్తున్నామన్నారు. సాధారణ మెడికల్ దుకాణాల్లో మందుల ధరలతో పోలిస్తే 50 నుంచి 90 శాతం వరకు తక్కువ ధరకే మందులను అందిస్తున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. మరోవైపు కిషన్ రెడ్డి(Kishan Reddy) సమక్షంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీల నాయకులు బీజేపీలో చేరారు.
Also Read: Transgenders: ట్రాన్స్ జెండర్లందరికీ గుడ్ న్యూస్.. ఇకపై ఉచితంగానే?
