Transgenders: అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో సమాన అవకాశాల కల్పన ప్రణాళికలో భాగంగా తెలంగాణ(Telangana)లోని ట్రాన్స్‌జెండర్లందరికీ ఉచితంగా డిగ్రీ(Degree) కోర్సులను అందించనున్నట్లు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఘంటా చక్రపాణి(Ghanta Chakrapani) వెల్లడించారు. సమ్మిళిత విద్యలో ఇది ఒక అద్భుతమైన ముందడుగు అని ఆయన ఒక ప్రకనటలో తెలిపారు. ట్రాన్స్ జెండర్ల(Transgender)కు ఇలాంటి అవకాశం కల్పించిన మొదటి విశ్వవిద్యాలయంగా అంబేద్కర్ వర్సిరటీ(Ambedkar University) నిలవనుందని పేర్కొన్నారు.
ఉచితంగా కోర్సు మెటీరియల్
2025-26 విద్యా సంవత్సరం నుంచి ఈ వినూత్న పథకం కింద 10+2(ఇంటర్మీడియట్ లేదా తత్సమాన) విద్యార్హత కలిగిన ఏ ట్రాన్స్‌జెండర్ అయినా ఈ డిగ్రీ కోర్సుల్లో చేరవచ్చన్నారు. నామమాత్రపు రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 500 మాత్రమే చెల్లిస్తే సరిపోతుందన్నారు. కాగా అన్ని ట్యూషన్ ఫీజుల(Fee)ను మినహాయించాలని విశ్వవిద్యాలయం నిర్ణయించిందని వెల్లడించారు. ట్యూషన్ ఫీజు మినహాయింపుతో పాటు, ట్రాన్స్‌జెండర్ విద్యార్థులకు ఉచితంగా కోర్సు మెటీరియల్ అందించనున్నామని, అలాగే తరగతులకు హాజరైనా, ఇతర మాధ్యమాల ద్వారా అభ్యసనం కొనసాగించినా ఎలాంటి ఫీజు(Fee) వసూలు చేయబోమని వివరించారు.
Also Read: Bhatti Vikramarka: బీజేపీ నేతలు డ్రామాలు బంద్ చేయాలన్న భట్టి
తరగతులకు కూడా అక్కడే
తెలంగాణ వ్యాప్తంగా ఏ అధ్యయన కేంద్రంలో అయినా అడ్మిషన్ పొందొచ్చని, తరగతులకు కూడా అక్కడే హాజరు కావొచ్చని పేర్కొన్నారు. ఇప్పటికే జైలు శిక్ష పడ్డ ఖైదీలకు, దేశ సేవలో నిరంతరం నిమగ్నమయ్యే సైనిక సిబ్బందికి ఉచిత విద్యను అందిస్తూ వర్సిటీ సామాజిక భాధ్యతను నెరవేరుస్తోందన్నారు. ఇతర వివరాలకు హెల్ప్ డెస్క్ : 040-23680333 / 040-23680555 లేదా 1800 5990 101 లేదా www.braou.ac.in/www.online.braou.ac.in వెబ్ సైట్ సందర్శించాలని సూచించారు.
Also Read: Cyber Fraud: ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి.. రూ.9 కోట్లు పోగొట్టుకున్నాడు..!
