BC Meeting (imagecredit:twitter)
Politics

BC Meeting: గులాబీ తీరుతో క్యాడర్ గందరగోళం.. అయోమయంలో నేతలు

BC Meeting: బీసీ రిజర్వేషన్లపై కరీంనగర్ లో నిర్వహించబోతున్న బీసీసభను బీఆర్ఎస్ పార్టీ వాయిదా వేస్తుంది. 42రిజర్వేషన్ల సాధన కోసం ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచేందుకు సభ నిర్వహించేందుకు సిద్ధమైంది. అయితే వర్షం, శుభకార్యాయాలు, వరుస సెలువుల నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే రీ షెడ్యూల్ ను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. పార్టీ నిర్ణయంతో గులాబీ కేడర్ లో గందరగోళం నెలకొంది. ఎందుకు సభ తేదీని ప్రకటించారు. మళ్లీ ఎందుకు వాయిదావేస్తున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్.

ఇరుకునబెట్టాలని బీఆర్ఎస్ ప్లాన్

స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీని ఇరుకునబెట్టాలని బీఆర్ఎస్ ప్లాన్ వేసింది. అందులో భాగంగా ఈ నెల 8న కరీంనగర్ లో బీసీల భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధమైంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లలో బీసీ నేతలు నిమగ్నమయ్యారు. ఆ సభ బాధ్యతలను మాజీ మంత్రి గంగుల కమలాకర్ కు అప్పగించారు. అయితే సభకు రెండ్రోజులు మాత్రమే ఉంది. సభను వాయిదా వేయబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో ఒక్కసారిగా పార్టీ కేడర్ నైరాశ్యానికి గురవుతున్నారు. బీసీ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి భారీగా జనసమీకరణ చేసి సత్తా చాటడంతో పాటు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని భావించింది. అయితే సభకు జనసమీకరణకు కష్టంగా మారిందని సమాచారం. వర్ష సూచన ఉండటం, శుభకార్యాలు ఉండటంతోనే వాయిదా వేయబోతున్నట్లు పార్టీ నేతలు అభిప్రాయ పడుతున్నారు. త్వరలోనే సభ తేదీని ప్రకటించబోతున్నట్లు సమాచారం. అవసరం అయితే గురువారం(ఈ నెల7న) రోజే రీ షెడ్యూల్ తేదీ ప్రకటించే అవకాశం ఉంది.

Also Read: Crime News: మిస్టరీ వీడిన తిగుళ్ళ నెహ్రూ వార్త.. అదృశ్యమైన వ్యక్తి హత్య

పార్టీ ఫండ్ ఇస్తే జనం తరలిద్దాం

బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ సభ నిర్వహించినా భారీగా జనసమీకరణ చేసేవారు. అప్పుడు నేతలు తన్నీ తానై పార్టీ అధిష్టానం చెప్పకపోయినా సరే సొంతఖర్చులు పెట్టి జనసమీకరణ చేసేవారు. తమకు ప్రజాబలం ఉందని చూపేవారు. అయితే ఓటమి తర్వాత పార్టీ నేతల్లో నైరాశ్యం నెలకొంది. జనసమీకరణ చేస్తే తనకు ఏమీవస్తుందనే ధోరణిలో కొంతమంది ఉండగా, అధికారంలో ఉన్నప్పుడు ఎంత కష్టపడ్డ గుర్తింపు ఇవ్వలేదని ఇప్పుడు ఎందుకు సొంతఖర్చులు పెట్టుకోవాలనే ఆలోచనలోపడ్డారు. పార్టీ ఫండ్ ఇస్తే జనం తరలిద్దాం.. లేకుంటే లేదు. ఎందుకు ముందుపడాలని, ఖర్చులు పెట్టి అప్పుల పాలు ఎందుకు కావాలనే ధోరణలో వెనుకంజ వేస్తున్నారని సమాచారం. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే పార్టీ బీసీ సభను వాయిదా వేస్తున్నట్లు ప్రచారం మొదలైంది. అసెంబ్లీ,పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీసీల పేరుతో సభ పెట్టడం తొలిసారి. అయితే ఈ సభను సైతం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని భావించింది. 42శాతం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలనే లక్ష్యంతో సభకు శ్రీకారం చుట్టింది. ఈ సభలో కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42 శాతం రిజర్వేషన్ కు చట్టబద్ధత కల్పించాకే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని ప్రభుత్వంపై ఒ

ప్రభుత్వం మోసపూరిత హామీలు

ఇప్పటికే కరీంనగర్ బీసీ సభతో ప్రభుత్వాన్ని ఇరుకునబెడతామని అనుకున్న బీఆర్ఎస్ కే రివర్స్ అయిందనే విమర్శలు వస్తున్నాయి. గత నెల 29న తెలంగాణ భవన్ లో బీసీనేతల సమావేశం నిర్వహించి కరీంనగర్ లో 8వతేదీన సభ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. రిజర్వేషన్లపై బీఆర్ఎస్ తరుపున త్వరలో రాష్ట్రపతిని కలవనున్న బీసీ ప్రతినిధుల బృందం కలుస్తుందని, ఓట్ల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలు ఇచ్చిందని, పారదర్శకత లేకుండా కులగణన జరిపిందని నేతలు మండిపడ్డారు. రాష్ట్రపతి వద్ద బిల్లు పెండింగ్ ఉండగానే ఆర్డినెన్స్ తీసుకొస్తామనడం రాజ్యాంగ విరుద్ధం అని, 9 వ షెడ్యూల్ లో చేర్చితేనే చట్టబద్ధత లభిస్తుందని అసెంబ్లీలో తాము స్పష్టం చేశామని, అమలు కాదని తెలిసే కాంగ్రెస్ కాలయాపన మభ్య పెడుతున్నదని బీఆర్ఎస్ పేర్కొంటుంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల వైఖరిని ప్రజల్లో ఎండగడతామని, సభతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని, 42 శాతం రిజర్వేషన్ అమలు చేయకుండా ఎన్నికలు జరిపితే కాంగ్రెస్ ను బొంద పెట్టడానికి బీసీలు సిద్ధంగా ఉన్నారని పేర్కొని చివరి సమయంతో సభను వాయిదా వేస్తుండటంపై పార్టీలోనే తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Also Read: Srushti fertility clinic case: సృష్టి కేసు విచారణలో.. వెలుగులోకి సంచలన నిజాలు

Just In

01

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు