Crime News: సిద్దిపేట జిల్లా ములుగు గ్రామానికి చెందిన తిగుల నెహ్రూ హత్య గురైనట్లు పోలీసులు నిర్ధారణ చేశారు తన స్నేహితుడు మహేష్ హత్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు మహేష్‌తో పాటు ఆయనకు సహకరించిన వారిపై కేసు నమోదు చేసి కోర్టు ముందు హాజరపరిచారు వివరాల్లోకి వెళితే.. గామిలీపురం మహేష్(Mahesh) మేజిద్‌పల్లి గ్రామస్తుడు. ఇతనికి భార్య స్వప్న, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వీరిలో ఒకరు కొండపాక సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతూ ఉండగా, అక్కడ PET (ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్)గా పనిచేస్తున్న నిషా రాణితో మహేష్‌కు పరిచయం ఏర్పడింది. వీరి మధ్య పరిచయం తరచూ ఫోన్ కాల్స్(Phone Calls), వాట్సాప్(WhatsApp) మెసేజ్‌ల ద్వారా సాగి, తరువాత వివాహేతర సంబంధంగా మారింది. అయితే నిషారాణి కూడా వివాహితురాలే.
మహిళలతో వివాహేతర సంబందాలు
2019లో మహేష్‌కు ములుగు(Mulugu) ఐకేపీ సెంటర్లో పనిచేసే తిగుల్ల నెహ్రూ(Tigulla Nehru)తో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ కలిసి చిట్ ఫండ్ లావాదేవీల్లో పాల్గొంటూ, వ్యక్తిగత విషయాలను కూడా పంచుకునేవారు. నెహ్రు కి కొంత మంది మహిళలతో వివాహేతర సంబందాలు ఉన్న విషయం మహేష్(Mahesh)కు తెలియడం వలన మహేష్ అసూయ పెంచుకొన్నాడు. ఈ మధ్య చిట్ ఫండ్ కమీషన్ విషయంలో ఇరువురి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. నెహ్రూ అనేకసార్లు కమీషన్ మొత్తాన్ని ఒంటరిగా తీసుకోవడం, నిషారాణిపై అసభ్యంగా మాట్లాడడం, ఆమెతో శారీరక సంబంధం కోరినట్టు వ్యాఖ్యలు చేయడం వల్ల మహేష్ తీవ్రంగా కోపం పెంచుకున్నాడు. 2025 జూలై 28న నిషారాణి వద్ద ఉన్న బంగారాన్ని మహేష్ తీసుకొని మైక్రో ఫైనాన్స్ లిమిటెడ్(Micro Finance Limited) వర్గల్ బ్రాంచ్ వద్ద రూ58,600 రుణం తీసుకున్నాడు. ఆ డబ్బును చిట్ ఫండ్ బాకీల కోసం వినియోగించనున్నట్టు ఆమెకు చెప్పినా ఆమె నమ్మలేదు.
Also Read: Meeseva: ఈ సర్టిఫికెట్లు జారీ చేయడంలో మీ సేవ కీలకపాత్ర
వైర్‌తో గొంతునులిమి హత్య
అందుకు నెహ్రూను హామీదారుగా తీసుకురావాలని ఆమె చెప్పింది. ములుగు(Mulugu) వద్ద నెహ్రూను కారులో ఎక్కించుకుని నిషారాణి ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ నెహ్రూ మళ్ళీ అసభ్య వ్యాఖ్యలు చేయడంతో, మహేష్ కోపంతో అతన్ని గుద్దడంతో ఆయన అపస్మారక స్థితికి చేరాడు. వెంటనే, ఇంట్లో ఉన్న వైర్‌తో గొంతునులిమి హత్య చేశాడు. శవాన్ని కారులో ఉంచి బయటకు తీసుకెళ్లాడు. అనంతరం, నిషారాణికి విషయం తెలియజేసి, ఆమె తండ్రి నారదాసు కొమురయ్య సాయంతో మృతదేహాన్ని దాచేందుకు గగ్గిళ్లాపూర్ గ్రామానికి వెళ్లాడు. మొదట మృతదేహాన్ని పొలాల్లో దాచి, తర్వాత సరైన వాహనం లభించిన తరువాత, మృతదేహాన్ని రాళ్లతో కట్టి చెరువులో పడేశాడు.
ములుగు కొండపోచమ్మ కెనాల్
ఉబ్బని వినయ్ అనే వ్యక్తి, నెహ్రూ(Nehru) ఫోన్ నుండి ఆయన భార్యకు ఫేక్ కాల్(Fake Call) చేసి అన్న రాడు రేపు వస్తాడు అని చెప్పాడు. నిందితుడు మహేష్, నెహ్రూ భార్యకు రూ15,000 చిట్ ఫండ్ డబ్బును ఇచ్చి అతను బాగానే ఉన్నట్లు నమ్మించడానికి ప్రయత్నించాడు. హత్య అనంతరం, మహేష్, నెహ్రూ యొక్క మొబైల్‌ను ములుగు కొండపోచమ్మ కెనాల్(Kondapochamma Canal) పడేసి ట్రేస్ కాకుండా జాగ్రత్తపడ్డాడు. స్వయంగా పోలీసులకు మృతదేహాన్ని పడేసిన ప్రదేశాన్ని, నిషారాణి నివాసాన్ని, మహేష్ చూపించాడు. నిందితులు గామిలీపురం మహేష్, నిషారాణి, ఉబ్బని వినయ్, నారదాసు కొమురయ్యలను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్ కు పంపించినట్లు గజ్వేల్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి, ములుగు ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపారు.
Also Read: Jogulamba Gadwal: తహశీల్దార్ కార్యాలయంలో మాజీ ఆలయ డైరెక్టర్ దందాలు