kalpika (image source :X)
ఎంటర్‌టైన్మెంట్

Kalpika controversy: నటి కల్పికపై కేసు నమోదు.. కన్న తండ్రే..

Kalpika controversy: నటి కల్పిక గణేష్ (Kalpika Ganesh) తన సినిమా కెరీర్ నటన కంటే వివాదాల ద్వారా ఎక్కువగా వార్తల్లో నిలిచింది. తాజాగా హైదరాబాద్‌లోని మొయినాబాద్‌లోని బ్రౌన్ టౌన్ రిసార్ట్‌లో సిగరెట్లు, వైఫై, క్యాబ్ సౌకర్యాలు అందించలేదని ఆరోపిస్తూ రిసార్ట్ సిబ్బందితో గొడవకు దిగింది. మెనూ కార్డు, రూమ్ కీ లను మేనేజర్‌పై విసిరి, అసభ్యంగా మాట్లాడిట్లుగా ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై ఆమె స్పందిస్తూ.. కనీస సౌకర్యాలైన క్యాబ్ ఫెసిలిటీ, వైఫై, సిగరెట్లు అందించడంలో సిబ్బంది సరిగా స్పందించకపోవడంతో బూతులు తిట్టినట్లు ఆమె ఒప్పుకున్నారు. సిబ్బంది దురుసు ప్రవర్తనే కారణమని సమర్థించుకుంది. దీనికి సంబంధించిన ఓ వీడియోను ఇంటర్ నెట్ లో ఉంచింది. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతోంది. తాజాగా నటి కల్పిక విషయంలో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కల్పికపై ఆమె తండ్రి గణేష్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. తన కూతురు డిప్రెషన్లో ఉందని ‘బార్డర్ లైన్ నార్సిస్ట్‌క్ డిసార్డర్’ తో బాధపుడుతుందని తెలిపారు. 2023లో ఆశ హాస్పిటల్లో ట్రీట్‌మెంట్ తీసుకుందని, గత రెండు సంవత్సరాల నుంచి మెడికేషన్ వాడటం లేదని తెలిపారు.

Read also- Sunny Leone: ‘పింక్ లిప్స్’పై క్లారిటీ ఇచ్చిన సన్నీ లియోన్..

బ్రౌన్ టౌన్ రిసార్ట్ వివాదంలో, కల్పిక మేనేజర్ కృష్ణపై మెనూ కార్డు, రూమ్ కీ లను విసిరి, అసభ్యంగా మాట్లాడిన వీడియోలు వైరల్ కావడంతో, నెటిజన్లు ఆమెను తీవ్రంగా విమర్శించారు. ‘అహంకారి’ అని, మరొకరు ‘పబ్లిసిటీ కోసం డ్రామా సృష్టిస్తుంది’ అని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కొందరు ఆమె సిగరెట్లు, వైఫై, క్యాబ్ సౌకర్యాలు అందించలేదన్న ఆరోపణలను సమర్థిస్తూ, రిసార్ట్ సర్వీస్ లోపాలను ఎత్తి చూపారు. ఒడియం బై ప్రిజం పబ్ వివాదంలో కల్పిక ఉచిత కేక్ డిమాండ్ చేసి, బిల్లును చించివేసినట్లు వీడియోలో కనిపించడంతో, నెటిజన్లు ‘పబ్‌లు ఛారిటీలు కాదు, ఉచిత కేక్ కోసం గొడవ చేయడం సిగ్గుచేటు’ అని, మరొకరు ’కేక్ లేకపోతే బర్త్‌డే చెడిపోతుందా? సమస్య పబ్‌లో కాదు, నీలోనే ఉంది’ అని వ్యాఖ్యానించారు. ఒక నెటిజన్ అయితే ‘పూర్తి వీడియో ఉచితంగా విడుదల చేస్తే నీ నిజాయితీ నమ్మొచ్చు’ అని సవాల్ చేశారు. మొత్తంగా నెటిజన్లలో ఎక్కువ మంది కల్పిక ప్రవర్తనను అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Read also- Komatireddy: రాష్ట్రానికే ఆదర్శంగా నల్గగొండ ఇంటిగ్రేటెడ్ స్కూల్

నటి కల్పిక గణేష్ ‘నీతో’ సినిమాతో తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. ఆమె ‘బాడీగార్డ్’ (2012), ‘అవును’, ‘అర్జున్ రెడ్డి’, ‘ఎవరు’ వంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించింది. అయితే, ఆమె నటన కంటే వివాదాల ద్వారా ఎక్కువగా వార్తల్లో నిలిచింది. ఇంతకు ముందు గచ్చిబౌలిలోని ఒడియం బై ప్రిజం పబ్‌లో తన బర్త్‌డే సందర్భంగా కాంప్లిమెంటరీ కేక్ అడిగి, బిల్లు చెల్లించకుండా సిబ్బందితో వాగ్వాదానికి దిగింది. సిబ్బంది ఆమెను, ఆమె స్నేహితురాలిని దూషించారని ఆరోపించడంతో ఈ ఘటనపై కేసు నమోదైంది. 2023లో దర్శకుడు బాలాజీ మోహన్, నటి ధన్య బాలకృష్ణలపై సోషల్ మీడియాలో అవమానకర వ్యాఖ్యలు చేసి, తర్వాత క్షమాపణ చెప్పింది. ఈ వివాదాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమెపై ప్రతికూల ప్రభావం పడింది. కొందరు ఆమె ప్రవర్తనను ఖండిస్తూ, ఇదంతా ఆమె పబ్లిసిటీ కోసం చేస్తుందంటూ కామెంట్లు పెడుతున్నారు.

Just In

01

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు