Srushti fertility clinic case( IMAGE credit: swetcha reporter or twitter)
తెలంగాణ

Srushti fertility clinic case: సృష్టి కేసు విచారణలో.. వెలుగులోకి సంచలన నిజాలు

Srushti fertility clinic case: యూనివర్సల్ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో సంచలన వివరాలు వెలుగు చూస్తున్నాయి. దీంట్లో ప్రధాన నిందితురాలిగా ఉన్న డాక్టర్ నమ్రత(Dr. Namrata)కు చైల్డ్​ ట్రాఫికింగ్ గ్యాంగులతో సంబంధాలు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్(Hyderabad)లోని మరో నాలుగు సెంటర్లు కూడా సరోగసీ పేర చైల్డ్ ట్రాఫికింగ్ కు పాల్పడినట్టుగా దర్యాప్తులో వెల్లడైంది. కాగా, కస్టడీ గడువు ముగియటంతో పోలీసులు డాక్టర్ నమ్రతను మంగళవారం సాయంత్రం సికింద్రాబాద్(Secunderabad) కోర్టులో హాజరు పరిచి చెంచల్​ గూడ మహిళా జైలుకు తరలించారు. అంతకు ముందు గాంధీ ఆస్పత్రిలో ఆమెకు వైద్య పరీక్షలు జరిపించారు. అక్కడ నమ్రత మీడియాతో మాట్లాడుతూ వైజాగ్ లో జరిగిన కేసులో తనపై ఇక్కడ కేసులు పెట్టారని వ్యాఖ్యానించారు. ఇక, ఇదే కేసులో తాజాగా అరెస్ట్ చేసిన మరో డాక్టర్ విద్యులతను అధికారులు నార్త్ జోన్ డీసీపీ కార్యాలయంలో సుధీర్ఘంగా విచారించారు. కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకున్న కళ్యాణి, ధనశ్రీ సంతోషిలను కూడా ప్రశ్నించారు.

 Also Read: TS News: ఖమ్మం కలెక్టరేట్‌లో డ్రైవర్.. ఎవరూ ఊహించని పనులు!

సరోగసి పేర చైల్డ్ ట్రాఫికింగ్...
సంతానం కోసం తన వద్దకు వచ్చిన వారికి సరోగసీ ద్వారా అమ్మానాన్నలయ్యే భాగ్యాన్ని కలిగిస్తానని చెప్పి డాక్టర్ నమ్రత మోసాలు చేసిన విషయం తెలిసిందే. ఇతరులకు పుట్టిన పిల్లలను డబ్బు ఇచ్చి కొని సరోగసి ద్వారా పుట్టారంటూ తనను ఆశ్రయించిన వారికి ఇస్తూ ఒక్కో జంట నుంచి 30 నుంచి 40లక్షల రూపాయలు తీసుకుంది. రాజస్తాన్ కు చెందిన గోపాల్​ సింగ్​ దంపతులు ఇచ్చిన ఫిర్యాదుతో డాక్టర్​ నమ్రత కొనసాగిస్తున్న ఈ చైల్డ్​ ట్రాఫికింగ్ దందా వెలుగులోకి వచ్చింది.

కోర్టు అనుమతితో…
కాగా, కేసులో మరిన్ని వివరాలు తెలుసుకోవాల్సి ఉండటంతో దర్యాప్తు అధికారులు మొదట డాక్టర్ నమ్రతను కోర్టు అనుమతితో అయిదు రోజులపాటు కస్టడీకి తీసుకున్నారు. ఆ మరుసటి రోజు ఇదే కేసులో నిందితులుగా ఉన్న కళ్యాణి, ధనశ్రీ సంతోషిలను కూడా కస్టడీకి తీసుకున్నారు.

సంచలన వివరాలు…
వీరిని జరిపిన విచారణలో పలు సంచలన వివరాలు వెలుగు చూసినట్టుగా సమాచారం. డాక్టర్ నమ్రతకు తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన చైల్డ్ ట్రాఫికింగ్​ ముఠాలతో సంబంధాలు ఉన్నట్టుగా వెల్లడైందని తెలిసింది. వీరి నుంచి లక్ష మొదలుకుని 5లక్షల వరకు ఇచ్చి పిల్లలను కొంటూ సంతానం కోసం తన వద్దకు వచ్చిన వారికి సరోగసి ద్వారా పుట్టారని చెప్పి 30 నుంచి 40 లక్షలు తీసుకున్నట్టుగా బయట పడిందని తెలిసింది. దీంట్లో హర్ష, పవన్​, నందిని తదితరులు ఆమెకు సహకరించారని వెల్లడైందని సమాచారం.

ఈ ముగ్గురు గతంలో పిల్లలను అమ్ముతూ అరెస్టయినట్టు కూడా తేలిందని తెలియ వచ్చింది. ఇక, హైదరాబాద్​ లోని పెట్టీకేర్​, హెడ్జ్​, ఒయాసిస్​ తోపాటు మరో సెంటర్​ కేంద్రంగా కూడా ఇదే విధమైన కార్యకలాపాలు నడిచినట్టుగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైందని సమాచారం. యువతీ, యువకులకు డబ్బు ఆశ చూపించి వారి నుంచి వీర్యం, అండాలను కూడా సేకరించేవారని కూడా దర్యాప్తులో తేలిందని తెలియవచ్చింది. ఈ మొత్తం వ్యవహారంలో డాక్​ఠర్ సదానందం, డాక్టర్ విద్యులతలు కూడా కీలక పాత్ర వహించారని వెల్లడైనట్టుగా తెలిసింది.
విద్యులత విచారణ…
కాగా, కేసులు నమోదు కాగానే విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నించిన డాక్టర్ విద్యులతను అధికారులు సోమవారం రాత్రి శంషాబాద్​ ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. నార్త్ జోన్ డీసీపీ ఆఫీస్ లో  అధికారులు ఆమెను సుధీర్ఘంగా విచారించారు.

మరోసారి…
ఇదిలా ఉండగా డాక్టర్ నమ్రతను మరోసారి కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకుని ప్రశ్నించాలని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. డాక్టర్ నమ్రతతోపాటు ఆమె కుమారుడు, అడ్వకేట్ అయిన జయంత్ కృష్ణ, డాక్టర్ సదానందం, డాక్టర్ విద్యులతను కూడా కస్టడీకి తీసుకుని ప్రశ్నించాలని అనుకుంటున్నారు. ఈ మేరకు సికింద్రాబాద్ కోర్టులో పిటిషన్లు దాఖలు చేయాలని అధికారులు నిర్ణయించినట్టుగా తెలిసింది.
అక్కడ అయితే…
జైలుకు తరలించే ముందు అధికారులు డాక్టర్ నమ్రతకు నిబంధనల ప్రకారం గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు జరిపించారు. పరీక్షలు ముగిసిన తరువాత హాస్పిటల్​ నుంచి బయటకు వచ్చిన ఆమె మీడియాను ఉద్దేశిస్తూ అసలు కేసు వైజాగ్​ లో జరిగితే తెలిసిన వాళ్లు ఉన్నారని ఇక్కడ తనపై కేసులు పెట్టారని అన్నారు.

 Also Read: Gadwal: పురుగుల అన్నం పెడుతున్నారని విద్యార్థినుల ఆందోళన

Just In

01

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు