Gadwal: గద్వాలలోని భీంనగర్ బీసి బాలికల వసతి గృహం నందు తమకు పురుగుల అన్నం పెడుతున్నారని హస్టల్ ముందు విద్యార్థినీలు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా అన్నంలో పురుగులు వస్తున్నాయని, ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థినీల ఆందోళనకు ఏబివిపీ నాయకులు మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఏబివీపీ నాయకులు మాట్లాడుతూ
విద్యార్థులకు కనీసం నాణ్యమైన భోజనం అందించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
వార్డెన్ కక్ష సాధింపు చర్య
మెనూ ప్రకారం భోజనం వడ్డించాలని ప్రశ్నించే విద్యార్థినీలపై హాస్టల్ వార్డెన్(Hostel Warden)కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. సరిపడా భోజనం పెట్టక పోవడంతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. హస్టల్ లో విద్యార్థినీల సంఖ్య అనుగుణంగా గదులు లేవని, బాత్రూమ్ ల సమస్య ఉందని, హాస్టల్ త్రాగు నీటి సమస్య ఉందన్నారు. హస్టల్ చుట్టూ ప్రహారీ గోడ లేక భయంగా నివసిస్తున్నారని ఆరోపించారు. హాస్టల్‌లో విద్యార్థినీలకు సరైన వసతులు కూడా లేవని.. ఈ విషయాన్ని పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Meeseva: ఈ సర్టిఫికెట్లు జారీ చేయడంలో మీ సేవ కీలకపాత్ర
హాస్టల్ వార్డెన్ ను సస్పెండ్ చేయాలి
హస్టల్ లో నెలకొన్న సమస్యలపై హాస్టల్ వార్డెన్(Hostel Warden)క దృష్టికి తీసుకెళ్తే అకారణంగా దుర్భాషలాడుతోందని విధ్యార్థినీలు ఆరోపించారు. తక్షణమే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న హాస్టల్ వార్డెన్(Hostel Warden)క పై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ(AbvP) నాయకులు డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న హాస్టల్ వార్డెన్ రంజిత(Hostel Warden Rajitha)క అక్కడి చేరుకున్నారు. విద్యార్థి సంఘాలతో వాగ్వివాదానికి దిగారు. హాస్టల్ వార్డెన్ ను సస్పెండ్ చేయాలని విద్యార్థులు ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఈడి ఎస్ సీ కార్పోరేషన్ అధికారిణి నిషిత విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఏదైన సమస్యలుంటే నేరుగా ఫిర్యాదు చేయాలని సూచించారు. అనంతరం హాస్టల్ ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ(AbvP) స్టేట్ కన్వీనర్ రాజ్ కుమార్, ఏబీవీపీ నగర కార్యదర్శి పద్మశ్రీ, ఉపాధ్యక్షులు నరేష్ పటేల్, కళాశాల అద్యక్షుడు రఘువంశీ, ఉపాధ్యక్షులు తేజ, జిల్లా కార్యాలయ కార్యదర్శి నరేష్,సాయి హర్ష, మురళి, నరేంద్ర, మరియు హాస్టల్ విద్యార్థినీలు పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరిస్తానని హామీనిచ్చిన అధికారి
హాస్టల్ విద్యార్థిననీల సమస్యలపై ఎస్సీ కార్పొరేషన్ అధికారి నిషిత మాట్లాడుతూ బీసీ బాలికల వసతి గృహంలో విద్యార్థులు బయట కూర్చుని ధర్నా చేస్తున్నారన్న విషయం తెలుసుకొని హాస్టల్ కు చేరుకొని విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగిందని ఎస్సీ కార్పొరేషన్ అధికారి నిషిత తెలిపారు. ముఖ్యంగా ఆహారంలో పురుగులు వస్తున్నాయని టాయిలెట్స్ నిర్వహణ సరిగా లేదని, వర్కర్లు తమతో పని చేస్తున్నారని, హాస్టల్లో నెలకొన్న సమస్యలను హాస్టల్ వార్డెన్ కు తెలిపినా ఆమె పట్టించుకోవడంలేదని విద్యార్థినీలు నా దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. అదేవిధంగా వారి సమస్యలపై సిబ్బందిని సైతం ప్రశ్నించడం జరిగిందని, పూర్తిస్థాయి నివేదిక రూపొందించి తగిన చర్యలు తీసుకునేందుకు కలెక్టర్ కు నివేదిక సమర్పిస్తానన్నారు.ఇకమీదట హాస్టల్లో సమస్యలు లేకుండా వ్యక్తిగతంగా దృష్టి సారిస్తానని ఆమె తెలిపారు.
Also Read: Jogulamba Gadwal: తహశీల్దార్ కార్యాలయంలో మాజీ ఆలయ డైరెక్టర్ దందాలు