Tirupati (Image Source: Twitter)
Viral

Tirupati: తిరుపతిలో రెచ్చిపోయిన పోకిరీలు.. నడిరోడ్డుపై కోటింగ్ ఇచ్చిన పోలీసులు

Tirupati: దేశంలోని అత్యంత పవిత్రమైన ప్రదేశాల్లో తిరుమల ఒకటి. కలియుగం దైవం వెంకటేశ్వరుడ్ని దర్శించుకునేందుకు దేశం నలుమూల నుంచి శ్రీవారి భక్తులు తరలివస్తుంటారు. స్వామి వారిని దర్శించుకొని మెుక్కులు చెల్లించుకుంటారు. కాగా, తిరుమలకు పాదల చెంత ఉన్న తిరుపతి కూడా ఆధ్యాత్మికంగా ఎంతగానో కీర్తి గడించింది. అలాంటి పవిత్రమైన ప్రాంతంలో కొందరు పోకిరీలు రెచ్చిపోయారు. ఫుల్లుగా మద్యం సేవించి స్థానికులను భయాందోళనకు గురిచేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. తమదైన శైలిలో వారికి బుద్ధి చెప్పారు.

నడిరోడ్డుపై పోలీసు కోటింగ్..
తిరుపతి లోని లీలామహల్ జంక్షన్ సమీపంలోని అమెరికన్ బార్ వద్ద ముగ్గురు అల్లరి మూకలు వెకిలి చేష్టలు చేశారు. రోడ్డుపై వెళ్తున్న తల్లికూతురు పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. అలాగే అటుగా వెళ్తున్న పాదాచారులపైన దాడికి యత్నించారు. దీంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటీన ఘటనా స్థలికి చేరుకున్న ఓ కానిస్టేబుల్.. పోకిరీలకు నడిరోడ్డుమీద బుద్ది చెప్పాడు. లాఠీతో రోడ్డుపైనే కుళ్లబోడిచాడు.

మరొకర్ని పట్టించిన స్థానికులు..
అయితే ఇద్దరిపై కానిస్టేబుల్ దాడి చేస్తుండగా.. మరో నిందితుడు తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దీంతో స్థానికులు గమనించి.. అతడి వెంటపడ్డారు. కొద్దిదూరం పరిగెత్తగానే నిందితుడు పరిగెత్తి కిందపడిపోయాడు. దీంతో అతడ్ని పోలీసు వద్దకు పట్టుకొచ్చి కోటింగ్ ఇప్పించారు. పోలీసుతో పాటు స్థానికులు సైతం పోకిరీ బ్యాచ్ పై దాడి చేయడం గమనార్హం. కొద్దిసేపటి తర్వాత వాహనంలో మరికొంతమంది పోలీసు సిబ్బంది వచ్చి.. పోకిరీలను ఎక్కించుకొని తీసుకెళ్లారు. పోలీసులు చేసిన పని పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: YS Sharmila: బెన్‌ఫిట్ టికెట్లపై ఉన్న శ్రద్ధ.. రైతుల గిట్టుబాటు ధరపై లేదు.. పవన్‌పై షర్మిల ఫైర్!

ఇటీవల తెనాలిలోనూ..
కొద్దిరోజుల క్రితం తెనాలి టూ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోనూ కొందరు యువకులకు పోలీసులు ఇదే శైలిలో ట్రీట్ మెంట్ ఇచ్చారు. మద్యం మత్తులో కానిస్టేబుల్ పై దాడి చేశారని ఆరోపిస్తూ.. జాన్ విక్టర్, బాబూలాల్, రాకేష్ పై నడిరోడ్డుపై కూర్చోబెట్టి లాఠీతో చితకబాదారు. ముగ్గురి అరికాళ్లపై సీఐ రాములు లాఠీతో విపరీతంగా కొట్టారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి. ఇది రాజకీయంగానూ టీడీపీ-వైసీపీల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది.

Also Read: CM Revanth Reddy: తెలంగాణలో ఒక ట్రంప్ ఉండేవాడు.. ప్రజలు పక్కన పెట్టేశారు.. సీఎం రేవంత్

Just In

01

Pawan Kalyan thanks: వారికి కృతజ్ఞతలు తెలిపిన పవన్ కళ్యాణ్.. ప్రత్యేకించి అభిమానులకు అయితే..

OG Concert: ‘ఓజీ’ సినిమాలో హీరో తాను కాదంటూ బాంబ్ పేల్చిన పవన్.. ఇంతకూ వారు ఎవరంటే?

Ind Vs Pak: కీలక క్యాచ్‌లు నేలపాలు.. టీమిండియా ముందు భారీ టార్గెట్

BRS women wing: బీఆర్ఎస్ మహిళా విభాగ అధ్యక్షురాలి పదవి ఎవరికి?

OTT movie review: పేరెంట్స్ అలా చేయడంతో దానికి రెడీ అయిన స్టూడెంట్.. ఏం చేసిందంటే?