Dasara 2025: ప్రస్తుతం, దేశమంతటా దేవి నవరాత్రుల సందడి కొనసాగుతోంది. తొమ్మిది రోజుల భక్తులు అమ్మవారి ఆరాధిస్తుంటారు. అనంతరం వచ్చే పదవ రోజు విజయదశమి.. దీనిని దసరా పండుగ అని కూడా పిలుస్తారు. అయితే, ఏ ఏడాది అక్టోబర్ 2న దసరా పండుగను అంగ రంగ వైభవంగా జరుపుకోనున్నారు. చెడుపై మంచి విజయం సాధించిన సందర్భాన్ని సూచించే ఈ పండుగ హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైనది. ఈ రోజున పూజలు, వేడుకలతో పాటు దానధర్మాలు చేయడం మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. విజయదశమి రోజున మన శక్తి మేరకు చేసే చిన్న దానం కూడా సంవత్సరం పొడవునా సుఖసంతోషాలను, అష్టైశ్వర్యాలను అందిస్తుందనిభక్తుల విశ్వాసం. అయితే, ఈ పవిత్రమైన రోజున కొన్ని వస్తువులు దానం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
పసుపు వస్త్రాల దానం
వ్యాపారంలో విజయం సాధించాలనుకునేవారు, ఆర్థిక స్థిరత్వం కోరుకునేవారు దసరా రోజున పసుపు రంగు వస్త్రాలు దానం చేస్తే లక్ష్మి దేవి అనుగ్రహం కలుగుతుందని పండితులు సూచిస్తున్నారు. బ్రాహ్మణుడికి పసుపు వస్త్రంతో పాటు కొబ్బరికాయ, తీపి పదార్థాలు, దానం చేయాలి. పసుపు రంగు బృహస్పతి గ్రహానికి సంకేతం కాబట్టి, ఈ దానం వల్ల వ్యాపారంలో అడ్డంకులు తొలగి, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయని చెబుతున్నారు.
తెల్లని వస్త్రాల దానం
తెలుపు రంగు శాంతికి గుర్తుగా చెబుతుంటారు. ఇది స్వచ్ఛతను సూచిస్తుంది. దసరా రోజున తెల్లని వస్త్రాలను నిరుపేదలకు దానం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబంలో అనవసర గొడవలు, ఆందోళనలు తగ్గి సంతోష వాతావరణం నెలకొంటుందని పండితులు అంటున్నారు.
గుప్త దానం
శాస్త్రాల ప్రకారం, గుప్త దానం అన్ని దానాల కంటే ఉత్తమమైనది. ఈ దానం ఎవరికీ తెలియకుండా, ఎటువంటి ప్రచారం ఆశించకుండా చేయాలి. దసరా రోజున ఆహారం, దుస్తులు లేదా ధనాన్ని నిరుపేదలకు అందించండి. ఇలాంటి దానం ఇంట్లోని ప్రతికూల శక్తులను తొలగించి, సుఖసంతోషాలను నింపుతుంది.
