health ( Image Source: Twitter)
Viral

Toilet Habits: టాయిలెట్‌ లో ఫోన్ వాడుతున్నారా.. అయితే, ఆ ప్రాణాంతక సమస్య రావడం పక్కా!

Toilet Habits: స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు మన జీవితంలో ఒక భాగమారిపోయింది. అన్నం తినడం నుంచి బాత్రూమ్ వెళ్లడం వరకు ఫోన్ లేనిదే చాలామంది ఉండలేకపోతున్నారు. కానీ, ఈ చిన్న గాడ్జెట్ మనల్ని బానిసల్లా మార్చేస్తోంది. టాయిలెట్‌లో కూర్చుని రీల్స్ చూడటం, న్యూస్ చూడడం, వీడియోలు ప్లే చేయడం.. ఇవన్నీ సర్వసాధారణంగా మారాయి. కానీ, ఈ అలవాటు మనల్ని పైల్స్ (మొలలు) లాంటి బాధాకరమైన సమస్యలోకి నెట్టేస్తాయని తెలుసా? అయితే, దీని గురించి ఒక తాజా అధ్యయనం షాకింగ్ విషయాలు వెల్లడించింది. టాయిలెట్‌లో ఫోన్ వాడితే పైల్స్ వచ్చే రిస్క్ 46% వరకు ఉంటుందని చెబుతున్నారు.

Also Read: Aadhaar Download WhatsApp: ఇంట్లోనే ఉండి వాట్సాప్‌లో ఆధార్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలుసా.. నంబర్ ఇదే.. సేవ్ చేసుకోండి!

పైల్స్ అంటే ఏంటి?

పైల్స్ లేదా హెమోరాయిడ్స్ అంటే మలద్వారం లోపల లేదా చుట్టూ ఉండే రక్తనాళాలు ఉబ్బి, వాపుకు గురికావడం. దీనివల్ల తీవ్ర నొప్పి, దురద, రక్తస్రావం లాంటి సమస్యలు తలెత్తుతాయి.

Also Read: CM Revanth Reddy: మీ తలరాత మీ చేతుల్లోనే ఉంది.. వ్యసనాలకు బానిస కావొద్దు.. సీఎం స్వీట్ వార్నింగ్!

టాయిలెట్‌లో ఫోన్ వాడటం ఎందుకు సమస్య?

సమస్య ఫోన్‌తో కాదు, దానివల్ల టాయిలెట్‌లో గడిపే అదనపు సమయంతో. ఎక్కువసేపు టాయిలెట్ సీటుపై కూర్చోవడం వల్ల పొత్తికడుపు కింది భాగంలోని కండరాలపై ఒత్తిడి పడుతుంది. ఇది మలద్వారం వద్ద రక్త ప్రసరణను నిదానం చేసి.. రక్తం నిలిచిపోయేలా చేస్తుంది. ఈ పరిస్థితి క్రమంగా రక్తనాళాలను బలహీనపరిచి, పైల్స్‌కు దారితీస్తుంది.

Also Read: Jupally Krishna Rao: గోల్ఫర్లు ప్రీమియర్ గమ్యస్థానంగా హైదరాబాద్ తీర్చిదిద్దుతాం: మంత్రి జూపల్లి కృష్ణారావు

అధ్యయనం ఏం చెబుతోంది?

1. అమెరికాలో 45 ఏళ్లు పైబడిన వారిపై జరిగిన ఓ అధ్యయనం ఈ విషయాన్ని వెల్లడించింది. 66% మంది టాయిలెట్‌లో ఫోన్ వాడతామని చెప్పారు.
2. ఫోన్ వాడేవారిలో 37% మంది 5 నిమిషాలకు మించి సమయం గడుపుతున్నారు. ఫోన్ వాడనివారిలో కేవలం 7% మంది మాత్రమే ఇంత సమయం తీసుకుంటున్నారు.
3. వయసు, బరువు, ఆహార అలవాట్లు వంటి అంశాలను పక్కన పెట్టినా, టాయిలెట్‌లో ఫోన్ వాడేవారిలో పైల్స్ రిస్క్ 46% ఎక్కువగా ఉందని తేలింది.

Just In

01

Hyderabad-Vijayawada: హైదరాబాద్ – విజయవాడ ప్రయాణం 2 గంటలే: మంత్రి కోమటి రెడ్డి

Election Commission: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఈసీ అబ్జర్వర్ల నియామకం

Flipkart offer: ఫ్లిప్‌కార్ట్‌లో భారీ ఆఫర్.. ఆ ఫోన్ కొంటే స్మార్ట్ టీవీ ఫ్రీ.. వివరాలు ఇవే..

Upasana: ఢిల్లీ సీఏం రేఖా గుప్తాతో బతుకమ్మ ఆట.. ఉపాసన రేంజ్ చూశారా?

Bathukamma Flowers: బతుకమ్మలో పేర్చే ఒక్కో పువ్వుకి ఒక్కో అర్థం.. ఆ పూలతో ఎన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలో తెసుసా?