Jupally Krishna Rao (imagecredit:swetcha)
తెలంగాణ

Jupally Krishna Rao: గోల్ఫర్లు ప్రీమియర్ గమ్యస్థానంగా హైదరాబాద్ తీర్చిదిద్దుతాం: మంత్రి జూపల్లి కృష్ణారావు

Jupally Krishna Rao: అంతర్జాతీయ ఆటగాళ్లను ఆకర్షించడంతో తెలంగాణ గాల్ఫ్ టూరిజం కేంద్రంగా ఎదిగే సామర్థ్యం ఉందని స్పష్టమవుతోందని మంత్రి జూపల్లి కృష్ణారావు(Min Jupally Krishna Rao) అన్నారు. మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసి, హైదరాబాద్(Hyderabada) ను ప్రపంచ గాల్ఫర్లకు ప్రీమియర్ గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. తెలంగాణ గోల్కొండ మాస్ట‌ర్స్ గోల్ఫ్ టోర్న‌మెంట్ -2025 ముగింపులో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Redddy) పెద్ద‌పీట వేస్తున్నార‌ని పేర్కొన్నారు. వేల కోట్లు రూపాయల పెట్టుబడులను ఆకర్షించి, కొత్త భాగస్వామ్యాలను ఏర్పరిచి, మన పర్యాటక రంగాన్ని మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లేందుకు విత్తశుద్ధితో పని చేస్తున్నామని తెలిపారు.

బంగ్లాదేశీ గోల్ఫర్ జమాల్ హుస్సేన్..
తెలంగాణలో ఉన్న పర్యాటక ప్రాంతాలను సందర్శించాలని ప్రపంచ పర్యాటకులకు ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నామన్నారు. అంత‌ర్జాతీయ స్థాయిలో గోల్ఫ్ టోర్న‌మెంట్‌ల‌ను హైద‌రాబాద్(Hyderabada) వేదిక‌గా నిర్వ‌హించ‌బోతున్నామ‌ని వెల్లడించారు. అనంతరం విజేత బంగ్లాదేశీ గోల్ఫర్ జమాల్ హుస్సేన్ కు రూ.15 లక్షలు, రన్నరప్ అక్షయ శర్మకు రూ. 10 లక్షల ప్రైజ్‌మనీ అందజేశారు. కార్యక్రమంలో హైదరాబాద్‌ గోల్ఫ్‌ క్లబ్‌ అధ్యక్షుడు బీవీకే రాజు, పీజీటీఐ సీఈవో అనుదీప్ జైన్, పీజీటీఐ డైరెక్టర్‌ వికాస్‌సింగ్‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Also Read: OG Movie Ticket Hike: ఓజీ సినిమా టికెట్ రేట్ల పెంపుపై.. తనకు తెలియకుండానే జీవో ఇచ్చారని మంత్రి ఫైర్

క‌ళాకారుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి..
తెలంగాణ సాంస్కృతిక సార‌ధి ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ప్ర‌తీ నెల ఒక నిర్ణీత తేదీన‌ వేతనాలు, పీఆర్సీ అమలు, వాహ‌న స‌దుపాయం, తదితర సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్ర‌వారం రవీంద్రభారతిలో నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వం – భాషా సాంస్కృతికశాఖ సారథి కళాకారుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మాట్లాడారు. సాంస్కృతిక సారథి కళాకారులకు హెల్త్ కార్డులు, మృతిచెందిన క‌ళాకారుల‌ కుటుంబాలకు పరిహారం, మెట‌ర్నిటీ లీవులు, ఏరియ‌ర్స్, ఇందిర‌మ్మ ఇండ్లు, బ‌స్ పాసులు వంటి అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి.. పరిష్కారానికి కృషి చేస్తాన‌ని చెప్పారు.

సంక్షేమ ప‌థ‌కాల‌పై రూపొందించిన..
క‌ళాకారులకు జిల్లాకో వాహ‌నం, దానికి మైక్ సిస్టం స‌దుపాయాన్ని క‌ల్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్ర‌భుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను సాంస్కృతిక క‌ళా సార‌ధులు విస్తృతంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని, సామాజిక రుగ్మ‌త‌ల‌పై అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని కోరారు. అనంత‌రం తెలంగాణ ప్ర‌జా ప్ర‌భుత్వ అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల‌పై రూపొందించిన పాట‌ల సీడీని మంత్రి ఆవిష్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో సాంస్కృతిక శాఖ సంచాలకుడు ఏనుగు న‌ర్సింహా రెడ్డి, సాంస్కృతిక క‌ళా సార‌ధి చైర్ ప‌ర్స‌న్ డా. వెన్నెల గ‌ద్దర్, క‌ళాకారులు పాల్గొన్నారు.

Also Read: Harish Rao: ఆదాయం కోసం రాష్ట్రంలో మద్యం ఏరులై పారిస్తారా.. హరీష్ రావు ఫైర్!

Just In

01

OTT Movie: ప్రతీ ప్రేమకథ నిజంతో మొదలవుతుంది.. కానీ ఇక్కడ మాత్రం..

CM Revanth Reddy: మీ తలరాత మీ చేతుల్లోనే ఉంది.. వ్యసనాలకు బానిస కావొద్దు.. సీఎం స్వీట్ వార్నింగ్!

VC Sajjanar: హైదరాబాద్ కమిషనర్‌గా సజ్జనార్.. ఆయన పోలీస్ కెరీర్ గురించి.. ఈ విషయాలు తెలుసా?

MP Kadiyam Kavya: అభివృద్ధి పనులకు నిధులు తెచ్చే బాధ్యత నాది: ఎంపీ కడియం కావ్య

Lokah Chapter 2: ‘కొత్త లోక చాప్టర్ 2’పై అప్డేట్ ఇచ్చిన దుల్కర్ సల్మాన్.. ఇది ఏ రేంజ్‌లో ఉంటుందో!