OG Movie Ticket Hike: మంత్రి కోమటిరెడ్డి, హోం శాఖ మధ్య వార్ కొనసాగుతున్నది. ఓజీ సినిమా రేట్ల పెంపు జీవో విడుదలపై మంత్రి, హోం శాఖ మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నది. తనకు తెలియకుండానే జీవో ఎలా ఇస్తారని మంత్రి ప్రశ్నించినట్లు తెలిసింది. గతంలో సంధ్యా థియేటర్ లో జరిగిన సంఘటన కారణంగా బెన్ ఫిట్ షోలు, రేట్ల పెంపు వంటివి తమ ప్రభుత్వంలో ఉండవని స్వయంగా తానే అసెంబ్లీలో ప్రకటించానని, కానీ ప్రత్యేక జీవో ఎలా ఇస్తారంటూ హోంశాఖను మంత్రి నిలదీసినట్లు సమాచారం. హోం శాఖ సెక్రటరీ రిలీజ్ చేసిన ఈ జీవోపై మంత్రి కోమటిరెడ్డి చాలా ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. ప్రభుత్వ ప్రకటనకు విరుద్ధంగా తీసుకున్న ఆ నిర్ణయంపై తన అసహనాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం.
Also Read: GHMC Commissioner: భవన నిర్మాణ అనుమతికి సరి కొత్త సంస్కరణలు.. జీహెచ్ఎంసీ కమిషనర్ కీలక నిర్ణయం
ఈ జీవో మెలికపై ..? కోర్టు తీర్పు డిఫరెంటే..?
ఓజీ సినిమా రిలీజ్ సందర్భంగా రేట్లు పెంచుకోవచ్చని ఈ నెల 19న హోం శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఓ జీవో రిలీజ్ చేశారు. దీనిపై మంత్రి గుర్రుగా ఉన్నట్లు తెలిసింది. టిక్కెట్ల పెంపు వలన సామాన్యులు నష్టపోతున్నారని ఆయన చెప్తూనే…పక్క రాష్ట్రం జీవో ఇవ్వడంతో ఇక్కడ కూడా ఇచ్చినట్లు ఉన్నారంటూ ఆయన ప్రకటించడం విశేషం. ఇక ఈ జీవోపై హైకోర్టు లో రిట్ పిటిషన్ కూడా దాఖలైంది. సింగిల్ బెంచ్ లో విచారణ జరుగుగా, రేట్ల పెంపు జీవో పై స్టే ఇచ్చింది. దీన్ని మంత్రి కూడా స్వాగతించారు. సామాన్యులపై ఎలాంటి భారం పడకూడదనే తమ ఉద్దేశ్యం అంటూ వెల్లడించారు.
భవిష్యత్ లో నో జీవోలు..?
ఇక నుంచి సినిమాలకు రేట్ల పెంచడం వంటివి జరగవని మంత్రి క్లారిటీ ఇచ్చారు. చిన్న సినిమాలకు, పెద్ద సినిమాలకు ఒకే రూల్ ఉంటుందని మంత్రి క్లారిటీ ఇచ్చారు. ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టామని, రేట్లు పెంచాలని తమను నిర్మాతలు కూడా అడగవద్దని మంత్రి కోరారు. అందరికీ ఒకే న్యాయమన్నారు. ఇక నుంచి ఎలాంటి జీవోలు వెలువడవని నొక్కి చెప్పారు. ఇక సినిమా ఇండస్ట్రీని హైదరాబాద్ హబ్ గా మార్చడమే తమ టార్గెట్ అన్నారు. ప్రభుత్వం తరపున చిత్ర పరిశ్రలకు అన్ని రకాల రాయితీలు లభిస్తాయన్నారు. వాస్తవానికి గతంలో ఆర్టీసీ క్రాస్ రోడ్డులో అల్లు అర్జున్ బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన ఘటన ను దృష్టిలో పెట్టుకొని, ధరల పెంపు, బెనిఫిట్ షోలు వంటివేమీ ఇక నుంచి ఉండవని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మంత్రి కోమటిరెడ్డి కూడా అసెంబ్లీలో హామీ ఇచ్చారు. కానీ ఏపీ డిప్యూటీ సీఎం నటించిన హరిహర వీరమల్లుతో పాటు తాజాగా రీలీజ్ అయిన ఓజీ చిత్రాల ధరల పెంపుపై మంత్రి సీరియస్ గా ఉన్నట్లు తెలిసింది.
Also Read: KTR: స్థానిక ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు