KTR: స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పిలుపు నిచ్చారు. హైదరాబాద్ నుంచి మాజీ మంత్రి హరీష్ రావుతో కలిసి పార్టీ ముఖ్యనేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ కేడర్ ను అలర్టు చేసేందుకు క్షేత్రస్థాయిలో సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేయాలని అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ చార్జులను ఆదేశించారు. ఈ సందర్భంగా కేటీఆర్ (KTR) మాట్లాడుతూ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని అన్నారు.
Also Read: Chiranjeevi: అసెంబ్లీలో బాలయ్య, కామినేని సంభాషణపై స్పందించిన చిరు.. అసలు వాస్తవం ఇదేనట!
ప్రభుత్వ వైఫల్యాలు, స్థానిక సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
అందరితో మమేకం కావాలని, పార్టీ కోసంపని చేసేవారికి, నిత్యం ప్రజల్లో ఉండేవారికి, గెలిచేవారికే టికెట్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. నేతలంతా కలిసి సూచించిన వ్యక్తికే టికెట్లు ఇస్తామని వెల్లడించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై నిత్యం వ్యతిరేకత వస్తుందని, కేసీఆర్ వైపు చూస్తున్నారన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, గ్యారెంటీలు అమలు చేయకపోవడంతో ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, ప్రభుత్వ వైఫల్యాలు, స్థానిక సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. బీఆర్ఎస్ పాలనలో చేసిన పథకాలు, చేసిన అబివృద్ధిని ప్రజలకు వివరించాలన్నారు. మెజార్టీ స్థానాలే లక్ష్యంగా నేతలంతా కృషిచేయాలని పిలుపు నిచ్చారు. ఈ స్థానిక సంస్థలతో క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి నాంది అవుతుందన్నారు.
బీఆర్ఎస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే
సొంత గూటికి మాజీ ఎమ్మెల్యే కోనేరు కొనప్ప చేరారు. గురువారం ఎర్రవెల్లి లోని కేసీఆర్ నివాసంలో బీఆర్ఎస్ లో చేరగా, కోనప్పకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఇతర పార్టీలోకి వెళ్లిన నేతలు తిరిగి రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి ఉన్నారు.
కేసీఆర్ తో కేటీఆర్, హరీష్ రావు భేటి
గులాబీ అధినేత కేసీఆర్ తో కేటీఆర్, హరీష్ రావు గురువారం భేటి అయ్యారు. తాజా రాజకీయాలపై చర్చించారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ చేపట్టడం, ఫార్మూలా ఈ కారు రేసులో విచారణ కొనసాగుతుండటంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించినట్లు సమాచారం. ఎన్నికల్లో ఎలా ముందుకు పోవాలి. అనురించాల్సిన వ్యూహాలను చర్చించినట్లు సమాచారం.
Also Read: Guinness Record: గిన్నిస్ రికార్డ్ బద్దలు కొట్టిన.. ఇండియన్ స్టీల్ మ్యాన్.. 261 కేజీలను అలవోకగా!